సారథి న్యూస్, పెద్దశంకరంపేట: తెలంగాణలోని పల్లెల్లో నేడు అభివృద్ధి పనులను చూసి వచ్చే దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికే ఓటు వేయాలని మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయ రామరాజు కోరారు. మంగళవారం దుబ్బాక నియోజకపరిధిలోని నార్సింగి మండల కేంద్రంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొందరు కేవలం ఎన్నికల సమయంలోనే పల్లెలకు వస్తూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. అభ్యర్థి ఎవరైనా టీఆర్‌ఎస్ బలపర్చిన వారికే ఓటువేసి గెలిపించాలని […]
‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం నటిస్తున్న మరో సినిమా ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’. శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. ‘టాక్సీవాలా’ చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. సాయికుమార్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్, రాజు నిర్మిస్తున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ […]
సారథిన్యూస్, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని అల్వాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాతబస్తీలో కొందరు బీజేపీ మద్దతుదారులను, హిందువులను ఇబ్బంది పెడుతున్నారని అటువంటి వారి చేతులు నరికేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను భారతీయ జనతాపార్టీ కాపాడుకుందని చెప్పారు. హైదరాబాద్ ఎవడబ్బ జాగీరు కాదు అంటూ మండిపడ్డారు. త్వరలో జరుగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. ప్రజా […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెలిపారు. మంగళవారం విజయవాడలో ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం విలేకరులకు వివరాలు వెల్లడించారు. నగరంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్య రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. నీటి సమస్య తలెత్తకుండా రెండవ సమ్మర్ స్టోరేజీ […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం శిరివెళ్ల వాసి, ప్రముఖ సినీనటుడు జయప్రకాష్ రెడ్డి అకాల మరణం తీరని లోటని జిల్లా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ జి.వీరపాండియన్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నంద్యాల టౌన్ హాల్ లో 10రోజుల పాటు ఎంతో విజయవంతంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాల్లో తూర్పు జయప్రకాష్ రెడ్డి పాల్గొన్నారని గుర్తుచేశారు. తెలుగు నాటక […]
సారథి న్యూస్, ములుగు: సఖి కేంద్రాలు మహిళలు, బాలికలకు అండగా నిలవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య సూచించారు. మంగళవారం ములుగు జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో సఖి జిల్లా నిర్వహణ కమిటీ, జిల్లా బాలసంరక్షణ సొసైటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గృహహింస, లైంగిక హింసలను ఎదుర్కొనే మహిళలు, బాలికలకు రక్షణ, న్యాయ, వైద్య సహాయాలు అందుతాయని అన్నారు. జిల్లాలో మార్చి 8న సఖి కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో […]
రష్యా ప్రభుత్వం.. కరోనా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ వ్యాక్సిన్ అన్ని దశల్లో విజయవంతం కావడంతో అందుబాటులోకి తెస్తున్నామని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. రష్యా ప్రభుత్వం ‘స్పుత్నిక్- వీ’ అనే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌పై ఇతర దేశాలకు చెందిన నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ రష్యా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ సత్ఫలితాలు సాధించింది. రీజియన్ల వారీగా వ్యాక్సిన్లను పంపిణీ చేసే ప్రక్రియ సాఫీగా సాగేలా చూస్తున్నామని, […]
ముంబై: సుశాంత్ రాజ్‌పుత్ మృతికేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని మంగళవారం ఎన్సీబీ ( నార్కొటిక్ కంట్రోల్ బ్యూర్) అరెస్ట్ చేసింది. రియా అరెస్ట్ అవుతారంటూ ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా డ్రగ్స్ మాఫియాతో రియాకు సంబంధాలున్నట్టు ఎన్ సీబీకి కీలక ఆధారాలు దొరికినట్టు సమాచారం. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మూడురోజుల పాటు ఎన్సీబీ రియాను విచారించింది. ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ […]