సారథి న్యూస్, బిజినేపల్లి: నవోదయ విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని అఖిల భారత నవోదయ విద్యాలయాల ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ ఎంపీ పి.రాములును బుధవారం కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరాచారి మాట్లాడుతూ.. 2004 జనవరికి ముందు విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్సౌకర్యం కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తడి తీసుకురావాలని కోరారు. సుదీర్ఘకాలంగా జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో […]
సారథి న్యూస్, హైదరాబాద్: వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించివారినికి ఇచ్చే పద్మ అవార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్15వ తేదీ వరకు పెంచింది. వివిధ రంగాల్లో విశేషంగా కృషిచేసిన వారికి గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ పురస్కారాలను ఇవ్వనుంది. ఇప్పటివరకు 8,035 దరఖాస్తులు రాగా.. 6,361 దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది.
హైదరాబాద్: కరోనా మహమ్మారి బారినపడిన జర్నలిస్టులకు కేంద్రప్రభుత్వం రూ.50వేలు నుంచి రూ.లక్ష వరకు ఆర్థిక సహాయం అందజేస్తోంది. అలాగే మృతిచెందిన వారికి రూ.ఐదులక్షల సాయం అందజేస్తోంది. కొవిడ్ట్రీట్మెంట్ అనంతరం డిశ్చార్జ్అయిన జర్నలిస్టులు ధ్రువీకరణ పత్రాలతో కింద తెలియజేసిన లింక్ లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలను కింద పేర్కొన్న లింక్‌లో పొందుపరిచారు. http://pibaccreditation.nic.in/jws/default.aspx
చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం బాగున్నదని సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్భూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. అయితే కుష్బూపై సొంతపార్టీ నేతలే ఫైర్ అవుతున్నారు. కేంద్ర నూతన విద్యావిధానంపై కాంగ్రెస్ యువ నేత రాహుల్ సహా ఆ పార్టీ నేతలంతా విమర్శించారు. ఈ నేపథ్యంలో కుష్బూ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. కుష్బూ పార్టీ లైన్‌ను దాటి మాట్లాడిందని నేతలు ఆరోపించారు. అది కేవలం […]
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త రూల్స్ జారీచేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ మంగళవారం కొత్త సర్క్యూలర్‌ను పాస్ చేసింది. కేవలం లక్షణాలు లేని వారు మాత్రమే ఆఫీస్‌కు రావాలని చెప్పింది. ఏ మాత్రం దగ్గు, జలుబు, జ్వరం ఉన్నా ఇళ్లలోనే ఉండాలని చెప్పింది. కంటైన్మెంట్ జోన్లలో ఉన్నవారు కచ్చితంగా […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఆరోగ్యసేతు యాప్ ను తక్షణమే డౌన్‌లోడ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర జాయింట్ సెక్రటరీ జి.జయంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఔట్ సోర్సింగ్ స్టాఫ్ కూడా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. వారివారి కార్యాలయాలకు హాజరయ్యే ముందు స్టేటస్ గమనించాలని కోరింది. యాప్‌లో సేఫ్, లేదా లో రిస్క్ అని వస్తేనే ఆఫీసుకు బయలుదేరాలని, యాప్ స్టేటస్ కనుక మోడరేట్ లేదా హై రిస్క్ అని చూపిస్తే […]