Breaking News

Day: August 12, 2020

సింగరేణిలో కరోనా కట్టడికి చర్యలు

కరోనా కట్టడికి చర్యలు

సారథి న్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా ఆస్పత్రిని బుధవారం సింగరేణి జీఎం నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రామగుండం ఏరియా​-1 లోని కొందరు ఉద్యోగులకు కరోనా ప్రబలింది. వారంతా రామగుండం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సింగరేణిలోని ఉద్యోగులు, వారికుటుంబసభ్యులు విధిగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. రామగుండం ఏరియా ఆస్పత్రిలో ప్రతి రోజు 200 మందికి కరోనా టెస్టులు నిర్వహించి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారని […]

Read More
సాక్షిగణపతికి విశేష అభిషేకం

సాక్షిగణపతికి విశేష అభిషేకం

శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానంలో బుధవారం ఉదయం సాక్షిగణపతికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిపించారు. వైదిక సంప్రదాయాల్లో గణపతి అభిషేకానికి ప్రాముఖ్యం ఉంది. ఈ అభిషేకం ద్వారా అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలి, విజయం లభిస్తుందని చెబుతుంటారు. అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులు ఆలోచనా శక్తి పెరిగి విద్య బాగా వస్తుంది చెబుతుంటారు. శ్రీశైల క్షేత్ర పరివార ఆలయాల్లో సాక్షిగణపతి ఆలయానికి […]

Read More
సంత.. సమస్యల చెంత

సంత.. సమస్యల చెంత

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో జరిగే వారంతపు సంతలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కరోనా వేళ సంతకు ప్రజల రాకపోకలు కొంత మేర తగ్గించినప్పటికీ కూరగాయలు, తృణధాన్యాలు, దుస్తులు, మసాలాలు, చిన్నచిన్న వస్తువుల కోసం ఈ సంతకే వస్తుంటారు. కానీ ఇక్కడ కనీసవసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంత సమీపంలో పైకప్పులేని డ్రైనేజీ ఉండటంతో దుర్వాసన వెదజల్లుతున్నది. పంచాయతీ సిబ్బంది మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్నప్పటి.. పట్టించుకోవడం లేదు. […]

Read More

కూలీలకు మస్తు డిమాండ్

సారథి న్యూస్, రామడుగు: కరోనా విపత్తు వేళ గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు డిమాండ్​ ఏర్పడింది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రస్తుతం రైతులు వరినాట్లు వేస్తున్నారు. కరోనా భయంతో కూలీలెవరూ వ్యవసాయ పనులకు రావడం లేదు. రూ. 450 ఇస్తామన్నా కూలీలు దొరకడం లేదు. దీంతో రైతులు ఇతర గ్రామాల నుంచి కూలీలను ఆటోలు, ట్రాక్టర్లను ఎక్కువ కూలీ ఇచ్చి తీసుకొస్తున్నారు. వరినాట్లు వేసేందుకు ఎకరానికి రూ.4వేల నుంచి రూ.5వేల గుత్తకు […]

Read More
అక్కాచెల్లెళ్లు ఆర్థికంగా ఎదగాలి

అక్కాచెల్లెళ్లు ఆర్థికంగా ఎదగాలి

సారథి న్యూస్, కర్నూలు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నాలుగేళ్లలో రూ.75వేల ఆర్థిక సాయం అందజేసేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్​చేయూత’ పథకాన్ని సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి బుధవారం క్యాంపు ఆఫీసులో ప్రారంభించారు. సుమారు 23 లక్షల మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నగదుబదిలీ చేస్తారు. అందుకోసం ప్రభుత్వం ఏటా రూ.4,687 కోట్లు ఖర్చుచేస్తారు. ఇంకా మహిళలకు ఆదాయం సమకూర్చేలా అమూల్, పీ అండ్‌ జీ వంటి సంస్థలతో కూడా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ […]

Read More
ఏపీలో 9,597 కరోనా కేసులు

ఏపీలో 9,597 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం 9,597 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 93 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 2,296కు చేరింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,54,146కు చేరింది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది. గత 24 గంటల్లో 57,148 నమూనాలు పరీక్షించారు. తాజాగా వ్యాధిబారిన నుంచి 6,676 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,61,425కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం […]

Read More
రూ.123 కోట్లతో 50 థీమ్ పార్కులు

రూ.123 కోట్లతో 50 థీమ్ పార్కులు

సారథి న్యూస్, హైదరాబాద్: ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ లో రూ.16.30 కోట్ల వ్యయంతో ఆరు థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ మేయర్​బొంతు రామ్మోహన్​వెల్లడించారు. బుధ‌వారం ఉప్పల్​ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో క‌లిసి కాప్రా స‌ర్కిల్‌లో పరిధిలో పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్​బీ నగర్​జోన్ పరిధిలో రూ.29.25 కోట్ల అంచనా వ్యయంతో 13 థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ థీమ్ పార్కుల‌లో యోగా, వాకింగ్ ట్రాక్‌, ఓపెన్ జిమ్‌లు ఉంటాయన్నారు. ఢిల్లీ, […]

Read More
రష్యా వ్యాక్సిన్​పై అనుమానాలు

రష్యా వ్యాక్సిన్‌పై అనుమానాలు

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ తయారు చేసినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అంతర్జాతీయ నిపుణులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రయోగ పరీక్షలు ఫలితాల సమాచారాన్ని ఎక్కడా వెల్లడించకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం రెండు నెలల ప్రయోగాల అనంతరం వ్యాక్సిన్‌ ఆమోదాన్ని ప్రకటించడంపై పెదవివిరుస్తున్నారు. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్‌ను నమ్మడం కష్టమని బ్రిటన్‌, జర్మనీ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలుకంపెనీలు భారీస్థాయిలో పరిశోధనలు చేపట్టాయి. ఇప్పటికే […]

Read More