Breaking News

Day: July 3, 2020

కరోనా లక్షణాలతో యువతి మృతి

సారథి న్యూస్, వరంగల్ రూరల్: కరీంనగర్​ జిల్లా చెన్నరావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన ఓ యువతి కరోనా లక్షణాలతో మృతిచెందింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న సదురు యువతిని గురువారం తల్లిదండ్రలు వరంగల్​లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె నుంచి శాంపిల్స్​ సేకరించే లోపే మృతిచెందిందని వైద్యులు తెలిపారు. కాగా పాపయ్యపేటలో యువతి అంత్యక్రియల్లో పాల్గొన్నవారిని హోంక్వారంటైన్​లో ఉంచారు. గ్రామస్థులంతా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు.

Read More

రైతు వేదికలతో ఎంతో లాభం

సారథిన్యూస్, రామడుగు: ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మాల్యాల, నూకపల్లి, మానాల క్లస్టర్లలో ఆయన రైతు వేదికల నిర్మాణాలకు జగిత్యాల కలెక్టర్​ గొగులోత్​ రవితో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 750 కోట్లతో రైతు కల్లాలు. ఏర్పాటు చేశామని చెప్పారు. రైతును రాజుగా చూడాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని భావించారు.

Read More

ఆగస్టు 16 నుంచి క్లాసులు

సారథిన్యూస్​, హైదరాబాద్​: ఈ ఏడాది ఆగస్టు 16 నుంచి వృత్తి విద్య, సాంకేతిక విద్యాసంస్థలను ప్రారంభించనున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తెలిపింది. శుక్రవారం ఇందుకు సంబంధించిన అకడమిక్​ క్యాలెండర్​ను విడుదల చేశారు. ఫస్టియర్‌లో చేరే విద్యార్థులకు సెప్టెంబర్​ 1 నుంచి, ఇతర విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ఏఐసీటీఈ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో కొత్తగా చేరే విద్యార్థులకు సెప్టెంబరు 15 నుంచి తరగతులు […]

Read More

మెప్మా ఆర్పీలకు జీతాలివ్వండి

సారథి న్యూస్​, హుస్నాబాద్: మున్సిపాలిటీలలో పని చేస్తున్న మెప్మా ఆర్పీలకు   వేతనాలు చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్​ చేశారు. శుక్రవారం ఆయన కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​లో మీడియాతో మాట్లాడుతూ.. మెప్మా ఆర్పీలకు సంవత్సరం నుంచి వేతనాలు అందించడం లేదని చెప్పారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మంత్రి కేటీఆర్, మెప్మా డైరెక్టర్ వెంటనే స్పందించి బకాయిలను చెల్లించాలని డిమాండ్​ చేశారు.

Read More
సూర్యాపేటలో కరోనా

సూర్యాపేటలో నర్సుకు కరోనా

సారథిన్యూస్​ సూర్యాపేట: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లాల్లోనూ అనూహ్యంగా కేసులు పెరుగుతున్నారు. సూర్యాపేట ప్రభుత్వ జనరల్​ హాస్పిటల్​లో విధులు నిర్వర్తిస్తున్న ఓ నర్సుకు, ఆమె కుటుంబసభ్యులకు కరోనా సోకింది. దీంతో వారిని ఐసోలేషన్​కు తరలించారు. మరోవైపు జిల్లా దవాఖానలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది తమకు కరోనా పరీక్షలు చేయండంటూ హాస్పిటల్​ సూపరింటెండెంట్​కు విన్నవించుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా తమకు కరోనా పరీక్షలు చేయడం లేదంటూ వారు ఆరోపిస్తున్నారు.

Read More
కరోనా ఉధృతి పెరుగుతోంది

కరోనా ఉధృతి పెరుగుతోంది

సారథి న్యూస్​, కర్నూలు: ఆంధ్రప్రదేశ్​లోనూ కరోనా ఉధృతి పెరుగుతోంది. మహమ్మారి 16వేల మార్క్‌ దాటేసింది. శుక్రవారం ఒకేరోజు 789 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకుమొత్తం 16,934 కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసులు 9,096 ఉన్నాయి. వ్యాధిబారిన పడిన 7,632 మంది డిశ్చార్జ్​ అయ్యారు. కరోనా నుంచి ఇప్పటి వరకు 206 మంది మృతి చెందారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 149, చిత్తూరు 47, తూర్పుగోదావరి 56, గుంటూరు 80, కడప 19, కృష్ణా 17, […]

Read More

తాండూరులో భారీవర్షం

సారథి న్యూస్, వికారాబాద్‌: తాండూరులో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొడంగల్​– తాండూరు మధ్య ఉన్న కాగ్నా వంతెన తెగిపోయింది. వరద మధ్యలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సుకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. బ్రిడ్జి తెగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షం కురవడంతో తాండూరు నియోజకర్గంలోని పంట పొలాలు నీటమునిగాయి. పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండాయి. కోట్ పల్లి ప్రాజెక్టు లోకి ఆరు అడుగుల వరద చేరింది. బుగ్గపూర్ కోట్ పల్లి, నర్సాపూర్ వాగులు ద్వారా […]

Read More
బన్నీకి అన్నయ్యగా..

బన్నీకి అన్నయ్యగా..

విలక్షణ నటుడిగా కోలీవుడ్ లోనే కాదు బాలీవుడ్​లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు ఆది పినిశెట్టి. ‘గుండెలో గోదారి’, ‘సరైనోడు’, ‘నిన్ను కోరి’ సినిమాల్లో తనదైన నటనతో తెలుగు వారి ఆదరణ పొందాడు. తర్వాత కమర్షియల్ డైరెక్టర్ సుకుమార్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’లో రామ్ చరణ్ అన్నగా నటించి ఇక్కడి వారికి మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా భారీ క్యాస్ట్ అండ్ క్రూ తో డైరెక్టర్ సుకుమార్ […]

Read More