సారథి న్యూస్, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం దేశాయిపేటలో సోమవారం ‘మేము’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా రోగులకు సాయం అందించారు. కరోనా బాధితుడి కుటుంబానికి 20 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థఫౌండర్ పాకాల మహేశ్‌గౌడ్, సభ్యులు కల్లేపల్లి లక్ష్మణ్, ముదుగంటి సురేశ్, వెంకటరమణ, ఉపసర్పంచ్ సింగిరెడ్డి వెంకట్ రామ్ రెడ్డి, మహిపాల్, గంగస్వామి పాల్గొన్నారు.
భూముల రిజిస్ట్రేషన్‌కు లంచం అవసరం ఉండదు ఏడాదిలోపు భూముల సర్వే మండలిలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, హైదరాబాద్: భూముల రిజిస్ట్రేషన్‌కు ఇకపై లంచం ఇవ్వాల్సిన అవసరం ఉండదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా సోమవారం శాసనమండలిలో కొత్త రెవెన్యూ చట్టాన్ని సభలో ప్రవేశపెట్టి మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల చేతిలో 90శాతానికి పైగా భూములు ఉన్నాయని అన్నారు. 25 ఎకరాలు పైబడి ఉన్న రైతులు కేవలం 6,600 మంది మాత్రమేనని […]
సారథి న్యూస్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో ఉన్న ఆశ్రమానికి వెళ్లి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు త్రిదండి చిన్నజీయర్ స్వామిని పరామర్శించారు. చిన్నజీయర్‌స్వామి తల్లి అలివేలు మంగతాయారు(85) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఈ నేపథ్యంలో స్వామివారిని సీఎం కేసీఆర్ పలకరించి వచ్చారు.
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగర పాలకసంస్థ కమిషనర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు సోమవారం నగరంలోని పలుచోట్ల మున్సిపల్అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. 5వ శానిటరీ డివిజన్ పరిధిలోని బుధవారంపేట సర్వజనాస్పత్రి ఎదురుగా ఉన్న అన్నపూర్ణ, స్పైసి హోమ్స్ హోటల్స్ ను పరిశీలించారు. కుళ్లిపోయిన మాంసపు వంటకాలను తయారుచేసి కస్టమర్లకు అందిస్తున్నట్లు గుర్తించిన శానిటరీ విభాగం అధికారులు దుకాణదారులకు రూ.11వేలు ఫైన్వేశారు. 13వ డివిజన్ పరిధిలోని గాయత్రి ఎస్టేట్ లోని […]
సారథి న్యూస్ రామడుగు: ప్రధాన్ మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరతా అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోలి రామయ్యపల్లి గ్రామంలో అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 14 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న వారందరికీ ఉచితంగా కంప్యూటర్, డిజిటల్ లావాదేవీలు, కిసాన్ క్రెడిట్‌కార్డుకు దరఖాస్తు చేసుకునే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించినట్టు అధికారులు చెప్పారు. కార్యక్రమంలో కేంద్రప్రభుత్వ అధికారులతో పాటు సర్పంచ్ ఉప్ప రాధమ్మ, ఉపసర్పంచ్ కనకయ్య, […]
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాలలో గత రెండ్రోజులగా కురుస్తున్న వర్షాలతో రోడ్ల మీద నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మునగాల ఎస్సై సత్యనారాయణగౌడ్ సూచించారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు మునగాల మండలంలోని తాడువాయి నుంచి తాడువాయి తండా మధ్యలో ఉన్న అలుగు ఉధృతంగా ప్రవహిస్తున్నదన్నారు. ఈ మార్గాల గుండా వెళ్లే ప్రజలు ప్రత్యామ్నాయ దారులు చూసుకోవాలని ఆయన కోరారు. అదే విధంగా మునగాల నుంచి గణపవరం, తిమ్మారెడ్డిగూడెం, కొక్కిరేణి, వెల్దండ, చీదేళ్ల, తంగెళ్ల గూడెం, […]
నీట మునిగిన లోతట్టు కాలనీలు పరిశీలించిన ఎమ్మెల్యే, అధికారులు సారథి న్యూస్, ఆత్మకూరు(కర్నూలు): రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు జిల్లాలోని ఆత్మకూరు పట్టణం జలమయంగా మారింది. సమీపంలోని వాగులు, వంకలు పోటెత్తడంతో వరద పట్టణంలోకి వచ్చిచేరింది. సోమవారం పట్టణంలోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, జేసీ ఖాజామొయినుద్దీన్ స్థానిక అధికారులతో కలిసి పర్యటించారు. లోతట్టు కాలనీల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. ఇళ్లచుట్టూ నీళ్లు చేరిన వారికి స్కూళ్లలో ఆశ్రయం కల్పించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి సాయం […]
సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని, ప్రతి సంక్షేమ కార్యక్రమ లబ్ధిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జి.వీరపాండియన్ కోరారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి మహిళకు ఇస్తున్న రుణాన్ని సద్వినియోగం చేసుకోకుండా పెట్టుబడిగా భావించి వ్యాపారం చేసుకోవాలన్నారు. నగరంలో మహిళా బజార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను కోరారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ డీకే […]