హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కోవిడ్ బారినపడ్డారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆయన స్వయంగా వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌లో హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఆయన చెప్పారు.
అమరావతి: కేంద్రప్రభుత్వం తాజా నిర్ణయంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో తమకు ఎటువంటి సంబంధం లేదని కేంద్రప్రభుత్వం హైకోర్టుకు తేల్చిచెప్పింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని భావించిన టీడీపీకి ప్రస్తుత బీజేపీ నిర్ణయంతో ఆశలు అడుగంటాయి. రాజధాని ఏర్పాటు కేంద్రం పరిధిలోని అంశమని పీవీ కృష్ణయ్య అనే వ్యక్తి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన […]
న్యూఢిల్లీ: అయోధ్య మహాఘట్టానికి వేళయింది. ఆలయ నిర్మాణానికి బుధవారం మధ్యాహ్నం ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో బృహత్తర రామాలయం నిర్మాణానికి మరికొన్ని గంటల్లో భూమిపూజ మహోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకలను ప్రతిష్ఠించి..నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సంఘ్ అధినేత మోహన్ భగవత్ తదితరులు రానున్నారు. బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొంటారు.ఇదీ చరిత్రసరయూనది ఒడ్డున […]
సారథి న్యూస్, కర్నూలు: గతంలో ఎక్కడా కనిపించని బ్రాండ్లను తీసుకొచ్చి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని, దీనివల్ల తాగుడుకు అలవాటుపడిన పేదలు గంజాయి, నాటుసారా తాగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారధి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విడత వారీగా మద్య నిషేధానికి తాము మద్దతిస్తామని, కానీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సరైన, నాణ్యమైన మద్యం విక్రయించకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఇప్పుడు శానిటైజర్లు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ మరింతగా బలపడేందుకు ప్లాన్ చేస్తోంది. అందుకు అనుగుణంగా కమిటీలను నియమిస్తోంది. సమర్థవంతమైన నేతలకు బాధ్యతలు అప్పగిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆదివారం పూర్తి కమిటీని ప్రకటించారు. జి.విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బండారు శోభారాణి, సంకినేని వెంకటేశ్వరరావు, ఎండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మనోహర్‌రెడ్డి, బండారు శోభారాణిని ఉపాధ్యక్షులుగా నియమించారు. అలాగే ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌నేత పైడికొండల మాణిక్యాలరావు కరోనాతో శనివారం కన్నుమూశారు. ఇటీవల ఆయన తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్ భీమ శంకరరావు(తాతాజీ)తో కలిసి ఒకే కారులో ప్రయాణించారు. శంకరరావుకు కరోనా ప్రబలినట్లు నిర్ధారణ కావడంతో మాణిక్యాలరావు కూడా కరోనా టెస్టు చేయించుకున్నారు. 20 రోజుల పాటు ఏలూరు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకొచ్చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. తాడేపల్లిగూడెం నుంచి బీజేపీలో సామాన్య కార్యకర్త నుంచి […]
సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఎందరో చిరుద్యోగులు ఉపాధి కోల్పోయి వీధినపడ్డారని, వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారధి డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదులక్షల మందికి పైగా ప్రైవేట్ స్కూలు, కాలేజీ టీచర్లు, సిబ్బంది ఉన్నారని, వారంతా ఐదునెలలుగా ఉపాధి లేక వీధుల్లో కూరగాయలు అమ్ముకోవడం, వ్యవసాయ కూలీగా మారుతున్నారని, అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను […]
జైపూర్, న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ సెషన్ నిర్వహించేందుకు గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జైపూర్ రిసార్ట్ నుంచి జైసల్మీర్‌లోని హోటల్‌కు తరలిస్తున్నారని సమాచారం. ఆగస్టు 14న బలపరీక్ష నిర్వహించేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ వర్గం సిద్ధం అవుతోంది. తనకు సపోర్ట్‌గా ఉన్న 100 మంది ఎమ్మెల్యేలను జైపూర్‌లోని రిసార్ట్ నుంచి జైసల్మీర్‌లోని రిసార్ట్‌కు తరలిస్తున్నారు. బీజేపీ తమ పార్టీలోని […]