Breaking News

ఇతర రాష్ట్రాలకు వెళ్తే పాస్‌ తప్పనిసరి

  • ఏపీ డీజీపీ గౌతమ్​ సవాంగ్​

సారథి న్యూస్, విశాఖపట్నం: లాక్‌ డౌన్‌ కారణంగా మూతపడిన జిల్లాల సరిహద్దులు సుదీర్ఘ విరామం తర్వాత శనివారం నుంచి తెరుచుకోనున్నాయి. ఇప్పటివరకు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. పాస్‌లు పొందడానికి చాలామంది ఇబ్బందిపడాల్సి వచ్చింది. కొంతమంది అన్ని ఆధారాలూ సమర్పించినా పాస్‌లు మంజూరయ్యేవి కావు. లాక్‌ డౌన్‌ ఆంక్షలను కేవలం కంటైన్‌ మెంట్‌ జోన్లకే పరిమితం చేస్తున్నందున శుక్రవారం సాయంత్రం ఏపీ డీజీపీ గౌతమ్​ సవాంగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాకు వెళ్లాల్సి వచ్చినా పోలీసు పాస్‌ లేకుండా ఆంక్షలను సడలించారు. లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన నేపథ్యంలో నగరంలో తిరిగే మ్యాక్సీ క్యాబ్‌లు, టాక్సీ క్యాబ్‌లు, ఆటోడ్రైవర్లు అనుసరించాల్సిన విధి విధినాలను విశాఖపట్నం కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో విడుదల చేశారు.
– ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తే పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందే.
–ఇతర రాష్ట్రాలకు అత్యవసరంగా వెళ్లాల్సినవారు వారి అత్యవసర పరిస్థితిని నిరూపించే సాక్ష్యాధారాలతో serviceonline.gov.in/epass/ ఆన్​ లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.
–ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా తిరగొచ్ఛు
–కారులో డ్రైవర్‌ కాకుండా మరో ముగ్గురు ప్రయాణించవచ్చు.
–ఇతర భారీ వాహనాల్లో వాటి సీట్ల సామర్థ్యంలో 50 శాతానికి సమానమైన ప్రయాణికులు మాత్రమే ఉండాలి.
–హోటళ్లు, లాడ్జీలు, రెస్టారెంట్లు, బార్లు, సమావేశమందిరాలు, సినిమా హాళ్లు, షాపింగ్‌మాల్స్‌, స్విమ్మింగ్‌ పూల్స్‌, ఎంటర్‌టైన్‌ మెంట్​ పార్కులు, ప్రార్థన మందిరాలు, ఆలయాలను తెరవకూడదు.
–మ్యాక్సీ, ట్యాక్సీ క్యాబ్‌లు, ఆటోలను కంటైన్‌మెంట్ల జోన్లలోకి అనుమతించరు. మిగిలిన ప్రాంతాల్లో డ్రైవరు, ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి.
– ప్రతి ట్రిప్‌ చివరిలో ఒక శాతం సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో వాహనాన్ని శుభ్రపర్చాలి. 1.5 లీటర్ల స్ప్రేయర్​ ను వాహనంలో ఉంచుకోవాలి. హ్యాండ్‌ శానిటైజర్‌ను అందుబాటులో ఉంచుకోవాలి.
– 65 ఏళ్లు దాటినవారు, పిల్లలను, కరోనా లక్షణాలు ఉన్న వారిని బయటకు తీసుకురాకూడదు.