Breaking News

Day: July 20, 2020

జోరుగా ‘రియల్​’ దందా

సారథి న్యూస్​, జోగుళాంబ గద్వాల : రియల్​ఎస్టేట్​ వ్యాపారులు మారుమూల పల్లెలకు విస్తరించారు. రోడ్ల పక్కన ఉన్న స్థలాలను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి అక్కడ అక్రమంగా లే అవుట్లు ఏర్పాటు చేస్తూ ప్లాట్లను విక్రయిస్తున్నారు. పచ్చని పంటపొలాలను నాశనం చేస్తున్నారు. అనుమతులు లేకుండా వెంచర్లు చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం బిజ్వారం గ్రామ శివారులో వెలసిన అక్రమ లేఅవుట్లు ప్లాట్లపై పంచాయతీరాజ్‌శాఖ దృష్టి సారించింది. అక్రమ లేఅవుట్‌ స్థలాలను గుర్తించి క్రమబద్ధీకరించుకునేలా […]

Read More

భయపెడుతున్న వానరాలు

సారథి న్యూస్,రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో కోతుల బెడద ప్రజలను వేధిస్తున్నది. ప్రజలు ఇంట్లోనుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రోడ్లమీద కోతులు గుంపులుగుంపులుగా చేరి భయపెడుతున్నాయి. ఇండ్లలోకి చేరి ఆహారపదార్థాలను ఎత్తుకుపోతున్నాయని ప్రజలు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు చొరవ తీసుకొని కోతులను తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు.

Read More

కేంద్రీయ విద్యాలయం పిలుస్తోంది

ఉన్నత విద్యావంతులు, ఉత్తమ బోధన, పరిపూర్ణ సౌకర్యాలు, పారదర్శక ఎంపిక, నాణ్యమైన విద్య కేంద్రీయ విద్యాలయాల ప్రత్యేకతలు. ఒకటో తరగతిలో ప్రవేశం పొందితే ప్లస్‌టూ వరకు ప్రశాంతంగా చదివే అవకాశం. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఏటా డిమాండ్‌ పెరుగుతోంది. అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న ఈ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. క్రమశిక్షణతో విద్యార్థులను […]

Read More
ఏడిస్తే పోయినవారు తిరిగొస్తారా?

ఏడిస్తే పోయినవారు తిరిగొస్తారా?

అన్నింటిని పరిత్యజించి మోక్షానికి వెళ్లవలసిన ఒక యోగి, ఒకనాడు మండుటెండలో వెళ్తూ ఎండకు ఓర్చుకోలేక, చెప్పులు కుట్టే ఓ వ్యక్తి దారిలో పెట్టిన చెప్పులపై కొంతసేపు నిలబడ్డాడు. ఆ మాత్రం నిలబడినందున, ఆ రుణం తీర్చుకోవడానికి మరోజన్మలో ధారానగరంలో పరమేశ్వరి, సోముడు అనే దంపతులకు సునందుడు అనే కొడుకు పుట్టాడు. జాతకం చూపిస్తే పెద్దలు ఆ తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేశారు. ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉంటాడు. ‘వాడి చేతి నుంచి […]

Read More

ఖమ్మంలో యాంటీజెన్​ టెస్టులు

సారథిన్యూస్​, ఖమ్మం: రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖమ్మంలో రాపిడ్​ యాంటిజెన్​ టెస్టులు చేస్తున్నారు. సోమవారం మంత్రి పువ్వాడ అజయ్​ ఖమ్మంలో ర్యాపిడ్​ యాంటిజెన్​ టెస్టుల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు 10 వేల ర్యాపిడ్ యాంటీజేన్ టెస్ట్ కిట్స్ అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి ఉన్న వారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్​ ఆర్వీ […]

Read More
తెలంగాణలో 1,198 కేసులు

తెలంగాణలో 1,198 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం 1,198 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 46,274 పాజిటివ్ ​కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒకేరోజు ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటిదాకా మృతిచెందిన వారి సంఖ్య 415కు చేరింది. ఇప్పటివరకు 11,003 శాంపిళ్లను పరీక్షించారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలో 510 పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి 106, మేడ్చల్​76, సంగారెడ్డి 10, వరంగల్​అర్బన్​73, కరీంనగర్​87, జగిత్యాల 36, మహబూబాబాద్ 36, మెదక్​13, మహబూబ్​నగర్​50, భూపాలపల్లి […]

Read More
మా పెళ్లికి రండి

మా పెళ్లికి రండి

ప్రముఖ టాలీవుడ్​ హీరో నితిన్​ సోమవారం తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్​రావును ప్రగతిభవన్​లో కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి.. తమ పెళ్లికి రమ్మని ఆహ్వానించారు. నితిన్, షాలిని వివాహం 16న జరగాల్సి ఉండగా లాక్​డౌన్​తో వాయిదాపడింది. దీంతో జూలై 26న రాత్రి 8.30 నిమిషాలకు వీరి పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు ముహూర్తం పెట్టించారు. హైదరాబాద్​లోని ఫలక్ నుమా ప్యాలస్​లో పెళ్లి జరుగనున్నట్టు సమాచారం.

Read More
డిఫరెంట్ పాత్రలో రెజీనా

డిఫరెంట్ పాత్రలో రెజీనా

‘ఎవరు’ సినిమాతో రెజీనా కసాండ్రాలోని బోల్డ్ నెస్ ఒక్కసారిగా బయటపడింది. అది ‘నక్షత్రం’, మిస్టర్ చంద్రమౌళి’ సినిమాల్లో మరింత రెచ్చిపోయింది. చెన్నైలో పుట్టి పెరిగి సినీఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదట తమిళంలో ‘కన్డనాల్ ముదల్’ సినిమాతో హీరోయిన్​గా అరంగేట్రం చేసింది. తెలుగులో ‘ఎస్ఎంఎస్’ సినిమాతో తన సినీకెరీర్ ప్రారంభించిన రెజీనా తర్వాత ‘రొటీన్ లవ్ స్టోరీ, ‘పవర్’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలు గుర్తింపు ఇచ్చాయి. హద్దులు పెట్టుకోకుండా నటిస్తున్న రెజీనా బాలీవుడ్​లో సోనమ్ కపూర్ […]

Read More