సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌పై ఓ సీఐ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు శుక్రవారం కలెక్టర్ జి.వీరపాండియన్‌కు ఫిర్యాదు చేసింది. ఈనెల 15న ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశానని పేర్కొన్న సదరు మహిళ.. కేసు విచారణలో ఉండగానే సీఐ బెదిరింపుకు ప్పాడుతున్నాడని ఆరోపించింది. తనకు ప్రాణహాని ఉందని, సీఐ నుంచి రక్షణ కల్పించాలని కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
దండకారణ్యంలో విస్తృతంగా తనిఖీలు భారీ సంఖ్యలో పోలీసు బలగాల మోహరింపు సారథి న్యూస్, వాజేడు: కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న దండకారణ్యంలో మళ్లీ అలజడి మొదలైంది. మావోయిస్టులు తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారన్న ఇంటలిజెన్స్సమాచారం మేరకు పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికుల్లో కలవరం నెలకొంది. ములుగు జిల్లా, చత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో కొద్దిరోజులుగా పెద్దసంఖ్యలో పోలీసు బలగాలు కుంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సీఐ శివప్రసాద్ నేతృత్వంలో సివిల్ […]
సారథి న్యూస్, శ్రీశైలం(కర్నూలు): లోకకల్యాణార్థం శ్రీశైలం భ్రమరాంబదేవి అమ్మవారికి శుక్రవారం సాయంత్రం ఆలయంలో ఊయల సేవ నిర్వహించినట్లు ఈవో రామారావు తెలిపారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలనక్షత్రం రోజున అమ్మవారికి ఊయల సేవ నిర్వహిస్తామని తెలిపారు. అంతకుముందు అర్చకులు మహాగణపతి పూజ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ, సహస్త్ర నామపూజలు జరిపించినట్లు ఈవో రామారావు వెల్లడించారు.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు. ఆ ముగ్గురు జైషే మహ్మద్ టెర్రర్ గ్రూప్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారిలో ఒక వ్యక్తి ఐఈడీ ఎక్స్‌పర్ట్ అని పోలీసులు అన్నారు. కుల్గాం జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నారనే పక్కాసమాచారంతో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన సెక్యూరిటీ ముగ్గుర్ని మట్టుబెట్టారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఇన్స్ట్రక్షన్స్‌తో చాలా ఎటాక్స్‌కు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన వలీద్ అనే టెర్రరిస్టు […]
జైపూర్: రాజస్థాన్ పొలిటికల్ డ్రామా రోజుకో మలుపు తిరుతున్నది. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనాలని చూస్తోందని ఆరోపించిన కాంగ్రెస్, 19 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ మరో ముందు అడుగు వేసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరాలు ఆడారని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షకావత్, కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మపై కేసు పెట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి అమ్ముడు పోయారని విచారణలో వెల్లడైందని చెప్పింది. బీజేపీతో డీలింగ్ పెట్టుకున్నారని ఆడియో […]
జైపూర్: కాంగ్రెస్ పార్టీ తనపై కావాలనే ఆరోపణలు చేస్తోందని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమే అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ అన్నారు. కాంగ్రెస్ తనపై చేసిన ఆరోపణలు అన్నీ అబద్దం అని చెప్పారు. కేంద్ర మంత్రి తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరాలు చేశారని, దానికి సంబంధించి ఆడియో టేప్‌లు కూడా బయటికొచ్చాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించిన నేపథ్యంలో షకావత్ వివరణ ఇచ్చారు. ఆ టేప్‌లో ఉన్న వాయిస్ తనది కాదని […]
సారథి న్యూస్, హుస్నాబాద్: గిరిజన మహిళా ఎంపీటీసీని కులంపేరుతో దూషించడమే కాక.. దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కపూర్ నాయక్ తండా సర్పంచ్ బానోతు సంతోష్ నాయక్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ కు వినతిపత్రం అందజేశారు. అక్కన్నపేట మండలం గండిపల్లిలో 11న గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో ఎంపీటీసీ బానోత్ ప్రమీలను సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్ భర్త మరి కొంత మంది అసభ్య పదజాలంతో దూషించడమే కాగా […]
ముంబై: ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానంలో ఉన్న రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నాలుగు స్థానాలు పడిపోయారు. రిలయన్స్ యాన్యువల్ మీటింగ్‌లో ముఖేశ్ చేసిన ప్రకటనతో ఆ కంపెనీ షేర్లు 6శాతం పడిపోయాయి. దీంతో ఆయనకు దాదాపు 2.5 బిలియన్ డాలర్ల నష్టం ఏర్పడింది. దీంతో ప్రపంచ కుబేరుల్లో 6వ స్థానంలో ఉన్న ముఖేశ్ 10వ స్థానానికి పడిపోయారు. వారెన్ బఫెట్, లారీ పేజ్, ఎల్‌ముస్క్, సర్జీ బ్రిన్ ముందుకు వెళ్లిపోయారు. రిలయన్స్ – సౌదీ అరామ్‌కో […]