సారథి న్యూస్, మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ భవనం ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఆదివారం మొక్క నాటి నీళ్లు పోశారు. ఊరూరా హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిట్యాల జనార్దన్, కెఎస్ఎన్ […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: కొల్లాపూర్ మరింత అభివృద్ధి చెందాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ ఆకాంక్షించారు. ఆదివారం ఆయన మార్నింగ్ వాక్‌లో భాగంగా కొల్లాపూర్ లో పర్యటించారు. పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఆ మేరకు ప్రణాళికలతో అధికారులు ముందుకు సాగాలని సూచించారు. మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పట్టణాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని సూచించారు. కరెంట్ బిల్లులు నెలనెలా చెల్లించాలని, విద్యుత్‌ను పొదుపుగా వాడాలని సూచించారు. పట్టణంలో డంపింగ్ యార్డ్ పనులను కంప్లీట్ చేయాలన్నారు. […]
ఉపాధి కోసం కూలి పనులకు వెళ్తున్న కార్మికులు చేతులు మొద్దు బారి నేత పని చేయలేకపోతున్నామని ఆవేదన ప్రభుత్వమే గిట్టుబాటు ధరలు కల్పించాలని వేడుకోలు సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి గ్రామం పేరు చెబితేనే చేనేత గుర్తుకొస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో నేత పనికి గుర్తింపు తెచ్చిన వాటిలో ఈ గ్రామం కూడా ఒకటి. అలాంటి ఊరులో చేనేత వృత్తే కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వృత్తినే నమ్ముకుని కొన్నేళ్లుగా జీవనం […]
కరోనాతో వాయిదా పడ్డ టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ – షాలిని వివాహానికి ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ 16ననే వీరి పెళ్లి జరగాల్సిఉండగా లాక్‌డౌన్‌తో వాయిదా పడింది. దీంతో జూలై 26న రాత్రి 8.30 నిమిషాలకు వీరి పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు ముహూర్తం పెట్టించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిరాడంబరంగా వివాహ వేడక జరుగనున్నది. ఇరుకుటుంబాల వారు మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లోని ఫలక్ నుమా ప్యాలస్‌లో పెళ్లి జరుగనున్నట్టు సమాచారం. భీష్మ సినిమాతో సూపర్హిట్‌ను […]
ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 38,902 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 10,77,618 కి చేరింది. ఒక్కరోజులో 38 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కొత్తగా 543 మంది వైరస్ బాధితులు మృతి చెందడటంతో మొత్తం మరణాల సంఖ్య 26,816 కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు భారత్‌లోని మొత్తం కరోనా రోగుల్లో 6.77 లక్షల మంది కోలుకున్నారు. […]
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆర్జీవీ ఆలోచనలు ఎవరి అంచనాలకు దొరకవు. కొత్తగా ఆలోచించడంలో ఆయన తర్వాతే ఎవరైనా.. అందుకే ఇన్నేళ్లయినా.. ఎన్ని ప్లాపులు వస్తున్నా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ‘పవర్‌స్టార్’ అనే ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా ఎవరిగురించి తీస్తున్నాడో ఎల్కేజీ పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఆ చిత్రానికి సంబంధించి త్వరలో ఓ ట్రయిలర్ రిలీజ్ చేయబోతున్నాడు. కాగా ఈ ట్రయిలర్కూ కూడా రూ.25 టికెట్టు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు […]
సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లా వాజేడు మండలంలోని మెురుమూరు పంచాయతీ గణపురం గ్రామంలో శనివారం వైద్యశిబిరం నిర్వహించారు. జ్వరంతో బాధపడుతున్న వారు, గర్భిణులు, బాలింతలు, క్షయ వ్యాధితో బాధపడుతున్న వారికి మందులు పంపిణీ చేశారు. బీపీ, షుగర్వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్యచికిత్సలు చేశారు. కరోనా సమయంలో ప్రజలు మాస్కులు కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే గ్రామపంచాయతీ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ డి.వెంకటేశ్వరరావు, […]
సారథి న్యూస్, హైదరాబాద్: సీపీఐ(మావోయిస్ట్) పార్టీ తెలంగాణలో మళ్లీ పాగావేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్రకమిటీతో పాటు ఏరియా కమిటీలను ప్రకటించి పోలీసులకు సవాల్ విసిరింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా హరిభూషణ్ అలియాస్ యాప నారాయణను ఎన్నుకున్నట్లు సమాచారం. ఏడుగురు సభ్యులతో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర కార్యదర్శిగా హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. పుల్లూరి […]