Breaking News

Day: September 11, 2020

తెలంగాణలో 2,426 పాజిటివ్​కేసులు

తెలంగాణలో 2,426 పాజిటివ్ ​కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం 2,426 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,52,602కు చేరింది. తాజాగా 13 మృతిచెందారు. ఇప్పటి వరకు కరోనాతో 940 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలాఉండగా, ఒకేరోజు 2,324 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 338 పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి వివిధ ఆస్పత్రుల్లో 32,195 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,19,467 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Read More
జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిని కలిసిన యువ ఎమ్మెల్యేలు

జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిని కలిసిన యువ ఎమ్మెల్యేలు

సారథిన్యూస్‌, కర్నూలు: కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను గురువారం యువ ఎమ్మెల్యేలు ఎంఏ హఫీజ్‌ఖాన్‌, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌ గురువారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే పెండింగ్‌ పనులను పూర్తిచేయాలని ఇన్‌చార్జ్‌ మంత్రి అనిల్‌ కుమార్‌ దృష్టికి తీసుకెళ్లగా, ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ తెలిపారు.

Read More
ప‌దిరోజుల్లోనే 8 ల‌క్షల కేసులు

ప‌దిరోజుల్లోనే 8ల‌క్షల కేసులు

24 గంట‌ల్లో 96,551 మందికి పాజిటివ్ 45 ల‌క్షలు దాటిన క‌రోనా కేసులు న్యూఢిల్లీ: భార‌త్‌లో క‌రోనా వ్యాప్తి నానాటికీ ఆందోళ‌న‌క‌రంగా మారుతోంది. ఈ నెల‌లో మొద‌టి ప‌దిరోజుల్లోనే (నిన్నటిదాకా) 8 ల‌క్షల కేసులు వచ్చాయంటే దేశంలో మ‌హ‌మ్మారి ఎంత‌లా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన గ‌ణాంకాల ప్రకారం గ‌త 24 గంట‌ల్లోనూ కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 96,551గా నమోదైంది. తాజా కేసుల‌తో దేశంలో ఈ […]

Read More

‘రియా’ కేసులో మీడియా అతి

సుశాంత్​ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిపై బాంబే హైకోర్టు సానుభూతి కనబర్చింది. ‘రియా కేసు విషయంలో మీడియా ఎందుకంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నది. నిరంతరం బ్రేకింగ్​ న్యూస్​లతో ఆమెను ఎందుకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. రియా ఇంటి ఎదుటే మీడియా టెంట్​ వేసుకొని కూర్చొంది. ఆమె కాలి బయట పెడితే .. చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మీడియా ప్రతినిధులు. రియా విషయంలో మీడియా చాలా అతిచేస్తుంది. నిందితురాలికి కొన్ని హక్కులుంటాయి. నేరం విచారణ జరగముందే ఆమెను దోషిగా […]

Read More
ఆలయాలపై దాడులా.. సిగ్గుచేటు

ఆలయాలపై దాడులా.. సిగ్గుచేటు

సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలో వైఎస్సార్ ​సీపీ ప్రభుత్వం విధ్వంసక్రీడను ప్రోత్సహిస్తోందని, హిందూదేవాయాలపై దాడులు జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్​ పార్థసారథి ప్రశ్నించారు. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథాన్ని దగ్ధం చేసిన దోషులను అరెస్టు చేయకుండా.. దాడులపై ప్రశ్నించిన హిందూ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన పిలుపు మేరకు.. అంతర్వేది ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ […]

Read More