సెప్టెంబర్ 1 నుంచి బియ్యం డోర్ డెలివరీ ఏపీ సీఎం వైఎస్‌జగన్ ఆదేశాలు సారథి న్యూస్, అనంతపురం: ప్రజాపంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటికే డోర్‌డెలివరీ చేయాలని అధికారులను ఆదేశించారు. అదే రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. కరోనా(కోవిడ్–19) నివారణ చర్యలపై సమీక్షలో భాగంగా పౌరసరఫరాల శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. […]
సవర జాతి గిరిజనుల విశిష్ట సంస్కృతి ఒడిశా, ఆంధ్రా సరిహద్దుల్లో భాషా గుళ్లు భాషకు రూపం అక్షరం. సరస్వతీ నమస్తుభ్యం..అంటూ అక్షరాభ్యాస వేళ గురువు రాయించే ‘అ..ఆ’లే మన జీవన గమనానికి , భాషా పాటవానికి తొలి అడుగు. అనంతర కాలంలో మనం అక్షరాన్ని దిద్దినా, ప్రేమించినా ఆరాధించడం అనేది ఓ భావనగానే కొనసాగుతుంటుంది. ఇందుకు భిన్నం శ్రీకాకుళం జిల్లా సరిహద్దులోని ఒడిశా రాష్ట్రం గుణుపురం సమీప మిర్చిగుడ, శ్రీకాకుళం జిల్లా భామిని మండలానికి చెందిన భామిని […]
తెరుచుకున్న మద్యం షాపులు వైన్స్ వద్ద విపరీతమైన రద్దీ కొద్దిసేపటికే స్టాక్ లేక మూత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇదే తీరు సారథి న్యూస్, మెదక్: నెలన్నర రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వైన్స్ తెరచుకోడంతో మద్యం ప్రియులు షాపుల ఎదుట బారులుదీరారు. కొన్నిచోట్ల ఉదయం ఐదు గంటల నుంచే క్యూలైన్లలో నిల్చుకుని, మరికొన్ని ప్రాంతాల్లో చెప్పులను వరుసలో పెట్టడం గమనార్హం. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ విధించగా, […]
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సారథి న్యూస్, విశాఖపట్నం: లాక్ డౌన్ కారణంగా మూతపడిన జిల్లాల సరిహద్దులు సుదీర్ఘ విరామం తర్వాత శనివారం నుంచి తెరుచుకోనున్నాయి. ఇప్పటివరకు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. పాస్‌లు పొందడానికి చాలామంది ఇబ్బందిపడాల్సి వచ్చింది. కొంతమంది అన్ని ఆధారాలూ సమర్పించినా పాస్‌లు మంజూరయ్యేవి కావు. లాక్ డౌన్ ఆంక్షలను కేవలం కంటైన్ మెంట్ జోన్లకే పరిమితం చేస్తున్నందున శుక్రవారం సాయంత్రం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ […]
గొర్రెకుంట మృతుల పోస్టుమార్టం రిపోర్టు కాల్ డేటా ఆధారంగా విచారణ వేగవంతం 9మంది మృతిపై ఎన్నో అనుమానాలు సారథి న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో బయటపడ్డ 9 మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం పూర్తయింది. ప్రాణం ఉండగానే నీటిలో పడి చనిపోయినట్టు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. విషప్రయోగమా? మత్తు మందు ఇచ్చారా? అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులు షకీల్, యాకూబ్ ఫోన్స్ కీలకం కానున్నాయి. కాల్ డేటా […]
సగం ధరకే శ్రీవారి ప్రసాదం సారథి న్యూస్, తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మే 25 నుంచి రాష్ట్రంలోని 13జిల్లా కేంద్రాల్లోని టీటీడీ కల్యాణ మండపాల్లో అందుబాటులో ఉంచనుంది. లాక్ డౌన్ ముగిసి తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనానికి అనుమతించే వరకు సగం ధరకే స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు చిన్న లడ్డూను రూ.50 నుంచి రూ.25కు తగ్గించారు. లడ్డూ ప్రసాదం సమాచారం కోసం టీటీడీ కాల్ సెంటర్ […]
తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన సూర్య తన ప్రతి చిత్రాన్నీ రెండు భాషల్లో విడుదలయ్యేలా చూసుకుంటాడు. వెంకటేష్ తో ‘గురు’ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ సుధా కొంగర ప్రస్తుతం సూర్యతో తమిళంలో ‘సూరరై పోట్రు’గా తెరకెక్కిస్తోంది. ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ టైటిల్ తో విడుదల చేస్తున్నారు. అపర్ణ బాలమురళీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మోహన్ బాబు, జాకీష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన కెప్టెన్ […]
విశాఖలో స్టైరీన్ గ్యాస్ లీకేజీతో 11 మంది మృత్యువాత భయపెడుతున్న లీకేజీ ఉదంతాలు మరుపురాని భోపాల్ దుర్ఘటన సారథి న్యూస్, అనంతపురం: మానవ తప్పిదాలతో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అలాంటిదే విశాఖపట్నంలోని ఎల్ జీ పాలిమర్స్ పరిశ్రమలో స్టైరీన్ విషవాయువు లీకేజీ ఘటన. ఈ దుర్ఘటనలో 11మంది మృత్యువాతపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎంతోమంది గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున సాంకేతిక లోపంతో ట్యాంకు నుంచి ఆవిరి, పొగ రూపంలో ఈ విషవాయువు కమ్ముకొచ్చింది. […]