Breaking News

Day: August 10, 2020

ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది

ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది

నీటి వాటా ప్రకారమే తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నం కేంద్రం, ఏపీ ప్రభుత్వానికి సమాధానం చెబుతం తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేయడం సరికాదు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వాస్తవాలు వెల్లడిస్తాం జలవనరులశాఖ అధికారులతో సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే […]

Read More
ఏపీలో 7,665 కరోనా కేసులు

ఏపీలో 7,665 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం 7,665 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 80 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య 2,116కు చేరింది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,35,525కు చేరింది. గత 24 గంటల్లో 46,699 కరోనా టెస్టులు చేశారు. కొత్తగా 6,924 మంది వైరస్‌ బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుతం కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,45,636కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 87,112 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 25,34,304 కరోనా నిర్ధారణ పరీక్షలు […]

Read More

చిన్నశంకరంపేటలో ఇద్దరికి కరోనా

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. స్థానిక పీహెచ్​సీలో సోమవారం 17 మందికి కరోనా పరీక్షలు చేశారు. వారిలో మడూర్, చందాపూర్ గ్రామాలకు చెందిన ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి తెలిపారు. నేటితో మండలంలో 13 మందికి పాజిటివ్ రాగా నలుగురు రికవరీ అయ్యారని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు.

Read More
మానోపాడులో కరోనా విజృంభణ

మానవపాడులో కరోనా హైరానా

సారథి న్యూస్​, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడులో కరోనా విజృంభిస్తోంది. తాజాగా 44 మందికి కరోనా రాపిడ్​ టెస్టులు నిర్వహించగా 14 మందికి కరోనా సోకింది. మానవపాడు -2, కొర్రిపాడు -1, మద్దూరు -2, ఉండవెల్లి మండలంలోని ఉండవెల్లి -1, పుల్లూరు -5, అలంపూర్ క్రాస్​ రోడ్డు -2, ఇటిక్యాల మండలంలో – 1 చొప్పున కేసులు నమోదైనట్టు డాక్టర్​ దివ్య తెలిపారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, విధిగా […]

Read More
కరోనా నటషాకు కరోనా

నటాషా సూరికి కరోనా

మాజీ మిస్ ఇండియా వరల్డ్ నటాషా సూరికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. దీంతో ఆమె హోంక్వారంటైన్​లో ఉండి చికిత్స తీసుకుంటోంది. ఇటీవల ఆమె ముంబై నుంచి పుణె వెళ్లింది. తర్వాత ఆమెకు గొంతునొప్పి, తీవ్రజ్వరం రావడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు కరోనా వచ్చినట్టు ఆమె తెలిపారు. ప్రస్తుతం తన కుటుంబసభ్యుల కూడా క్వారంటైన్​లో ఉన్నారని చెప్పారు. నటాషా సూరి 2016 మలయాళ సినిమా ‘కింగ్ […]

Read More
ప్రశాంత్​భూషణ్​కు షాక్​

మీ క్షమాపణ మాకు అక్కర్లేదు

న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​కు సుప్రీంలో చేదు అనుభవం ఎదురైంది. ‘మీ క్షమాపణ మాకు అక్కర్లేదు. మీరు చేసిన వ్యాఖ్యలపై విచారణ కొనసాగిస్తాం’ అంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2009లో ఓ ఇంటర్వ్యూలో ఆయన​ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కడున్న 16 మంది జడ్జీలు అవినీతిపరులేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసును సోమవారం అత్యున్నత న్యాయస్థానం విచారించింది. అతని వివరణ, క్షమాపణలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా అతని వ్యాఖ్యలు కోర్టు […]

Read More
80వేల మార్క్ దాటిన కరోనా

80వేల మార్క్ దాటిన కరోనా

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం కొత్తగా 1,256 కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివ్​కేసుల నిర్ధారణ 80వేల మార్క్​ను దాటింది. రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 80,751కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 10 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 637 కు చేరింది. కరోనా నుంచి తాజాగా 1,587 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. వ్యాధి బారినపడి 57,586 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,528 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో […]

Read More
తెలంగాణకు వర్షసూచన

తెలంగాణకు వర్షసూచన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే మూడు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సోమ‌వారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన‌ తేలికపాటి నుంచి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం పశ్చిమ బెంగాల్ ప్రాంతాల మీదుగా విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ […]

Read More