సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పల్లె పకృతి వనం’ కార్యక్రమంలో గ్రామాలన్నీ ఆహ్లాదభరితంగా మారనున్నాయని పీడీ వెంకటేశ్వరరావు, ఏపీడీ మంజుల, ఏపీవో చంద్రశేఖర్ పేర్కొన్నారు. శనివారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో ప్రకృతివనాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పల్లెలను ఆహ్లాదభరితంగా ఉంచాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. కార్యక్రమంలో పీడీ వెంకటేశ్వర్లు, ఏపీడీ మంజుల, ఏపీవో చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి అనిల్ తదితరులు […]
సారథిన్యూస్, రామడుగు: తమకు ఇష్టమైన రాజకీయ నాయకుల పుట్టినరోజులకు పోటీపడి ఉత్సవాలు చేసే నాయకులు.. మహనీయుడైన అబ్దుల్ కలాం వర్ధంతిని మరిచారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పలుచోట్ల కలాంకు వివిధ పార్టీల నాయకులు నివాళి అర్పించారు. కానీ కరీంనగర్ జిల్లా రామడుగులో మాత్రం నేతలు కలాంను మరిచిపోయారు. ఒక పువ్వు పెట్టి నివాళి అర్పించే సమయం కూడా వారికి లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నాయకులను ప్రసన్నం చేసుకోవడం తగ్గించి.. దేశానికి సేవచేసిన మహనీయులను […]
సారథి న్యూస్, రామడుగు: సర్వస్వం కోల్పోయిన ఓ గల్ఫ్ బాధితుడికి దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి అండగా నిలబడింది. ఆదిలాబాద్ జిల్లా, సారంగాపూర్ మండలం, చించోలికి చెందిన అంధకూర్ లింగయ్య కొంతకాలం క్రితం ఓ ఏజెంట్ సాయంతో దుబాయ్ వెళ్లాడు. కానీ అతడికి అక్కడ పనిదొరకలేదు. దీంతో ట్రక్కుల మధ్యలో పడుకుంటూ.. యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి సమన్వయకర్త గణేశ్, సామాజికవేత్త జైతా నారాయణ లింగయ్య అతడికి ఉండటానికి వసతి […]
సారథిన్యూస్, రామడుగు: కరోనా మహమ్మారి మారుమూల పట్టణాలకు పాకింది. తాజాగా కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య అధికారులు వెల్లడించారు. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నది. బుధవారం నుంచి 4రోజుల పాటు పట్టణంలో సంపూర్ణ లాక్డౌన్ పాటించాలని గ్రామపంచాయతీ పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే కిరాణా దుకాణాలు తెరుస్తామని ఆ సమయంలోనే సరుకులు కొనుగోలు చేయాలని పంచాయతీ పేర్కొన్నది. నిబంధనలు అతిక్రమించినవారికి […]
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల గోపాల్రావుపేటలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో మార్కెట్ ఆవరణలో 500 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.. మొక్కలను నాటడం గొప్పకాదు వాటిని పరిరక్షించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్ల వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, రామడుగు: సీఎం కేసీఆర్ అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంర్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పని చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, జెడ్పీటీసీ మారుకొండ లక్ష్మీ, మాజీ ఎంపీపీ మారుకొండ కృష్ణారెడ్డి, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు […]
సారథిన్యూస్, రామడుగు: కరోనాను వెంటనే ఆరోగ్య శ్రీ లో చేర్చాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజమల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాను అదుపుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. లాక్డౌన్ ఎత్తివేయడంతోనే కరోనా విజృంభించిందని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలుచేసి ఉపాధి కోల్పోయినవారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగులో రామాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని బీజేపీ నాయకులు శనివారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని నర్సింగరావు చెరువు లో గుండు పై రాముని పాదుకలు ఉండటం వల్ల రామడుగు అనే పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి ఒక ఎకరం శిఖం భూమి కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో పురేళ్ల శ్రీకాంత్, అనుపురం పరుశరాం, శివ, భరత్, నరేశ్, సురేశ్ […]