సారథి న్యూస్, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంలోని పట్టణాలకు రావాల్సిన గ్రాంట్లకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు శనివారం లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం తెలంగాణలోని మిలియన్ ప్లస్ నగరాల కేటగిరీలో ఉన్న హైదరాబాద్ కు రూ.468 కోట్లు, ఇతర పట్టణాలకు రూ.421కోట్లు కేటాయించిందని, వీటిని ఇప్పటికే విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. తెలంగాణలోని పట్టణాల్లో మౌలిక వసతుల […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగా పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో మరో మూడురోజల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీవర్షానికి హైదరాబాద్మహానగరం తడిసిముద్దయింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, బేగంపేట, ఎంజే మార్కెట్, నాంపల్లి, ఆబిడ్స్, […]
సారథి న్యూస్, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఏకైక భారీ ప్రాజెక్టు సింగూరు రెండేళ్ల తర్వాత జలకళ సంతరించుకుంది. 29 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు వర్షాభావ పరిస్థితుల కారణంగా రెండేళ్లుగా వెలవెలబోయింది. 2018లో ప్రాజెక్టులో 18 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు 16 టీఎంసీల నీటిని తరలించింది. దీంతో సంగారెడ్డి, మెదక్ జిల్లాలో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సింగూరులో నీళ్లు లేక కాల్వల కింద […]
కేంద్రం వ్యవసాయ బిల్లుతో రైతు లోకానికి తీవ్ర అన్యాయం రైతులను కొట్టి కార్పొరేట్లకు పంచేలా ఉంది పార్లమెంట్లో గట్టిగా నిలదీయాలని సూచించిన సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆక్షేపించారు. రైతులను దెబ్బతీసి కార్పొరేట్ వ్యాపారులకు లాభం కలిగించేలా ఉందని, ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావును ఆదేశించారు. రాజ్యసభలో […]
సారథి న్యూస్, హైదరాబాద్: ‘గిఫ్ట్ఏ స్మైల్’ పిలుపులో భాగంగా నాగర్ కర్నూల్జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో కొత్త అంబులెన్స్‌ను బహూకరించారు. ఈ అంబులెన్స్ ను మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు చేతులమీదుగా ప్రగతిభవన్ లో శనివారం ప్రారంభించారు. అలాగే గిఫ్ట్ఏ స్మైల్ పిలుపులో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి ఐదు కొత్త అంబులెన్స్‌లను బహూకరించారు. కార్యక్రమంలో మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, జి.జగదీశ్వర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతుసమన్వయ […]
సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, టీజేఏసీ చైర్మన్ కోదండరాం త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయనున్నాడు. అందుకోసం ఆయన విపక్షాల మద్దతు కూడగట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి పోటీచేసినప్పటికీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో తెలంగాణ యువత, నిరుద్యోగుల్లో కోదండరాం పట్ల సానుభూతి ఉన్నది. సోషల్‌మీడియాలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉన్నది. ఈ క్రమంలో గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగితే కోదండరాం తేలిగ్గా గెలుస్తారని […]
సారథిన్యూస్, హైదరాబాద్: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కార్యాలయంలో కరోనా కేసులు రావడం ఆందోళన కలిగిస్తున్నది. ఈటలకు చెందిన 7 గురు వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం. మంత్రికి చెందిన ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్‌మెన్లకు ప్రస్తుతం కరోనా సోకింది. వారంతా హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు […]
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ పేలుళ్లు జరిపి అల్లకల్లోలం సృష్టిద్దామనుకున్న ఉగ్రవాదుల కుట్రను ఎన్ఐఏ ( నేషనల్ ఇన్విస్టిగేషన్ ఎజెన్సీ) భగ్నం చేసింది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు మెరుపుదాడి నిర్వహించి 9 మంది ఆల్‌ఖైదా టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. టెర్రరిస్టులు దేశరాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లకు స్కెచ్ వేశారని అధికారుల దర్యాప్తులో తేలింది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం, వెస్ట్ బెంగాల్ లో ముషీరాబాద్ లో ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఓ వైపు దేశం […]