Breaking News

Day: July 18, 2020

ఆరుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​లో 24 గంటల్లో వేర్వేరు ఎన్​కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు భద్రతాదళాల చేతుల్లో హతమయ్యారు. షోషియాన్​ జిల్లాలో శనివారం ముగ్గురు ఉగ్రవాదులు ఎదురుకాల్పుల్లో మరణించారు. శుక్రవారం కుల్​గాం జిల్లాలో ముగ్గరు ఉగ్రవాదలు హతమైన సంగతి తెలిసిందే. వీరిలో జైషేమహ్మద్​ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్​ కూడా ఉన్నాడు.

Read More

కోవిడ్​ సెంటర్​లో లైంగికదాడి

ముంబై: కరోనాతో లక్షణాలతో కోవిడ్​ సెంటర్​లో చేరిన ఓ మహిళపై యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ హేయమైన ఘటన ముంబైలో చోటుచేసుకున్నది. కరోనా లక్షణాలతో ఓ మహిళ(40) నేవీ ముంబైలోని కోవిడ్​ సెంటర్​లో చేరింది. మహిళ రెండోఅంతస్థులో ఉండగా.. డాక్టర్​గా పరిచయం చేసుకున్న ఓ యువకుడు ఆమెపై లైంగికదాడి చేశాడు. సదరు యువకుడు కూడా అదే కోవిడ్​ సెంటర్​లో ఐదోఅంతస్థులో చికిత్సపొందుతున్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read More
కరోనాపై కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు

కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరువనంతపురం: భారత్​లో కరోనా సామాజికవ్యాప్తి మొదలైందని కేరళ సీఎం పినరయి విజయన్​ పేర్కొన్నారు. మనదేశంలో మొదటి కేసు కేరళ రాష్ట్రంలోనే నమోదైంది. అక్కడిప్రభుత్వం లాక్​డౌన్​ కఠినంగా అమలు చేయడంతో వ్యాధి అంతగా విస్తరించలేదు. దీంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ప్రశంసల వెల్లువెత్తాయి. భారత్​లో కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. అయినప్పటికీ కేంద్రప్రభుత్వం సామాజికవ్యాప్తి జరిగిందని చెప్పలేదు. దీంతో విజయన్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా శుక్రవారం కేరళలో 791 కొత్త కేసులు నమోదు అయ్యాయి. […]

Read More
దేశంలో విజృంభిస్తున్న కరోనా

కరోనా విజృంభణ

ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ భయంకరంగా పెరుగుతున్నది. కొత్తగా 34,000 కొత్తకేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 10,38,716 లకు చేరుకున్నది. కాగా ఇప్పటికే 26,273 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కాగా పట్టణప్రాంతాలతోపాటు గ్రామాలకు ఈ మహమ్మారి విస్తరించింది. రానున్నరోజుల్లో పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 6,53,750 మంది కోలుకోవడం కొంత ఊరటనిచ్చే అంశమే. ప్రభుత్వాలు చేతులెత్తేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read More

నాగర్​కర్నూల్​ జిల్లాలో 33 కొత్త కేసులు

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: జీహెచ్ఎంసీకి పరిమితమైందనుకున్న కరోనా మహమ్మారి మారుమూల పల్లెలకు పాకుతున్నది. శుక్రవారం ఒక్కరోజే నాగర్​కర్నూల్​ జిల్లాలో 33 కొత్తకేసులు నమోదయ్యాయని డీఎంహెచ్​వో సుధాకర్​లాల్​ తెలిపారు. నాగర్​కర్నూల్​ పట్టణంలో ఆరుగురికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఎస్​బీఐలో పనిచేస్తున్న ఐదుగురు సిబ్బందికి, సంతబజార్​కు చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. వీరితో పాటు అచ్చంపేట పట్టణానికి చెందిన 15 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. లింగాల మండలం అంబటి పల్లిలో ముగ్గురికి కరోనా సోకింది. […]

Read More
ట్రైలర్ టాక్.. ‘లూట్ కేస్’

ట్రైలర్ టాక్.. ‘లూట్ కేస్’

బాలీవుడ్​లో మరో సినిమా ఓటీటీలో రిలీజ్​కు సిద్ధమైంది. కునాల్ ఖేము హీరోగా నటించిన ‘లూట్ కేస్’ సినిమా ఈ నెల 31న డిజిటల్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్​లో రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి రాజేష్ కృష్ణన్ దర్శకత్వం వహించగా.. ఫాక్స్ స్టూడియోస్, సోడా ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. గురువారం రిలీజైన సినిమా ట్రైలర్ ఫన్నీ ఎంటర్ టెయిన్ మెంట్ తో ఉండి సినిమా ఆశక్తిని కలిగించేదిలా ఉంది. రెండు నిమిషాల యాభై ఆరు సెకన్లు ఉన్న ఈ […]

Read More
సెబాస్టియన్ ఫస్ట్ లుక్

సెబాస్టియన్ ఫస్ట్ లుక్

టాలీవుడ్​లో యంగ్ హీరోలు వెలువలా వస్తున్నారు. ‘రాజా వారు రాణిగారు’ వంటి నేచురల్ ప్రేమకథా చిత్రంతో హీరోగా పరిచయమైన కిరణ్ సబ్బవరం తొలిచిత్రంతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. దాంతో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ‘ఎస్ఆర్. కల్యాణ మండపం, Est. 1975’ రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇదిలా ఉండగా కిరణ్ సబ్బవరం తాజాగా మరో చిత్రానికి కమిటయ్యాడు. ‘Est. 1975’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఎలైట్ ఎంటర్​టైన్​మెంట్​ సంస్థ తాజాగా కిరణ్ అబ్బవరంతో ‘సెబాస్టియన్ పీసీ […]

Read More
మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలుపండి

మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలుపండి

సారథి న్యూస్, రామడుగు: ఈనెల 22న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, 24న మంత్రి కేటీఆర్ జన్మదినం రోజున పెద్ద ఎత్తున మొక్కలు నాటలనే సందేశంతో జై తెలంగాణ ఫౌండేషన్ చైర్మన్, కేటీఆర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు వివేకానంద రూపొందించిన పోస్టర్ ను మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, నాయకులు విడుదల చేశారు. గిఫ్టులు కాకుండా మొక్కలు నాటి విషెస్​ చెప్పాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్ల వెంకట రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు […]

Read More