తెలుగు రాష్ట్రాల్లో ఏ విచిత్ర సంఘటన జరిగినా ఒక్కసారి అంతా ఓ 400 ఏళ్ల పైచిలుకు కాలానికి వెళ్లి అది అప్పుడే బ్రహ్మంగారు చెప్పారంటూ కథలుగా, వింతలుగా చెప్పుకోవడం సర్వసాధారణం. ఇక ఆయన పేరిట పల్లెపట్టణాలు, తెలుగు లోగిళ్లలోనూ అనేక తత్వాలు ప్రాచుర్యంలో ఉండీ ముఖ్యంగా సన్యాసం తీసుకున్న వారు పాడుతుండడం ఏళ్లతరబడి సాగుతున్న సంప్రదాయమే. అసలు విషయానికి వస్తే పోతులూరు వీరబ్రహ్మేంద్రుల వారిని ఒక మత సిద్ధాంతవేత్తగానో, ఆధ్యాత్మికవాదిగానో చూసే కంటే ఆయన జీవితంలోని ఆటుపోట్లు […]
చిన్నారుల మృతి.. తల్లి పరిస్థితి విషమం సారథి న్యూస్, మేడ్చల్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చిన్నారులు చనిపోగా, తల్లి పరిస్థితి విషమంగా మారింది. పోలీసుల కథనం మేరకు.. వరంగల్ జిల్లాకు చెందిన గోపీనాథ్‌కు ప్రీతి అనే మహిళతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా వీరు మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని మజీద్‌పూర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు గౌరవ్(4), కౌశిక్(3) ఉన్నారు. గోపీనాథ్ ఓ ప్రైవేట్ సంస్థలో […]
యువతిపై కేసునమోదు సారథి న్యూస్, రామడుగు: ప్రియుడి స్నేహితురాలి పేరుతో నకిలీ పేస్ బుక్ అకౌంట్ సృష్టించిన ఓ యువతిపై రామడుగు పోలీసులు బుధవారం కేసు నమోదుచేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన సదరు యువతి స్థానికంగా ఓ షాపులో పనిచేస్తోంది. అదే దుకాణంలో పనిచేస్తున్న సదరు వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది. ఆ వ్యక్తి మరో మహిళతో సన్నిహితంగా ఉండడాన్ని జీర్ణించుకోలేని యువతి.. ప్రియుడి ద్వారా ఆ మహిళ ఫోన్ నంబర్ తీసుకుని నకిలీ పేస్ బుక్ […]
ట్విట్టర్ లో ఎంపీ విజయసాయిరెడ్డి సారథి న్యూస్, అనంతపురం: ఏపీ ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా బుధవారం విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. ‘చంద్రబాబు గారూ.. ఎల్జీ ప్లాంట్ కు అనుమతులపై చర్చకు వస్తారా..మీరు ఇంట్లోంచి బయటకు వస్తారా? నన్ను హైదరాబాద్ రమ్మంటారా, మీరు విజయవాడ వస్తారా?’ అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో.. ‘రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు దిక్కుతోచడం లేదు. వీళ్లు […]
సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం తంగళ్లపల్లి, కూరెళ్ల గ్రామాలకు సమీపంలో ఉన్న మోయతుమ్మెద వాగులో బుధవారం సాయంత్రం గుడ్డెలుగులు సంచరించడంతో స్థానిక రైతులు, గ్రామస్తులు హడలిపోయారు. గుడ్డెలుగులు కొన్ని నెలలుగా ప్రజలు, రైతులు వ్యవసాయ క్షేత్రాలకు రాత్రివేళలో వెళ్లలేకపోతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి జనారణ్యంలో సంచరిస్తున్న వాటిని తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి అనుబంధ గ్రామం మామిడిచెట్టిపల్లి పరిసర పంటపొలాల్లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని అర కిలోమీటర్ మేర వ్యాపించాయి. సమీప రైతులకు చెందిన పశుగ్రాసం పూర్తిగా దగ్ధమైంది. వ్యవసాయ బోరుబావుల వద్ద కరెంట్ తీగలు కూడా కాలిబూడిదయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.
30 మంది క్వారంటైన్ సారథి న్యూస్, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ తో పాటు సిర్గాపూర్, కంగ్టి, కల్హేర్, మనూర్, నాగుల్ గిద్ద మండలాల ప్రజలను కరోనా మహమ్మారి భయం వెంటాడుతోంది. హైదరాబాద్ లోని ఓ బేకరీలో గరిడేగావ్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పనికి వెళ్లాడు. ఈనెల 10న సొంతూరుకు తీవ్రమైన జ్వరంతో వచ్చాడు. జ్వరం తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు కరోనా పాజిటివ్ ఉందని […]
మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: ఈ ఏడాది ఆగస్టు నాటికి హైదరాబాద్ నగరంలో 50వేల మంది పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో గృహ నిర్మాణశాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలోనే […]