సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సామాజికసారథి, హైదరాబాద్: దేశంలో మతోన్మాదశక్తులను రెచ్చగొడుతూ బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చెప్పేదొకటి, చేసేదొకటి అనే విధంగాపరిపాలన సాగిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజావసరాలకు అనుగుణంగా తీసుకురావాల్సిన చట్టాలను వారి స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని తప్పుబట్టారు. ప్రశ్నించాల్సిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి బానిసలుగా మారారని ధ్వజమెత్తారు. దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు రాజకీయ […]
ప్రశ్నించే గొంతును నొక్కేస్తే ఊరుకునేదే లేదు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సామాజిక సారథి, సిద్దిపేట: గ్రీన్ ట్రిబ్యునల్ పరిహారం ఇచ్చిన తర్వాతే రిజర్వాయర్ పనులు చేపట్టాలని ఆదేశించినా అవేవి పట్టనట్లు ప్రభుత్వం వ్యవహస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి భూనిర్వాసితులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు. భూనిర్వాసితులు దశాబ్దంన్నర కాలంగా పరిహారం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, ప్రభుత్వం, అధికారులు […]
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సామాజిక సారథి,వరంగల్: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని ద్వంసం చేస్తూ కార్పొరేట్ లకు కొమ్ము కాస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా సీపీఐ రాజకీయ శిక్షణా తరగతులు బీమదేవరపల్లి మండలం కొత్త కొండ గ్రామంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక హరిత హోటల్ ఎదుట సీపీఐ పతాకాన్ని చాడ వెంకట్ రెడ్డి ఎగుర వేశారు. అనంతరం సీపీఐ […]
సామాజిక సారథి డిండి: ప్రజా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలాపురంలో సీపీఐ నూతన జెండా ఆవిష్కరణతో పాటు జోగు బజార్ 12 వ వర్ధంతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు బజార్ స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఎండి మైన్ఉద్దీన్, సీపీఐ మండల కార్యదర్శి పోలే వెంకటయ్య, […]
సారథి, రామడుగు: దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఏఐఎస్ఎఫ్ కీలక భూమిక పోషించిందని జిల్లా అధ్యక్షుడు మచ్చ రమేష్ గుర్తుచేశారు. గురువారం ఏఐఎస్ఎఫ్ 86వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐఎస్ఎఫ్ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చదువు, పోరాడు అనే నినాదంతో ఉద్యమిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ మాత్రమేనని అన్నారు. భగత్ సింగ్ లాంటి దేశభక్తులను ఆదర్శంగా తీసుకొని శాస్త్రీయ విద్యావిధానం, కామన్ స్కూలు విధానం కోసం పోరాటం […]
సారథి, చొప్పదండి: సర్కారు భూముల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 15న జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం చొప్పదండి మండలం రుక్మపూర్ గ్రామంలో సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములను వేలం వేసి అమ్మడానికి నిర్ణయించడం దుర్మార్గమని, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి, వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టుబడిదారీవర్గాలకు, పార్టీ నాయకులకు అప్పనంగా […]
సారథి, రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల అమ్మకానికి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 15న జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం రామడుగు మండల కేంద్రంలో సీపీఐ ముఖ్యకార్యకర్తల సమావేశం గొడిశాల తిరుపతిగౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల వేలం కోసం తెచ్చిన జీవోనం.13ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇండ్ల […]
సారథి, కొల్లాపూర్: కృష్ణానది నీటిని అక్రమంగా ఏపీ ప్రభుత్వం తరలించడాన్ని నిరసిస్తూ శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాను జయప్రదం చేయడానికి కొల్లాపూర్ నుంచి సీపీఐ నాయకులు బయలుదేరారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య మహిళా కార్యదర్శి ఇందిర, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కిరణ్, జిల్లా సమితి నాయకులు కురుమయ్య, కొల్లాపూర్ టౌన్ కార్యదర్శి ఎండీ యూసుఫ్, హమాలీ యూనియన్ అధ్యక్షుడు సత్యం, వెంకటాచలం, శీను, గంగన్న, హరికురుమయ్య, ఎల్లయ్య, వెంకటమ్మ, చిన్నమ్మ, కురుమయ్య, చెన్నకేశవులు, ఎం.నరసింహ, […]