ప్రజల ప్రాణాలు పోతుంటే ఏం సాధించారు తిరుగుబాటును అరికట్టడానికి వేరే విధానాలు ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల న్యూఢిల్లీ: ఈశాన్య భారతంలో సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు చేయాలని ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల కోరారు. ఇదే అంశంపై ఆమె 16 ఏళ్ల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టారు. తాజాగా నాగాలాండ్‌లో సాధారణ పౌరులపై పోలీసుల కాల్పుల నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనతోనైనా […]
లక్ష రూపాయల నగదు, బంగారం చోరీ సామాజిక సారథి, సంగారెడ్డి: సదాశివపేటలో బస్సు ఎక్కిన మహిళ వద్ద నుంచి లక్ష రూపాయల నగదు, మూడు మాసాల బంగారం చోరి జరిగింది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన విజయలక్ష్మీ తన భర్త ,కూతురుతో హైదరాబాద్ వెళ్లేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు సంగారెడ్డి బస్సు ఎక్కారు. బస్సు నందికంది వద్దకు చేరుకోగానే విజయలక్ష్మి టిక్కెట్ తీసుకునేందుకు చిల్లర కోసం […]
ప్రముఖులకు శిల్పాచౌదరి వల రూ.కోట్లలో దండుకుని మోసం ఫిర్యాదులతో అరెస్ట్ చేసిన పోలీసులు సామాజిక సారథి, హైదరాబాద్: పార్టీల పేరుతో టాలీవుడ్ హీరోలు, ప్రముఖులను వలలో వేసుకుని కోట్ల రూపాయలను దండుకున్న వ్యాపారవేత్త, సినీనిర్మాత శిల్పాచౌదరీని శనివారం పోలీసులు అరెస్ట్‌చేశారు. నార్సింగ్ మున్సిపాలిటీ గండిపేట సిగ్నేచర్ విల్లాలో నివాసం ఉంటున్న చౌదరి గత కొన్నాళ్లుగా గండిపేట, కోకాపేట, మణికొండ, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్, విజయవాడ, కర్నూలు, ఇతర ప్రాంతాలకు చెందిన సంపన్న కుటుంబాల్లోని మహిళలతో కిట్టీ పార్టీలు ఏర్పాటు […]
ఆయనో ప్రజాప్రతినిధి.. తమ సమస్యలను పరిష్కరిస్తాడని, తమ కష్టాలను తీరుస్తాడని ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు. కానీ పార్లమెంట్‌కు వెళ్లిన సదరు ఎంపీ అశ్లీల వీడియోలు చూస్తూ మీడియాకు అడ్డంగా దొరికారు. అదృష్టవశాత్తు ఆయన మనదేశపు ఎంపీ కాదు. థాయిలాండ్ చోన్బూరి ప్రావిన్స్ ఎంపీ రోన్నాథెప్ అనువత్. గురువారం థాయిలాండ్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగంపై చర్చ జరుగుతున్నది. ఎంపీ గారికి బడ్జెట్ ప్రసంగం బోర్‌కొట్టినట్టుంది. వెంటనే ఫోన్ తీసి బూతు వీడియోలు ఓపెన్ చూశాడు. తాను పార్లమెంట్లో ఉన్నానని.. […]
సారథిన్యూస్, పెద్దపల్లి: ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా రాఖీ కడుదామనుకున్న ఓ సోదరి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు ఆ మహిళను బలితీసుకున్నది. సోదరుడి చేతుల్లోనే ఆ యువతి ప్రాణాలు విడిచింది. ఈ విషాధ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని రాజీవ్ రహదారిపై శనివారం చోటుచేసుకున్నది. పెద్దపల్లి జిల్లాకు చెందని ఓ మహిళ రాఖీ పౌర్ణమి పండుగకోసం తన సోదరుడితో కలిసి గోదావరిఖనికి బైక్‌పై వస్తుండగా.. రాజీవ్ […]
బళ్లారి: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇది నిజంగా విస్తుగొలుపే వార్త. వందేళ్లు నిండిన ఓ బామ్మ కరోనాకు సోకింది. ఇంకేముంది కుటుంబసభ్యులు ఆశలు వదులుకున్నారు. కానీ విచిత్రంగా ఆ వృద్ధురాలు కరోనా నుంచి కోలుకున్నది. దీంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేవు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన ఓ వృద్ధురాలికి కరోనా సోకింది. దీంతో ప్రభుత్వ వైద్యులు ఆమెను ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ వృద్ధురాలు కోలుకున్నది. తాను […]
ముంబై: కరోనాతో లక్షణాలతో కోవిడ్ సెంటర్లో చేరిన ఓ మహిళపై యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ హేయమైన ఘటన ముంబైలో చోటుచేసుకున్నది. కరోనా లక్షణాలతో ఓ మహిళ(40) నేవీ ముంబైలోని కోవిడ్ సెంటర్లో చేరింది. మహిళ రెండోఅంతస్థులో ఉండగా.. డాక్టర్‌గా పరిచయం చేసుకున్న ఓ యువకుడు ఆమెపై లైంగికదాడి చేశాడు. సదరు యువకుడు కూడా అదే కోవిడ్ సెంటర్లో ఐదోఅంతస్థులో చికిత్సపొందుతున్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.