సారథి న్యూస్, మెదక్: రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలంలో 146 మందికి, మనోహరాబాద్ మండలంలో 54 మంది కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల సదుపాయాలు ఉన్నాయని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి గర్భిణి ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకోవాలన్నారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే కరోనా పరీక్షలు […]
విజయవాడ: పది మందికి చావుకు కారకుడైన రమేశ్ ఆస్పత్రి యజమాని, పోతినేని రమేశ్‌బాబు ఏ బొక్కలో దాక్కున్నా ఏపీ పోలీసులు వదిలిపెట్టరని.. ఆయనను అరెస్ట్ చేసి తీరుతారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో దాక్కొని కుట్రలు పన్నుతున్నారని.. దమ్ముంటే ఆంధ్రప్రదేశ్‌కు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు, పచ్చమీడియా కుట్రలను తిప్పికొడతామన్నారు. పరిహారం విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి .. అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. […]
సారథి న్యూస్, కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్ జన్మదినం సందర్భంగా మంగళవారం ఆయన నివాసంలో పలువురు నాయకులు కలిసి బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే.. బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, రైతు బాంధవుడు, నిగర్వి అని నేతలు కొనియాడారు. కొట్ర సర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వర్రావు, తాండ్ర సర్పంచ్ సుశీల ఈశ్వరయ్య, టీఆర్ఎస్ వెల్దండ ప్రధాన కార్యదర్శి పొనుగోటి భాస్కర్‌రావు, పార్టీ నాయకులు బొల్లె ఈశ్వరయ్య, మాజీ ఎంపీపీ పి.జయప్రకాశ్, మాజీ వైస్ […]
కరాచీ: అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌కు చెందిన ఓ సినీనటితో సన్నిహితంగా మెలుగుతున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పాకిస్థాన్‌కు చెందిన మెహ్విష్ హయత్ (37) మొదట ఐటం గర్ల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం పలు సినిమాల్లో నటించింది. ఆమెతో దావూద్ సన్నిహితంగా ఉంటున్నట్టు సమాచారం. ఇండియా నుంచి పారిపోయిన దావూద్ పాకిస్థాన్‌లోని కరాచీలో ఓ భారీ బంగ్లాలో నివాసం ఉంటున్నాడు. దావూద్‌కు పాక్ చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తులు, […]
ఒకప్పడు టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన మిల్కీ బ్యూటీ తమన్నాకు ప్రస్తుతం అవకాశాలు రావడం లేదు. కొత్తవాళ్లు రావడంతో తమన్నా వెనకబడిపోయింది. ఈ క్రమంలో ఓ భారీ ప్రాజెక్ట్‌లో ఆఫర్ దక్కించుకున్నట్టు సమాచారం. ఇళయదళపతి విజయ్ హీరోగా .. మురగదాస్ తుపాకి చిత్రానికి సీక్వెల్ తీయబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా తమన్నాను ఎంపికచేసినట్టు సమాచారం. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని.. త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని టాక్. తమన్నాతోపాటు కాజల్ కూడా ఈ సినిమాలో నటిస్తుందట. ఓ […]
సర్కారు స్కూళ్లలో సెప్టెంబర్ 1 నుంచి క్లాసెస్ కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్: మానవాళిని కరోనా వణికిస్తున్న వేళ.. విద్యార్థులు విద్యాసంవత్సరం కోల్పోకుండా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. టీశాట్, దూరదర్శన్ ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పనున్నారు. ఇప్పటికే ఆయా చానళ్లతో ఒప్పందం కుదిరింది. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా ఈనెల 27 నుంచి విధులకు హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అయితే కరోనా […]
ఢిల్లీ: భారత్‌లో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 60,975 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,67,323 కు చేరుకుంది. ఇప్పటివరకు 24 లక్షల మంది కోలుకోగా.. ఏడు లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 848 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. మొత్తం మృతుల సంఖ్య 58,390కు చేరింది. అయితే ప్రస్తుతం పాజిటివిటీ రేటు 8.6 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు […]
బొంకూర్ గ్రామంలో తప్పిన పెనుప్రమాదం ముగ్గురు పిల్లలతో బయటపడ్డ కుటుంబం సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ఇల్లు.. కుటుంబమంతా గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఉండవెల్లి మండలం బొంకూర్ గ్రామానికి చెందిన పరమేశ్‌గౌడ్, మంజుల దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి సోమవారం నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి సమయంలో నిద్రలో ఉండగా, ఒక్కసారిగా మట్టిమిద్దె పైకప్పు కూలి నిద్రిస్తున్నవారిపై పడింది. కాళ్ల వైపున ఇళ్లు కూలడంతో పిల్లలను చంకలో పెట్టుకుని ప్రాణభయంతో […]