సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా సీపీఎం నాయకుడు టి.షడ్రక్, గిరిజన ఉద్యమ నాయకుడు, సీపీఎం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని సీఐటీయూ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గౌస్ దేశాయ్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డులో అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో సంతాపసభ నిర్వహించారు. షడ్రక్ కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధిగా స్థానికుల సమస్యల పరిష్కారం కోసం విశేషంగా కృషిచేశారని అన్నారు. సీపీఎంలో సర్పంచ్ నుంచి […]
సారథి న్యూస్, కర్నూలు: పలు రకాల సమస్యలపై పోలీసుస్టేషన్లను ఆశ్రయించే వారితో పోలీసులు మర్యాదపూర్వకంగా మెలగాలని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి కిందిస్థాయి పోలీసు అధికారులకు సూచించారు. దురుసు ప్రవర్తన ప్రదర్శిస్తే పోలీసు సిబ్బందిపై చర్యలు తప్పని హెచ్చరించారు. గురువారం ఆయన కర్నూలు జిల్లా పోలీసు ఆఫీసులోని కోవిడ్ కమాండ్ కంట్రోల్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలని సూచించారు. ఫిర్యాదుల పట్ల చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్స్ ప్లోజివ్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని, డాక్టర్లతో కౌన్సెలింగ్ ఇప్పించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, జిల్లాల్లో కోవిడ్ మేనేజ్ మెంట్ పై జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులతో గురువారం బీఆర్ఆర్ భవన్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్థానిక జిల్లా […]
సారథి న్యూస్, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది. గతనెల 25న ఇంటర్నెట్ వాయిస్ బేస్డ్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగంతుకుడు తనకు ఫోన్ చేసి బెదిరించాడని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని డీజీపీ, సీపీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వాళ్లు అందుబాటులోకి రాలేదని, చివరికి హాక్ ఐ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.డీజీపీ అందుబాటులోకి రాలేదు12 రోజులైనా […]
సారథి న్యూస్, సిద్దిపేట: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భౌతిక కాయానికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రామలింగారెడ్డి మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు ఫేస్ బుక్, ట్విట్టర్ షాకిచ్చాయి. తప్పుడు సమాచారాన్ని పోస్టు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పాయి. ఏకంగా అమెరికా అధ్యక్షుడు పోస్టు చేసిన ఓ వీడియోను డిలిట్ చేశాయి ఈ సంస్థలు. ‘చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వారికి కరోనా సోకదు’ అని ట్రంప్ ఇటీవల ఫేస్బుక్, ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. దీనిపై ఫేస్బుక్, ట్విట్టర్ తీవ్రంగా స్పందించాయి. ట్రంప్ వీడియోలో తప్పడు […]
ఢిల్లీ: ప్లాస్మా థెరపీతో ఏ విధమైన ప్రయోజనం లేదని.. ఈ విధానంతో మరణాలను తగ్గించలేకపోతున్నామని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిమ్స్ చేసిన ప్రాథమిక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని చెప్పారు. బుధవారం ఢిల్లీలో నేషనల్ క్లినికల్ గ్రాండ్ రౌండ్స్ ‘కరోనా కట్టడిలో ప్లాస్మా థెరపీ పాత్ర’ అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సదస్సులో గులేరియా మాట్లాడారు. ఎయిమ్స్‌లో జరిపిన ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయిల్స్‌లో ఈ విషయం వెల్లడైందన్నారు. ఎయిమ్స్‌లో 30 […]
సారథి న్యూస్, అనంతపురం : జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జేపీ ప్రభాకర్‌రెడ్డి బుధవారం బెయిల్‌పై విడుదలయ్యారు. బీఎస్3 వాహనాలను బీఎస్4 మార్చి రిజిస్టర్ చేయించారనే ఆరోపణలతో జేసీని, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ ప్రస్తుతం కడప జిల్లా జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు. బెయిల్ రావడంతో వీరిద్దరూ జైలు నుంచి విడుదలయ్యారు. జేసీ ట్రావెల్స్ మాజీ ఉద్యోగులు నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో […]