సుశాంత్ రాజ్‌పుత్ మృతి కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి మద్దతు పెరుగుతున్నది. సుశాంత్ ఘటన అనంతరం వెల్లువెత్తిన ఆరోపణలతో రియా చక్రవర్తి తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నట్టు సమాచారం. తొలుత ఆమె వైఖరి కొంత అనుమానాస్పదంగా ఉండటంతో నెట్‌జన్లు ఆమెపై ట్రోలింగ్ మెదలుపెట్టారు. దీనికి తోడు జాతీయమీడియా సైతం రియాపై అనేక కథనాలు వెలువరించింది. సుశాంత్ అభిమానులు ఇప్పటికీ ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు హీరోయిన్లు రియాకు మద్దతు ఇస్తున్నారు. ఇటీవల […]
సారథిన్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తమకు కావల్సిన బ్రాండ్ దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మందుబాబులకు ఏపీ హైకోర్టు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఎవరైనా ఇతర రాష్ట్రాలకు వెళ్లి తమకు నచ్చిన మూడు ఫుల్ బాటిళ్లు తెచ్చుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో తమకు కావాల్సిన బ్రాండ్లు దొరకక మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి తెచ్చుకుందామంటే పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సీజ్చేస్తున్నారు. ఏపీలోకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురానివ్వక పోవడంపై దాఖలైన ఓ వ్యక్తి రిట్ […]
పనాజీ: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. ‘ నాకు లక్షణాలు ఏమీలేవు. కానీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. నేను ఇంట్లో నుంచి నా విధులను నిర్వర్తిస్తాను. దయచేసి నన్ను ఇటీవల కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండండి. లక్షణాలు ఉన్నా లేకపోయినా వెంటనే పరీక్షలు చేయించుకోండి. పాజిటివ్‌గా నిర్ధారణ అయితే ఆందోళన చెందకుండా చికిత్స తీసుకొండి. కరోనా […]
సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని కాంగ్రెస్నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం నంద్యాల చెక్ పోస్టు దామోదరం సంజీవయ్య సర్కిల్ సమీపంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్‌హయాంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. అప్పటి కాంగ్రెస్ప్రభుత్వం 104, 108సేవలు, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాకు తాగు, సాగునీటిని అందించిన ఘనత […]
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా మహమ్మారి అంతకంతకు విస్తరిస్తున్నది. గత 24 గంటల్లో 78,357 కొత్తకేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య సంఖ్య 37,69,524 కు చేరింది. తాజాగా 1,045 మందిని కరోనా మహమ్మారి పొట్టనపెట్టుకున్నది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 66,333 కుచేరుకున్నది. ఇప్పటివరకు 29,01,909 మంది కొలుకున్నారని కేంద్రవైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 8,01,282 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బాధితుల రికవరీ రేటు 77.02 శాతంగా ఉందని తెలిపింది. అలాగే మరణాల […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం)కు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. స్థలాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం అక్టోబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. ఆగస్టు 26 వరకు కటాఫ్ డేట్‌గా ప్రకటిస్తూ ఎల్ఆర్ఎస్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్ ఫీజును రూ.వెయ్యిగా నిర్ణయించారు. లే అవుట్ అప్లికేషన్ ఫీజును రూ.10వేలుగా ఖరారు చేసింది. 100 గజాలలోపు ప్లాటు […]
సారథి న్యూస్, రామడుగు: నియోజకవర్గ అభివృద్ధి, సాగు, తాగునీటి విషయంలో బహిరంగ చర్చకు రావాలని టీఆర్ఎస్ నేతలకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ బీసీసెల్అధ్యక్షుడు పులి ఆంజనేయులు సవాల్ విసిరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిలో చొప్పదండి వెనకబడి ఉందన్నారు. తూముల నిర్మాణం విషయంలో మేడిపల్లి సత్యంపై అసత్య ఆరోపణలు తగవన్నారు. మాల్యాల నుంచి కోదురుపాక వరకు వరద కాల్వకు ఎన్ని తూములు ఉన్నాయి, వాటికి ఎంత కేటాయించారో చెప్పాలని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఐదు కి.మీ. […]
సారథి న్యూస్, కర్నూలు: 2021వ సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో అందిస్తున్న ‘బాలశక్తి, బాలకళ్యాణ్ పురస్కార్’ అవార్డులు పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కర్నూలు జిల్లా స్త్రీ శిశు అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు(ఐసీడీఎస్) శారద భాగ్యరేఖ తెలిపారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభచూపిన బాలలకు ‘బాలశక్తి పురస్కార్’ అవార్డు, బాలలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులకు ‘బాల కళ్యాణ్ పురస్కార్’ ఇవ్వనున్నట్లు తెలిపారు. జాతీయస్థాయిలో ఎంపికైన వారికి రిపబ్లిక్‌డే సందర్భంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి ద్వారా అవార్డుతో పాటు […]