సారథి న్యూస్, హుస్నాబాద్: మృతుడి కుటుంబానికి వాట్సాప్ గ్రూపు సభ్యులు మేమున్నామని చేయూతనిచ్చారు. ఈ సందర్భంగా గ్రూప్ అడ్మిన్ దామెర మల్లేశం మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బొందుగుల వెంకటయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. సోషల్ మీడియాలో ఒక్కటైన గ్రూప్ సభ్యులు తలకొంత డబ్బులు వేసుకుని 50కిలోల బియ్యాన్ని అందజేశారు. కార్యక్రమంలో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ మల్లేశం, గ్రూప్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, మెదక్: కొండా లక్ష్మణ్‌బాపూజీ నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని, ఆయనను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మెదక్ అడిషనల్ కలెక్టర్వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రజావాణి హాల్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బాపూజీ […]
సారథి న్యూస్, మెదక్: ప్రతి ఆడపడుచు తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మ పండగను ఘనంగా జరుపుకోవాలని మెదక్ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం మెదక్‌జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆడపడుచులు బతుకమ్మ పండగను ఆనందంగా జరుపుకోవడానికి ప్రభుత్వం చీరలను అందిస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోని గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ చేస్తామని డీఆర్డీవో శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో […]
సారథిన్యూస్, రామాయంపేట / చేవెళ్ల: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆదర్శమహిళ అని పలువురు వక్తలు కొనియాడారు. ఆమె పోరాట పటిమను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ఆమెకు నివాళి అర్పించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో రజక సంఘం అధ్యక్షులు సంగుస్వామి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించారు. మరోవైపు చేవెళ్ల మండల కేంద్రంలో రజకసంఘం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐలమ్మ […]
సారథిన్యూస్, తెనాలి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి ఆదివారం ప్రమాదవశాత్తు తన ఇంట్లో జారిపడ్డారు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వెంటనే తెనాలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. మరోవైపు ఆమెకు ఆస్పత్రిలో ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, యువనేత లోకేశ్, ఇతర సీనియర్ నేతలు నన్నపనేని రాజకుమారి కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి ఆరోగ్య వివరాల గురించి ఆరా తీశారు. మరోవైపు […]
సారథిన్యూస్, అమరావతి: ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ఎలాగైనా బలోపేతం చేయాలని చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోపార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జీలుగా కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు ప్రతి రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక సమన్వయకర్తను నియమించారు. ప్రస్తుతం కొనసాగుతున్నవారిని పక్కనపెట్టి ఈ అవకాశం కల్పించారు. కొత్తనేతలంతా పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేయాలని బాబు పిలుపునిచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుల జాబితా విజయవాడ : నెట్టెం రఘురాంమచిలీపట్నం: కొనకళ్ళ నారాయణగుంటూరు: తెనాలి శ్రవణ్ […]
బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను వేగవంతం చేసింది ఎన్సీబీ. నలుగురు హీరోయిన్లను ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టింది. ఈ కేసులో ఇప్పటికే రకుల్ ప్రీత్‌సింగ్‌ను ప్రశ్నించిన ఎన్సీబీ, శనివారం మరో ముగ్గురు హీరోయిన్లు.. దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ ను వేర్వేరుగా విచారించింది. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలుస్తోంది. ఈ డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఈ నలుగురి హీరోయిన్ల ఫోన్లను అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకే […]
ప్రపంచంలోని మనుషులందరనీ కరోనా మహమ్మారి వణికిస్తున్నది. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు అని తేడా లేకుండా కరోనా బారినపడతున్నారు. అయితే తాజగా టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ఆమె నుంచి శాంపిల్ సేకరిస్తుండగా చిన్నపిల్లలా బోరున విలపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.