సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా కొహెడ మండలం బస్వాపూర్ సమీపంలో ఈనెల 15న మోయతుమ్మెదవాగులో గల్లంతైన లారీడ్రైవర్ శంకర్ డెడ్‌బాడీ శనివారం లభించింది. నీటి ప్రవాహానికి బస్వాపూర్ శివారులోని వాగు ఒడ్డుకు కొట్టుకురావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. గత శనివారం నీటిఉధృతిలో గల్లంతైన లారీడ్రైవర్ శంకర్ గా గుర్తించారు. ఘటన స్థలాన్ని ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఏసీసీ మహేందర్ పరిశీలించారు.బస్వాపూర్ గ్రామస్తుల చేయూతలారీ డ్రైవర్ శంకర్ కుటుంబానికి ఆర్థిక సాయమందించానే సంకల్పంతో బస్వాపూర్ గ్రామానికి చెందిన […]
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలోని తన నివాసంలో శనివారం వినాయక చవితి వేడుకలను జరుపుకున్నారు. తన సతీమణి ఉషా నాయుడుతో కలిసి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వినాయక వ్రతకల్పం చదివారు.
దేవుడిని అతిసామాన్యుడి వద్దకు తీసుకొచ్చి దేవుడికి కులమత భేదాలు లేవని నిరూపించిన మహా దార్శనికుడు మహర్షి నారాయణగురు. ఆయన దేవాలయాలు భక్తి, ముక్తి కేంద్రాలుగా కాకుండా మలచిన మహాశిల్పి, సాహసికుడు. మానవులను అనాదిగా పట్టి పీడిస్తున్న అంధకారాన్ని ఙ్ఞానంతో తొలగించ వచ్చని, ఙ్ఞానం విద్యతోనే సాధ్యమని భావించి, అతి సామాన్యుడికి చదివించేందుకు అలుపెరుగని కృషి చేసిన మహాయోగి. చదువుతోనే స్వేచ్ఛ, సంఘటిమవడం ద్వారా శక్తి, చదువు అనేది స్వేచ్ఛ, సమానత్వాలను సాధించుకునేందుకు నిచ్చెనలా ఉపయోగపడుతుందని ప్రభోదించారు. మహాఙ్ఞాని, […]
తిరువనంతపురం: షార్జా నుంచి అక్రమ పద్ధతిలో ఓ ప్రయాణికుడు తీసుకొచ్చిన రూ.60.26 లక్షల విలువైన 1,357 గ్రాముల బంగారాన్ని కేరళలోని కన్నూర్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్ రావు శనివారం వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ లో కుటుంబ సమేతంగా వినాయకుడికి పూజచేశారు. మంత్రి కె.తారక రామారావు సతీమణి శైలిమా, కుమారులు, కుమార్తె, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్, తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
సారథి న్యూస్, అచ్చంపేట: తెలంగాణ పరిధిలోని శ్రీశైలం పాతాళగంగ జెన్కో పవర్‌హౌస్‌లో అగ్నిప్రమాదం జరిగి 9 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ప్రమాదస్థలిని పరిశీలించేందుకు వెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డిని నల్లగొండ జిల్లా డిండి వద్ద పోలీసులు పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పునుంతల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సంఘటన జరిగిన తీరును తెలుసుకుని బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందని, విచారణకు ఎలాంటి ఇబ్బందులు కలిగించబోమని తనను […]
అమరావతి: టీడీపీ నేత వంగవీటి రాధా.. బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాను కోరుకున్న టికెట్ ఇవ్వలేదని టీడీపీలో చేరారు. టీడీపీ సైతం టికెట్ ఇవ్వలేదు. అయినప్పటికీ ఆ పార్టీతరఫున ప్రచారం చేశారు. కానీ చంద్రబాబు, లోకేశ్‌బాబు పార్టీలో సరైన గౌరవం ఇవ్వకపోవడంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆయన బీజేపీకి చెందిన ఓ కీలకనేతతో సంప్రదింపులు […]
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని స్వయంగా చిరంజీవి కుమారుడు, రాంచరణ్ నిర్మిస్తున్నారు. కొణిదేల ప్రొడక్షన్స్ బ్యానర్, మ్యాట్నీ మూవీ సంయుక్త ఆధ్వర్యంలో చిత్రం తెరకెక్కుతున్నది. అయితే శనివారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.