ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సారథి న్యూస్, విశాఖపట్నం: లాక్ డౌన్ కారణంగా మూతపడిన జిల్లాల సరిహద్దులు సుదీర్ఘ విరామం తర్వాత శనివారం నుంచి తెరుచుకోనున్నాయి. ఇప్పటివరకు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. పాస్‌లు పొందడానికి చాలామంది ఇబ్బందిపడాల్సి వచ్చింది. కొంతమంది అన్ని ఆధారాలూ సమర్పించినా పాస్‌లు మంజూరయ్యేవి కావు. లాక్ డౌన్ ఆంక్షలను కేవలం కంటైన్ మెంట్ జోన్లకే పరిమితం చేస్తున్నందున శుక్రవారం సాయంత్రం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ […]
గొర్రెకుంట మృతుల పోస్టుమార్టం రిపోర్టు కాల్ డేటా ఆధారంగా విచారణ వేగవంతం 9మంది మృతిపై ఎన్నో అనుమానాలు సారథి న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో బయటపడ్డ 9 మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం పూర్తయింది. ప్రాణం ఉండగానే నీటిలో పడి చనిపోయినట్టు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. విషప్రయోగమా? మత్తు మందు ఇచ్చారా? అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులు షకీల్, యాకూబ్ ఫోన్స్ కీలకం కానున్నాయి. కాల్ డేటా […]
సగం ధరకే శ్రీవారి ప్రసాదం సారథి న్యూస్, తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మే 25 నుంచి రాష్ట్రంలోని 13జిల్లా కేంద్రాల్లోని టీటీడీ కల్యాణ మండపాల్లో అందుబాటులో ఉంచనుంది. లాక్ డౌన్ ముగిసి తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనానికి అనుమతించే వరకు సగం ధరకే స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు చిన్న లడ్డూను రూ.50 నుంచి రూ.25కు తగ్గించారు. లడ్డూ ప్రసాదం సమాచారం కోసం టీటీడీ కాల్ సెంటర్ […]
తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన సూర్య తన ప్రతి చిత్రాన్నీ రెండు భాషల్లో విడుదలయ్యేలా చూసుకుంటాడు. వెంకటేష్ తో ‘గురు’ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ సుధా కొంగర ప్రస్తుతం సూర్యతో తమిళంలో ‘సూరరై పోట్రు’గా తెరకెక్కిస్తోంది. ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ టైటిల్ తో విడుదల చేస్తున్నారు. అపర్ణ బాలమురళీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మోహన్ బాబు, జాకీష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన కెప్టెన్ […]
విశాఖలో స్టైరీన్ గ్యాస్ లీకేజీతో 11 మంది మృత్యువాత భయపెడుతున్న లీకేజీ ఉదంతాలు మరుపురాని భోపాల్ దుర్ఘటన సారథి న్యూస్, అనంతపురం: మానవ తప్పిదాలతో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అలాంటిదే విశాఖపట్నంలోని ఎల్ జీ పాలిమర్స్ పరిశ్రమలో స్టైరీన్ విషవాయువు లీకేజీ ఘటన. ఈ దుర్ఘటనలో 11మంది మృత్యువాతపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎంతోమంది గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున సాంకేతిక లోపంతో ట్యాంకు నుంచి ఆవిరి, పొగ రూపంలో ఈ విషవాయువు కమ్ముకొచ్చింది. […]
తెలంగాణలో కరోనా తగ్గింది రెడ్ జోన్లలో అన్ని బంద్ మే నెలలోనే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రేపటి నుంచి ఇంటర్ వాల్యూయేషన్ ఆటోలు ఓకే, ఆర్టీసీ బస్సులు నడవవ్ మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా(కోవిడ్–19) వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ ను మే 29 వరకు పొడగించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. 27 జిల్లాల్లో అన్ని సడలింపులు ఇస్తున్నామని అన్నారు. లాక్ డౌన్ కు ప్రజలంతా సహకరించాలని కోరారు. కొద్ది […]
ఇండియన్స్ ముఖ్యంగా సూపర్ హీరోగా యాక్సెప్ట్ చేసింది ముఖ్యంగా హృతిక్ రోషన్ నే.. పిల్లలైతే ఆయన సినిమా ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తుంటారు. అందుకే హృతిక్ ఇప్పుడు ‘క్రిష్’ ఫ్రాంచైజీ తెరకెక్కించడానికి సన్నాహాలు మొదలు పెడుతున్నాడు. ఇంతకుముందు వచ్చిన ఈ సిరీస్ లో వచ్చిన మూడు సినిమాలూ బిగ్ హిట్టయ్యాయి. ఇప్పుడ ‘క్రిష్ 4’ ను మొదలు పెడుతున్నట్టు హృతిక్ తండ్రి నిర్మాత, దర్శకుడు అయిన రాకేష్ రోషన్ నెలరోజుల ముందు అనౌన్స్ చేశాడు. ఇప్పుడది ఇంకాస్త స్పీడందుకుంది. […]
మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత పంటల సాగు, పంటమార్పిడి విధానంపై జిల్లా రైతులను చైతన్యం చేయాలని మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో అగ్రికల్చర్ ఆఫీసర్లతో సమీక్షించారు. ఏఈవోలు రైతుల ఇంటికి వెళ్లి వారికి మాట్లాడి పంటసేద్యంపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఏయే ప్రాంతంలో ఏ పంట వేస్తున్నారనే వివరాలను ఏఈవోలు వద్ద ఉండాలన్నారు. నాలుగైదు రోజుల్లోనే క్లస్టర్ల వారీగా రైతు […]