Breaking News

Month: July 2020

మరో ఉక్కు వంతెనకు శ్రీకారం

మరో ఉక్కు వంతెనకు శ్రీకారం

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు మరో ఉక్కు వంతెన నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎస్ఆర్ డీపీ కింద ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో నల్లగొండ క్రాస్ రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గురువారం మంత్రులు శంకుస్థాపన చేశారు. రూ 523.37 కోట్ల వ్యయంతో నల్లగొండ క్రాస్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు సుమారు మూడున్నర కి.మీ. […]

Read More
కొల్చారంలో కుండపోత

కొల్చారంలో కుండపోత

సారథి న్యూస్​, మెదక్​: మెదక్ జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీవర్షం కురుస్తోంది. కొల్చారంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆయా మండలాల్లో చాలా చెరువులు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో భారీవర్షం కురవడంతో కొల్చారం, మెదక్, హవేలీ ఘనపూర్ మండలాల పరిధిలోని మహబూబ్ నహర్ కాల్వ నిండుగా ప్రవహిస్తోంది. భారీవర్షాలు కురిసి చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకోవడంతో రైతులు, కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More
కరోనా బాధితులను జాగ్రత్తగా చూసుకోవాలి

కరోనా బాధితులను జాగ్రత్తగా చూసుకోవాలి

సారథి న్యూస్, కర్నూలు: కరోనా పాజిటివ్ వచ్చి లక్షణాలు లేని వ్యక్తులు ఇంటి వద్దనే ఉంటూ చికిత్స తీసుకునేలా ప్రోత్సహించాలని వైద్యాధికారులకు కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ సూచించారు. గురువారం స్థానిక కర్నూలు మెడికల్ కాలేజీ సమావేశ మందిరంలో కరోనా కట్టడి చర్యలపై వైద్యాధికారులతో జాయింట్ కలెక్టర్ రవి పట్టన్ షెట్టి, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్, జీజీహెచ్ సూపరిడెంటెంట్​డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డితో కలిసి సమీక్షించారు. కరోన బాధితులను హోమ్ ఐసోలేషన్ లో ఉండేలా […]

Read More
ఎస్పీని కలిసిన ఏఎస్సైలు

ఎస్పీని కలిసిన ఏఎస్సైలు

సారథి న్యూస్, కర్నూలు: అనంతపురం జిల్లాకు చెందిన 8 మంది ఏఎస్సైలు ఎస్సైలుగా పదోన్నతి పొందిన సందర్భంగా వారిని విధుల కోసం కర్నూలు జిల్లాకు కేటాయించారు. గురువారం వారు జిల్లా ఎస్పీ ఆఫీసులో ఎస్పీ డాక్టర్ కాగినెల్లి ఫక్కీరప్పను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. మరిన్ని పదోన్నతులు పొందాలని ఎస్పీ ఆకాంక్షించారు. కరోనా సమయంలో ప్రజలకు మంచి సేవలు అందించి పోలీసుశాఖకు పేరు తీసుకురావాలని కోరారు.

Read More
నీరాకేఫ్​ ప్రారంభం

నీరాకేఫ్​ ప్రారంభం

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ ​మహానగరంలోని నెక్లెస్ రోడ్డులో సుమారు రూ.మూడు కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన నీరా కేఫ్ ను గురువారం మంత్రులు కె.తారక రామారావు, వి.శ్రీనివాస్​గౌడ్, తలసాని శ్రీనివాస్​యాదవ్​ తదితరులు బుధవారం ప్రారంభించారు. భువనగిరి ఎంపీ మాజీ బూర నర్సయ్యగౌడ్, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, గౌడ సంఘం నాయకులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Read More
పంద్రాగస్టు.. వీళ్లే ఆహ్వానితులు

పంద్రాగస్టు.. వీళ్లే ఆహ్వానితులు

సారథి న్యూస్, హైదరాబాద్: పంద్రాగస్టు వేడుకలకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి కోలుకున్న వారిని ఆగస్టు 15న‌ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని రాష్ట్రాలకు సూచించింది. ఇక‌, రాష్ట్ర రాజధానుల్లో ఉదయం 9 గంటలకు వేడుకలు నిర్వహించాలని సూచించారు. పోలీసు, ఆర్మీ, పారామిలటరీ, ఎన్‌సీసీ దళాలు మార్చ్‌ఫాస్ట్‌కు మాస్క్‌ ధరించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. కరోనా దృష్ట్యా భారీస్థాయిలో ప్రజలు వేడుకల్లో పాల్గొనకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు […]

Read More
చాలెంజ్​గా తీసుకున్నరు

సెలబ్రెటీల గ్రీన్ చాలెంజ్

‘పుడమి పచ్చగుండాలే.. మన బతుకులు చల్లగుండాలే’ అనే నినాదంతో మొదలుపెట్టిన జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’కు మంచి స్పందన వస్తోంది. ప్రభుత్వాలు అటవీ సంపదను పెంచి కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో చేపడుతున్న ఈ కార్యక్రమంలో సినీరాజకీయ క్రీడా ప్రముఖులు, సినీసెలబ్రిటీలు కూడా భాగస్వాములు అవుతున్నారు. మొదట ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటి చాలెంజ్ విసరడంతో హీరో అఖిల్ అక్కినేని, ఎంపీ కవిత మొక్కలు నాటారు. ఆ తర్వాత గ్రీన్ చాలెంజ్ స్వీకరించిన […]

Read More

తెలంగాణ‌లో డేంజర్​ బెల్స్​

సారథిన్యూస్​, హైదరాబాద్: తెలంగాణ‌లో క‌రోనావైర‌స్ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి స్టేజ్ 3కి చేరుకుంద‌ని, క‌మ్యూనిటీ స్ప్రేడ్ అవుతుంద‌ని సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు. వ‌చ్చే నాలుగు-ఐదు వారాలు చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, ప్ర‌జ‌లంతా మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఇక‌, రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి న‌గ‌రాల్లో కూడా క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయ‌న్న శ్రీ‌నివాస‌రావు ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం అన్నారు. ల‌క్ష‌ణాలు లేనివారు క‌రోనా టెస్ట్‌ల […]

Read More