Breaking News

సినిమా

అల్లూ అర్జున్​పై కేసు!

అనుమతులు లేకుండా సినిమా షూటింగ్​ చేస్తుండటంతో తెలుగు సినీహీరో అల్లూ అర్జున్​పై ఆదిలాబాద్​ జిల్లా నేరడిగొండ పీఎస్​లో కేసు నమోదైంది. కరోనా నేపథ్యంలో ఆదిలాబాద్​ జిల్లాలోని కుంటాల జలపాతం సందర్శనను రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే అల్లూ అర్జున్​, పుష్ప చిత్ర యూనిట్​ కుంటాల జలపాతాన్ని సందర్శించడమే కాక అక్కడికి సమీపంలోని తిప్పేశ్వర్​ అటవీప్రాంతంలో షూటింగ్​ చేశారు. దీంతో సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్​, పుష్ప సినిమా […]

Read More

పాలమూరులో ‘పుష్ప’ షూటింగ్​

సుకుమార్​ దర్శకత్వంలో అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కుతున్న పుష్ఫ చిత్రం షూటింగ్​ తెలంగాణ లోని పాలమూరు అడవుల్లో జరగనున్నట్టు సమాచారం. కరోనాతో ఈ చిత్రం షూటింగ్​ ఆగిపోయింది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం కూడా షూటింగ్​లకు అనుమతి ఇవ్వడంతో కొంతమంది సిబ్బందితో షూటింగ్​ను ప్రారంభించనున్నారట. పుష్ప చిత్రం ‘ఎర్రచందనం స్మగ్లింగ్​’ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు టాక్​. బన్నీ లారీ డ్రైవర్​ పాత్రలో నటించనున్నారట. అల్లు అర్జున్​ గెటప్​కూడా కొత్తగా ఉంది. ఈ సినిమా చాలా భాగం అడవుల్లో తెరకెక్కించాల్సి ఉంటుంది. ఇప్పటికే […]

Read More

కేజీఎఫ్​ డైరెక్టర్​తో ప్రభాస్​ సినిమా

కేజీఎఫ్​ డైరెక్టర్​ ప్రశాంత్​నీల్ దర్శకత్వంలో యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్​ ఓ సినిమా చేయనున్నట్టు టాక్​. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. యువతకు, మాస్​ ఆడియన్స్​ను ఆకట్టుకోవడంలో ప్రశాంత్​ నీల్​ దిట్ట. ఆయన తెరకెక్కించిన కేజీఎఫ్​ చిత్రం సంచలన విజయం సాధించింది. మొత్తం భారతీయ సినిపరిశ్రమ అంతా ప్రశాంత్​ నీల్​ గురించే చర్చించుకుంది. అంతటి క్రేజ్​ ఉన్న ప్రశాంత్​ నీల్​.. ప్రభాస్​తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ప్రశాంత్​ నీల్​ ప్రస్తుతం […]

Read More

ఆర్జీవీ తర్వాత టార్గెట్​ బాలయ్యేనా?

ఇప్పటికే ‘పవర్​స్టార్​’ అనే సినిమా తీసి సంచలనం సృష్టించిన ఆర్జీవీ.. తర్వాత మరో అగ్రనటుడు బాలకృష్ణను టార్గెట్​ చేయబోతున్నట్టు సమాచారం. 16 ఏండ్ల క్రితం బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో బెల్లంకొండ సురేశ్​ గాయపడ్డాడు. తర్వాత రాజకీయ కారణాలతో ఈ కేసు మరుగున పడింది. ఆ రాత్రి బాలయ్యబాబు ఇంట్లో ఏం జరిగిందో అన్న క్యూరియాసిటీ ప్రతి ఒక్కరి మనస్సులోనూ ఉండిపోయింది. అయితే కాలక్రమేణా ఆ ఘటనను అందరు మరిచిపోయారు. కానీ […]

Read More

బిగ్​బాస్​ ఫేం రవికృష్ణకు కరోనా

కరోనా మహమ్మారి టీవీ, సినిమా ఇండస్ట్రీని వణికిస్తున్నది. తాజాగా బిగ్​బాస్​ ఫేం రవికృష్ణకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్నే స్వయంగా రవికృష్ణే సోషల్​ మీడియా ద్వారా వెల్లడించారు. ఇటీవల తనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​ అని తేలిందని చెప్పారు. హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, కరోనా లక్షణాలు ఏమి లేవని చెప్పారు. తనతో కాంటాక్ట్​ అయినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని రవి సూచించారు. […]

Read More

అద్దెకు రామోజీ ఫిల్మ్ సిటీ

ప్రపంచంలో అతిపెద్దదైన రామోజీ ఫిల్మ్​సిటీని అద్దెకు ఇచ్చేశారు. కరోనా వ్యాప్తి, లాక్​డౌన్​తో సినిమా ఇండస్ట్రీ దారుణమైన నష్టాలను చవిచూసింది. పెద్ద, చిన్న తేడాలు లేకుండా సినిమాలు అన్నీ అటెకెక్కాయి. చివరకు టీవీ సీరియళ్ల చిత్రీకరణలు కూడా నిలిపివేశారు. ఇప్పుడిప్పుడే టీవీల షూటింగ్ లు ప్రారంభం అయ్యాయి. లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఫిల్మ్ సిటీలో అన్ని కార్యకలాపాలు నిలిపివేశారు. పనులు లేకపోవడంతో సిటీ యాజమాన్యం అక్కడ పనిచేసే సిబ్బందిలో దాదాపు అరవై శాతం ఉద్యోగుల వరకూ […]

Read More