Breaking News

Month: May 2020

యూఎస్‌లో చాలాచోట్ల కర్ఫ్యూ

అమెరికా: మినియాపొలిస్‌లో పోలీసుల చేతిలో ఆఫ్రికన్‌ ఆమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ చనిపోయిన ఘటనపై అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. మినియా పొలిస్‌లో ఆందోళనలు ఐదవ రోజూ కొనసాగాయి. అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌, చికాగో, అట్లాంటాలో కర్ఫ్యూ విధించారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని ఆదేశించారు. శాంతి భద్రతలను నెలకొల్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్‌ గార్డ్‌ సోల్జర్స్‌ చెప్పారు. సియాటెల్‌ నుంచి న్యూయార్క్‌ వరకు వందలాది మంది ఆందోళనకారులు రోడ్లపై ఆందోళనకు దిగారు. లాస్‌ఏంజెల్స్‌లో ఆందోళనకారులను తరిమికొట్టేందుకు పోలీసులు ఫైరింగ్‌ […]

Read More

మావోయిస్టు కమిటీ సభ్యుల సరెండర్​

సారథి న్యూస్​, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం కుర్నపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు నిషేధిత మావోయిస్ట్ పార్టీ కమిటీ సభ్యులను ఆదివారం గ్రామస్తులు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట సరెండర్ చేయించారు. వారిలో కోరం నాగేశ్వర్రావు, కొమరం రమేష్ , సొందే రమేష్, కోరం సత్యం, ఇర్పా వెంకటేశ్వర్లు, వాగే కన్నారావు ఉన్నారు. ఇకపై మావోయిస్టులకు సహకరించేది లేదని గ్రామస్తులంతా స్వచ్ఛందంగా తీర్మానం చేశారు.

Read More

ఉత్సాహంగా పల్లెప్రగతి

సారథి న్యూస్​, రామడుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఉత్సాహంగా సాగుతోంది. ఆదివారం సర్పంచ్ ప్రమీల, ఉపసర్పంచ్ రాజేందర్, పంచాయతీ కార్యదర్శి జ్యోతితో పాటు పాలకవర్గ సభ్యులు వివిధ వార్డులను సందర్శించి పారిశుద్ధ్యం తీరును తెలుసుకున్నారు. కార్యక్రమంలో సముద్రాల శ్రీను, నీలం రవి, సుబద్ర, మాజీ సర్పంచ్ పంజాల జగన్మోహన్, మామిడి కుమార్, పెందోట రాజు, మామిడి అంజయ్య పాల్గొన్నారు.

Read More

సిటీలో భారీ వర్షం

సారథి న్యూస్​, హైదరాబాద్: వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్నటిమొన్నటి వరకు భరించలేని ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్​ మహా నగరవాసులకు కాసింత ఉపశమనం దొరికింది. నైరుతి రుతుపవనాల రాక నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. ఈదురుగాలులకు పైకప్పు రేకులు లేచిపోయాయి. ఎల్​బీ నగర్​, వనస్థలిపురం, తార్నాక, బంజారాహిల్స్​, హయత్​ నగర్​, తుర్కయంజాల్​, నల్లకుంట, ఎల్బీనగర్​, అంబర్​పేట, కీసర, మాల్కాజ్​గిరి, చంపాపేట, తార్నాక, హబ్సిగూడ, సరూర్​నగర్​ తదితర ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. అలాగే […]

Read More

కరోనాను అరికడదాం

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్​ లోని కరోనా హాట్​స్పాట్​ ఏరియాలో మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి ఆదివారం పర్యటించారు. కరోనా నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలని సూచించారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్​ను ఫైర్​ ఇంజన్ ద్వారా పిచికారీ చేయించారు. వారి వెంట మున్సిపల్​ అధికారులు, కౌన్సిలర్లు ఉన్నారు.

Read More

కృష్ణాజలాలను తరలిస్తే ఊరుకోం

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: దక్షిణ తెలంగాణ ప్రజల గోస తీరాలంటే కృష్ణానదిపై ప్రతిపాదిత పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తిచేయాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమం తప్పదన్నారు. కృష్ణాజలాలను అక్రమంగా రాయలసీమకు తరలించుకుపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే పరిస్థితి లేదన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జడ్పీ మీటింగ్​ హాల్​లో జర్నలిస్టులకు బియ్యం, ఇతర నిత్యవసర […]

Read More

మెదక్ జిల్లాలో మూడు కరోనా కేసులు

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. 28వ తేదీన జిల్లాలోని పాపన్నపేట మండలం కొడపాక గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడు, చేగుంటకు చెందిన 54ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు టెస్టుల్లో తేలింది. ఈ క్రమంలో వారి కుటుంబసభ్యులను క్వారంటైన్​కు తరలించి, కరోనా లక్షణాలు ఉన్న వారికి టెస్టులు చేశారు. ఈ మేరకు ఆదివారం చేగుంటలో కరోనా సోకిన వ్యక్తి భార్యకు కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను చికిత్స కోసం […]

Read More

రావొచ్చు.. పోవొచ్చు

ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేత కంటైన్​మెంట్​ జోన్లలో జూన్​ 30వ వరకు లాక్​డౌన్​ ఇతర జోన్లలో 7వ తేదీ వరకు మాత్రమే.. సారథి న్యూస్​, హైదరాబాద్​: కంటైన్​మెంట్​ జోన్లలో జూన్ 30 వరకు, ఇతర జోన్లలో జూన్​ 7వ తేదీ వరకు లాక్​ డౌన్​ కొనసాగిస్తున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్​రావు ప్రకటించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాష్ట్రమంతా కర్ఫ్యూ అమలవుతుందని స్పష్టంచేశారు. లాక్ డౌన్ కు సంబంధించి కేంద్ర […]

Read More