Breaking News

MEPMA

అధికార పార్టీ చెబితేనే ఓకే!

అధికార పార్టీ చెబితేనే ఓకే!

వడ్ల కొనుగోళ్లలోనూ రాజకీయమే రొటేషన్ పద్ధతి పాటించని మెప్మా కలెక్టర్​కు ఫిర్యాదుచేయనున్న మహిళా సంఘాలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: వడ్ల కొనుగోలులోనూ రాజకీయ నడుస్తోంది. నాగర్ కర్నూల్​నగర పంచాయతీల పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు సెంటర్లలో అధికార పార్టీ మద్దతుదారులైన మహిళా సంఘాలకే కట్టబెడుతూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం  వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించింది. వీటిని ఒక్కో ఏడాది ఒక్కో మహిళా సంఘం నిర్వహించడం […]

Read More
మహిళా సాధికారతకు పెద్దపీట

మహిళా సాధికారతకు పెద్దపీట

సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని, ప్రతి సంక్షేమ కార్యక్రమ లబ్ధిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జి.వీరపాండియన్ కోరారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వైఎస్సార్ ​ఆసరా పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి మహిళకు ఇస్తున్న రుణాన్ని సద్వినియోగం చేసుకోకుండా పెట్టుబడిగా భావించి వ్యాపారం చేసుకోవాలన్నారు. నగరంలో మహిళా బజార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ​కార్పొరేషన్ ​కమిషనర్​ను కోరారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ డీకే […]

Read More
మహిళలు ఆర్థికంగా ఎదగాలి

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

సారథి న్యూస్, కర్నూలు: మహిళ ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని అమలుచేసిందని మెప్మా సిటీ మిషన్‌ మేనేజర్‌ మురళి అన్నారు. ఆదివారం నగరంలోని ముజాఫర్‌ నగర్‌లో వైఎస్సార్‌ ఆసరా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితిలోనూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చినమాట ప్రకారం వైఎస్సార్‌ ఆసరా నిధు సమకూర్చడం సంతోషించదగ్గ విషయమని, వనితలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అక్కాచెల్లెమ్మలకు ఆసరా, జగనన్న అమ్మఒడి, […]

Read More

మెప్మా ఆర్పీలకు జీతాలివ్వండి

సారథి న్యూస్​, హుస్నాబాద్: మున్సిపాలిటీలలో పని చేస్తున్న మెప్మా ఆర్పీలకు   వేతనాలు చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్​ చేశారు. శుక్రవారం ఆయన కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​లో మీడియాతో మాట్లాడుతూ.. మెప్మా ఆర్పీలకు సంవత్సరం నుంచి వేతనాలు అందించడం లేదని చెప్పారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మంత్రి కేటీఆర్, మెప్మా డైరెక్టర్ వెంటనే స్పందించి బకాయిలను చెల్లించాలని డిమాండ్​ చేశారు.

Read More