Breaking News

Day: August 18, 2020

పండుగవేళ.. భద్రంగా ఉండండి

సారథి న్యూస్, పెద్ద శంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలకేంద్రంలో నాలుగు చోట్ల మాత్రమే వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని మండల పరిషత్​ అధ్యక్షుడు జంగం శ్రీనివాస్​ సూచించారు. ఈ మేరకు తీర్మానం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఆయాగ్రామాల్లో ప్రజలంతా కలిసి ఓకేచోట వినాయకుడిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మంగళవారం పెద్దశంకరంపేటలోని పోలీస్​స్టేషన్లో వినాయకమంటపాల ఏర్పాటుపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పెద్దశంకరంపేటలోని శ్రీరామ్​ మందిర్​, ప్రభుమందిర్​, విట్టలేశ్వరమందిర్​, మార్కండేయ మందిర్​లో వినాయక విగ్రహాలను ఏర్పాటు […]

Read More

రాజశేఖర్​రెడ్డికి డాక్టరేట్​

సారథి న్యూస్, రామాయంపేట: మూడు దశాబ్ధాలుగా లయన్స్​ క్లబ్​, రెడ్​ క్రాస్​, మానవతా సంస్థల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న రామాయంపేటకు చెందిన ఏలేటి రాజశేఖర్​రెడ్డికి న్యాయ శాస్త్రం లో డాక్టరేట్​ లభించింది. సామాజిక శాస్త్రంలో, న్యాయశాస్త్రంలో పట్టబద్రుడైన ఆయన హైదరాబాద్​లోని కేవీ రంగారెడ్డి కాలేజీ ప్రిన్సిపల్​ డాక్టర్​ జైపాల్​రెడ్డి, రాజస్థాన్​లోని జగదీశ్​ ప్రసాద్​ జబర్​ మెన్​ టెబ్రివాల యూనివర్సిటీ (జేజేటీయూ) అసిస్టెంట్​ ప్రొఫెసర్​ డాక్టర్​ విజయమాల పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆన్​ ఎన్విరాన్​మెంటల్​ లాస్​ […]

Read More

ఘనంగా సర్వాయి పాపన్న జయంతి

సారథి న్యూస్, చిన్నశంకరంపేట/ నిజాంపేట: సర్దార్​ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని గౌడసంఘం నేతలు కొనియాడారు. మంగళవారం మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్​ గ్రామంలో సర్దార్​ సర్వాయి పాపన్నగౌడ్​ 370 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేడ్చల్​ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోనూ గౌడసంఘం ఆధ్వర్యంలో పాపన్నగౌడ్​ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో వక్తలు మాట్లాడుతూ.. పాపన్నగౌడ్​ పెత్తందారివ్యవస్థపై పోరాడిన యోధుడని కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకులు […]

Read More

రామడుగు శిల్పకళ అద్భుతం

సారథిన్యూస్, రామడుగు: రామడుగులో అద్భుతమైన శిల్పసంపద ఉన్నదని కరీంనగర్​ అదనపు కలెక్టర్​ నరసింహారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన రామడుగు మండల కేంద్రాన్ని సందర్శించారు. రామడుగుకు చెందిన శిల్పులు దేవతా విగ్రహాలు చేయడంలో నిష్ణాతులని కొనియాడారు. అనంతరం 200 ఏండ్ల క్రితం నిర్మించిన చారిత్రక గడికోట ను సందర్శించారు. కలెక్టర్ వెంట సర్పంచ్​ పంజాల ప్రమీల, ఎంపీడీవో మల్హోత్రా, తహసీల్దార్​ కోమల్​రెడ్డి, ఎంపీడీవో సతీశ్​రావు తదితరులు ఉన్నారు.

Read More

సింగర్​ సునీతకు కరోనా

కరోనా మహమ్మారి సామాన్యులతోపాటు సెలబ్రిటీలను సైతం పట్టి పీడిస్తోంది. తాజాగా టాలీవుడ్​ సింగర్​ సునీతకు కరోనా పాజిటివ్​ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఓ వీడియోలో వెల్లడించారు. సునీతకు కరోనా సోకినట్టు మంగళవారం ఉదయం నుంచి సోషల్​మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో సునీత స్వయంగా వీడియోను విడుదల చేశారు. తనకు కరోనా వచ్చినమాట వాస్తవమేనని.. అయితే తాను హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకున్నానని.. ప్రస్తుతం కోలుకున్నానని ఆమె చెప్పారు. ప్రముఖ నేపథ్య గాయకుడు […]

Read More
ఏపీలో 3లక్షలు దాటిన కేసులు

ఏపీలో 3లక్షలు దాటిన కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో మంగళవారం 9,652 కరోనా కేసులు నమోదుయ్యాయి. ఇప్పటివరకు మొత్తంగా 3,03,366 పాజిటివ్ కేసుల నిర్ధారణ అయ్యాయి. తాజాగా, వ్యాధిబారిన పడి 88 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తంగా 2,820 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు చికిత్స అనంతరం 2,15,416 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 85,130కు చేరింది. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే అనంతపురం 445, చిత్తూరు 990, ఈస్ట్​ గోదావరి 1396, గుంటూరు 895, కడప 755, […]

Read More
తెలుగు రాష్ట్రాలకు వాన గండం

తెలుగు రాష్ట్రాలకు వాన గండం

19న మరో అల్పపీడనం అలర్ట్​ అయిన ఇరురాష్ట్రాల అధికారులు హైదరాబాద్​: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షాలు మరో మూడురోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని వాతావరణశాఖ అంచనావేసింది. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్ గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఇది ప్రయాణించి బలహీనపడే అవకాశం […]

Read More
సెక్రటేరియట్ పర్యవేక్షణకు కొత్త పోస్ట్​

సెక్రటేరియట్ పర్యవేక్షణకు కొత్త పోస్ట్​

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణం కోసం రోడ్లు భవనాల శాఖలో సూపరింటెండెంట్ ఇంజనీర్ సూపర్ న్యూమరరీ పోస్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది. రిటైర్డ్ ఇంజనీర్ సత్యనారాయణను ఆ పోస్టులో నియమించింది. ఏడాది పాటు లేదా పని పూర్తయిన తర్వాత ఈ సూపర్ న్యూమరరీ పోస్ట్ లాప్స్ కానుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం రాత్రి ప్రభుత్వం జారీచేసింది. ఇప్పటికే నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ ను ఖరారుచేశారు. సెక్రటేరియట్ […]

Read More