సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు కోయిల్ సాగర్ కు మంగళవారం వరద నీరు పోటెత్తింది. దీంతో నాలుగు షట్టర్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. రెండు రోజులుగా తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టుల్లోకి పెద్దఎత్తున నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యానికి మించి చేరడంతో గేట్లను తెరిచినట్టు అధికారులు తెలిపారు.
సారథి న్యూస్, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం దేశాయిపేట గ్రామంలో కౌండిన్య సర్వాయి పాపన్న గీత కార్మికసంఘం గ్రామ అధ్యక్షుడిగా పాకాల మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షుడిగా పెరుమండ్ల వీరేశం గౌడ్, కౌండిన్య యువజన విభాగం అధ్యక్షుడిగా సుద్దాల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా పెరుమండ్ల శ్రీనివాస్ గౌడ్, ఇతర సభ్యులను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికైన అధ్యక్షుడు గౌడ సంఘం యొక్క బలోపేతానికి, ఐక్యతకు తమవంతు కృషి చేస్తామని అన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ […]
సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో మంగళవారం గ్రామ దేవత పోచమ్మ బోనాల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో మహిళలు బోనం కుండలతో ఊరేగింపుగా అమ్మవారి దేవస్థానం వద్దకు తరలొచ్చారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యాలు సమర్పించారు. వేడుకల సందర్భంగా స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న అమ్మవారి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. పరిసరాలను మామిడి తోరణాలు, వేపాకుల మండలతో ముస్తాబు చేశారు.
ఇండస్ట్రీలోనూ.. పాలిటిక్స్ లోనూ తిట్టుకోవడం.. కలిసిపోవడం కామన్ అయిపోయినట్టుంది. మొన్నటికి మొన్న బాలయ్యబాబును ఉద్దేశించి నాగబాబు ఏకంగా యూట్యూబ్ లో తన అక్కసు అంతా వెళ్లబెట్టారు. ఇప్పుడేమో తన తమ్ముడు, బాలయ్య కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ .. ‘2 బ్రదర్స్ కలిసి .. నా తమ్ముడు అలాగే మరొకరు మరొక తల్లి కొడుకు ..సోదర సమానుడు నందమూరి లయన్‌ను పవర్ స్టార్ కలిసిన రోజు..’ అంటూ కొటేషన్ తో సహా పోస్ట్ చేశారు. అప్పుడే […]
నాలుగు రోజుల క్రితం మెగాస్టార్ బ్లాక్ గాగుల్స్, గుండుతో ఉన్న తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ అందరికీ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. ఎన్నో వైవిధ్య చిత్రాల్లో నటించిన చిరంజీవి ఈ గెటప్ తో ఏ సినిమా చేయనున్నారో అన్న క్యూరియాసిటీని కలిగించారు. కానీ చిరు ప్రస్తుతం కొరటాల శివతో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నారు. ఆ మూవీకి అయితే ఈ లుక్ అవసరం లేదు కానీ తర్వాత మెహర్ డైరెక్షన్లో ‘వేదాళం’ రీమేక్ కోసం […]
టాలీవుడ్, కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ నయనతార. ఆమె కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నష్ శివన్ తో ప్రేమలో ఉన్నట్టు అందరికీ తెలిసిన విషయమే. ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అది నిజమో కాదో తెలీదు కానీ..అవేమీ పట్టించుకోకుండా ఈ జంట ఓనమ్ కి సొంత ఊరు కొచ్చి కి వెళ్లారు. అక్కడ పండుగ జరుపుకొని కుటుంబంతో గోవా వెళ్లారు. అక్కడ అందరూ కలిసి నయన్ మదర్ బర్త్ డే […]
హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన కారణంగా విద్యుత్ బిల్లులో రికార్డు చేయలేదని.. ఆ సమయంలో అధికంగా వచ్చిన విద్యుత్ బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లు, శ్రీశైలం పవర్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంపై శాసనసభలో స్వల్ప కాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘కోవిడ్ సందర్భంలో విద్యుత్ బిల్లులు రికార్డు చేయలేదు […]
సారథిన్యూస్, అమరావతి: వైఎస్సార్ ఆసరా పేరుతో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకానికి జగనన్న టోకరా అనే పేరుపెట్టుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘జగన్ మోహన్‌రెడ్డి ఆసరా పేరుతో మహిళలను మోసగిస్తున్నారు. డ్వాక్రా మహిళలంతా ఆసరా సొమ్ముతోనే బతుకుతున్నట్లు జగన్ తొత్తులు మాట్లాడుతున్నారు. ఈ పథకం జగన్మోహన్రెడ్డి కొత్తగా తీసుకురాలేదు. గత ప్రభుత్వంలోనే చంద్రబాబు డ్వాక్రా మహిళలకు రూ. 5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు […]