భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి ఎంతో విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్ధులను విద్యా ప్రాప్తిరస్తు అని, పెళ్లయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, పురుషులను దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తుంటారు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాల్లో అక్కడ పండితులు ‘గో బ్రాహ్మణో శుభం భవతు, లోకాస్సమస్త సుఖినోభవంతు’ అనే ఆశీర్వదిస్తారు. దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో […]
ఎవరు అంగీకరించినా.. అంగీకరించకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కులప్రాతిపదికననే నడుస్తాయన్నది సుస్పష్టం. గెలుపు ఓటముల్లోనూ కులాల ప్రభావం అధికంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఇక అధికారంలోకి వచ్చినవారు తమ సామాజికవర్గం వారిని అందలం ఎక్కించడం.. ఇతర కులస్థులను ముఖ్యంగా ప్రత్యర్థులకు అనుకూలంగా ఉన్న కులాలకు చెందినవారిపై వివక్ష చూపించడం సర్వసాధారణమే. అయితే రాజ్యాంగబద్ధమైన పదవులను ప్రభుత్వాలు గౌరవించాలి. వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వ్యవహరించాలి. ఇది రాజ్యాంగంలో పొందుపరచిన మౌలిక అంశం. ప్రజాప్రతినిధులు సైతం ఈ నిబంధనను పాటిస్తామంటూ […]
ఢిల్లీ: కరోనా చికిత్సలో ఉపయోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మరో ఔషధానికి అనుమతిచ్చింది. చర్మవ్యాధి అయిన సొరియాసిస్‌ను నయం చేసేందుకు ఉపయోగించి ‘ఇటోలీజుమ్యాజ్’మందును కరోనాకు వాడొచ్చని చెప్పింది. ఈ మెడిసిన్ కేవలం ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది. ఓ మోతాదు నుంచి తీవ్ర లక్షణాలు ఉన్నవారికి ఈ మందు వాడొచ్చని డీసీజీఐ అనుమతి ఇచ్చింది. భారత్‌కు చెందిన బయోకాన్ సంస్థ దీన్న తయారుచేస్తోంది. కోవిడ్‌పై పోరాడే యాంటీబాడీల ఉత్పత్తిలో కీలకంగా పనిచేసే సైటోకిన్ల విడుదలలో ఇది […]
ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్నది. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన గణాంకాలప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 8,20,916 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 27,114 మందికి కరోనా సోకింది. దేశవ్యాప్తంగా 2,83,407 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు 22,123 మంది కరోనాకు బలయ్యారు. 5,15,385 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజలంతా భౌతికదూరం పాటించి మాస్కులు ధరించాలని, అత్యవసరమైతేనే బయటకు […]
బెంగళూరు: కర్ణాటక సీఎం యడ్యూరప్ప హోంఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఇటీవల ఆయన కార్యాలయంలోని పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘నా కార్యాలయంలోని కొంతమందికి కరోనా పాజిటివ్ రావడంతో నేను హోం ఐసోలేషన్లోకి వెళుతున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి తాను అధికారిక నివాసం ‘కావేరి’ నుంచి పనిచేస్తానని… వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు తగిన సూచనలు […]
సారథిన్యూస్, హైదరాబాద్: హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్సపొందుతున్న కరోనా బాధితులకు ‘ఐసోలేషన్‌కిట్’ ను ఇంటికే పంపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ కిట్‌లో బాధితుడికి అవసరమైన ఔషధాలు, మాస్క్‌లు, శానిటైజర్లు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటిని కరోనా బాధితుడికి ఉచితంగా అందిస్తుంది. శుక్రవారం కోఠిలోని ఆరోగ్యకార్యాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు వీలైనంత త్వరలో ఈ కిట్లను అందజేయాలని అధికారులను ఆదేశించారు.ఐసొలేషన్ అవస్థలను తప్పించడానికే..రాష్ట్రంలో రోజురోజుకు […]
ఢిల్లీ: ఢిల్లీకి చెందిన అన్ని యూనివర్సిటీల పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా ఉదృతి రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన వార్షిక పరీక్షలు, ఇతర పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా శనివారం ట్వీట్ చేశారు. ఆయా విశ్వవిద్యాలయాలు తమ నిబంధనల ప్రకారం విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తారని. లేదా వారికి డిగ్రీ పట్టా అందజేస్తారని […]
న్యూజిలాండ్: హోం క్వారంటైన్లో ఉన్న ఓ కరోనా రోగి మద్యం కొనుగోలు చేసేందుకు భారీ సాహసమే చేశాడు. ఇనుపకంచెను తెగ్గొట్టి దాని దాటుకుంటూ వెళ్లి మద్యం కోనుగోలు చేశాడు. ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకున్నది. న్యూజిలాండ్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి(52) కి ఇటీవల కరోనా సోకగా.. అక్కడి ప్రభుత్వమే అతడిని హోంక్వారంటైన్లో ఉంచింది. క్వారంటైన్ కేంద్రం చుట్టూ భారీ ఇనుపకంచెలు కూడా ఏర్పాటు చేశారు. కాగా అందులో ఉంటున్న ఓ కరోనా రోగి మందు తాగాలనిపించంది. […]