సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. లక్షణాలు ఏవీ లేకపోయినా ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల ఆయన సిబ్బందిలో ఒకరికి కరోనా రావడంతో మేయర్ హోం క్వారంటైన్లో ఉంటున్నారు. తాజాగా ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. త్వరలోనే కోలుకుంటానని మేయర్ ట్వీట్ చేశారు.
తాను కరోనా నుంచి కోలుకున్నానని బుల్లితెర స్టార్ హీరోయిన్, ‘నా పేరు మీనాక్షి’ ఫేమ్ నవ్య స్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. కొంతకాలం క్రితం నవ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆమె ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ‘ నా క్వారంటైన్ లైఫ్ పూర్తయింది. ఇంతకుముందుకంటే బాగున్నాను. అందరూ ఇచ్చిన ధైర్యంతోనే కోలుకున్నాను. దాదాపు 3 వారాలపాటు ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను. […]
సారథి న్యూస్, హైదరాబాద్ : కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ఆమె సంతోషంతో తిరిగి ఇంటికొచ్చింది.. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఇంటికి వస్తే కొడుకు షాకిచ్చాడు.. ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నాడు. హైదరాబాద్ ఫిలింనగర్ బీజేఆర్ నగర్‌లో ఓ మహిళకు కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఆమె గాంధీ ఆసుపత్రిలో చేరింది.. కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డాక్టర్లు డిశ్ఛార్జ్ చేశారు. […]
సారథి న్యూస్, కృష్ణా : ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కలెక్టరేట్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రెండు రోజుల క్రితం కలెక్టరేట్ వంద ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేయించారు. ఈ క్రమంలో ఒక్కొక్కటిగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. నేరుగా ఉద్యోగుల ఫోన్లకు వస్తున్న ఫలితాల రిపోర్టులు చూసి సహచరులు భయపడుతున్నారు. ఇప్పటికే 15 మందికి పైగా పాజిటివ్ గా రిపోర్టులు వచ్చాయి.
సారథి న్యూస్, నకిరేకల్: తన సమస్యను పరిష్కరించాలని పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళతో అసభ్యంగా వ్యవహరించిన నకిరేకల్ హెడ్ కానిస్టేబుల్ రఘును నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాధ్ ఆదేశాలు ఆదివారం జారీ చేశారు. తనను వేధిస్తున్న తన భర్త నుంచి తనకు రక్షణ కల్పించాలని, తన సమస్యను పరిష్కరించాలని నకిరేకల్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఒక మహిళతో హెడ్ కానిస్టేబుల్ రఘు అసభ్యంగా ప్రవర్తించినట్లుగా వచ్చిన సమాచారం మేరకు విచారణ జరపి సస్పెండ్ చేసినట్లు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో 15,654 మంది నమూనాలను పరీక్షించగా, వారిలో 1,593 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 641 కరోనా కేసులు నమోదయ్యాయి, శనివారం మీడియా బులెటిన్ విడుదల చేయని ప్రభుత్వం అన్ని వివరాలతో ఆదివారం రిలీజ్ చేసినట్టు ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 54,059కు చేరింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 12,264 మంది కరోనా […]
అందాల భామ సమంత అక్కినేని సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్గా వెలిగిన సమంత .. చైతూతో పెళ్లి తర్వాత డీలా పడింది. అయినప్పటికీ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓ బేబీ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. తాజాగా ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో 11 మిలియన్ల ఫాలోవర్స్ హృదయాలను గెలుచుకుంది. నిత్యం తన సినిమాలు, ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలు పంచుకుంటూ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో రాత్రి 9 గంటల వరకు వైన్ షాపులు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా, మరో గంట సమయాన్ని పెంచింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రోజు వారీ వివరాలు నమోదు చేసేందుకు ఎక్కువ నగదు లెక్కింపు సమయం సరిపోవడం […]