సారథి న్యూస్, నర్సాపూర్: జన్మనిచ్చిన పాపానికి ఓ తల్లిపాలిట కన్నకొడుకే కాలయముడిగా మారాడు. కన్నతల్లి అని కూడా చూడకుండా గొడ్డలితో అతిదారుణంగా హతమార్చాడు. ఈ హృదయ విదారకర సంఘటన బుధవారం మెదక్‌జిల్లా హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్ ఖాన్ పల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. షేర్ ఖాన్ పల్లి గ్రామానికి చెందిన కోటగళ్ల నర్సమ్మ(65)కు నలుగురు కొడుకులు ఉన్నారు. చిన్నకొడుకు నర్సింలు అలియాస్ నర్సింగరావు కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటూ అప్పుడప్పుడు […]
సారథి న్యూస్, వెల్దండ: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా ఇటీవల నియంత్రిత పంటల సాగు విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. రైతులంతా ఒకే చోట చేరి వ్యవసాయ సంబంధిత విషయాలను చర్చించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు వేదికల నిర్మాణాలు నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని పలు గ్రామాల్లో షురూ అయ్యాయి. ఒకటి రెండు గ్రామాల్లో ఇప్పటికే పనులు చివరి దశలో ఉన్నాయి. ప్రారంభోత్సవానికి రెడీ అవుతున్నాయి. […]
ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి క్షేత్రంలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కొడాలి నాని ప్రకటించడం.. దాన్ని బీజేపీ, టీడీపీ, వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చేందుకు బుధవారం తిరుమలకు చేరుకున్నారు. దీంతో తిరుపతిలో టీడీపీ, బీజేపీ, హిందూసంఘాలు తిరుపతిలో మోహరించాయి. ఓ వైపున పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. ఇప్పటికే పలువురు నేతలను అరెస్ట్ చేశారు. […]
న్యూఢిల్లీ: పార్లమెంట్లో వ్యవసాయ బిల్లుల ఆమోదం, అనంతర పరిమాణాలపై బుధవారం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ తమ నిరసన కొనసాగించారు. పార్లమెంట్ ఆవరణలో రాజ్యసభ విపక్ష సభ్యులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. ‘రైతాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు.కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నాని హీరోగా ‘టాక్సీవాలా’ మూవీ ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కలకత్తా నేపథ్యంలో సాగుతుందట. అందుకే సినిమాలో కలకత్తాను చూపించేందుకు ఫిల్మ్‌మేకర్స్ ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమా కథ ఫాంటసీ మిక్స్ అయి, ఎమోషనల్ గా సాగే పక్కా ఫిక్షనల్ డ్రామాగా ఉంటుందని, అందుకోసం పాత కలకత్తా లుక్ కావాల్సి ఉందని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం కలకత్తా వెళ్లినా పాత లుక్ ఉండదు కావునా ఇక్కడే పాతతరం […]
సారథి న్యూస్, కర్నూలు: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ఆపాలని ప్రయత్నిస్తే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని భవన నిర్మాణ కార్మిక సంఘం న్యూ సిటీ కార్యదర్శి కె.సుధాకరప్ప ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం ముజఫర్ నగర్ మట్టి పని అడ్డాలో జీవోనం.17 కాపీలను మాజీ కార్పొరేటర్ బి.సోమన్న మహిళా సంఘం నాయకురాలు ఎస్.ఓబులమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కె.సుధాకరప్ప, బి.సోమన్న మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమ నిధికి రూ.450 కోట్లు జమచేయాలని డిమాండ్ చేశారు. ఈనెల […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంటిపై అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు బుధవారం ఏకకాలంలో హైదరాబాద్‌లో ఆరుచోట్ల దాడులు నిర్వహించారు. గతంలో ఉప్పల్ సీఐగా పనిచేసిన ఆయన పలు ల్యాండ్ సెటిల్మెంట్లు, భూవివాదాల్లో తలదూర్చారనే ఉన్నాయి. తన వాళ్లకు అన్ని పనులు చేసిపెట్టేవారని వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేశారు.
మహేష్ బాబు, పరుశరామ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’ భారీ అంచనాలతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేష్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్స్ ఎంపికకు సంబంధించి పలు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో కీర్తి సురేష్ ఫైనల్ అయిందన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. కానీ ఈ చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటికీ అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ కీర్తి ఆమధ్య ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో కన్ఫర్మ్ చేసింది. అయితే కొద్దిరోజులుగా ఆమె ప్లేస్ […]