55.02 ఎకరాల మా భూమిను రియల్ ఎస్టేట్ వెంచర్ కు అమ్ముకున్నరు వెల్దండ తహసీల్దార్ ఆఫీసు ఎదుట బాధిత రైతుల ఆందోళన సామాజికసారథి, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా మండలంలోని చెర్కూర్ శివారులో చౌదర్ పల్లి రైతులకు సంబంధించిన 55.02 ఎకరాల భూమిని కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు కలిసి ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ కు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపిస్తూ.. మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధిత రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ […]
సామాజికసారథి, వెల్దండ: మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేస్తున్న సీసీ కెమెరాల ఏర్పాటుకు టీఆర్ఎస్ వెల్దండ మండలాధ్యక్షుడు, సర్పంచ్ యెన్నం భూపతిరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణతో మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో సీఐ రామకృష్ణ, ఎస్సై నర్సింహులుకు రూ.లక్ష నగదు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనుకోకుండా ఏదైనా సంఘటన జరిగితే సీసీ కెమెరాలతో గుర్తించవచ్చని, ఒక్క సీసీకెమెరా వంద మంది పోలీసులతో సమానమని సీఐ రామకృష్ణ పేర్కొన్నారు. అనంతరం విరాళం అందజేసిన వారిని […]
సామాజికసారథి, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో అభయ ఆంజనేయుడి ఆలయం నిర్మాణానికి తనవంతుగా గురువారం గ్రామ సేవకుడు తవిటి నిరంజన్ తన ఒకనెల వేతనం రూ.10,116 విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని సర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వర్ రావుకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నీరటి రాములు, గ్రామస్తులు భూపతిరావు, కావటి రామచంద్రం, దశరథం, సత్యనారాయణ, వెంకట్ నారాయణ, రామచంద్రయ్య, హనుమంతు, జంగయ్య, అశోక్ యాదవ్, కర్ణాకర్రావు, సైదులు తదితరులు పాల్గొన్నారు.
సామాజిక సారథి, వెల్దండ: పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించకుండా రాష్ర్ట ప్రభుత్వం అనుసరిస్తున్న మొండివైఖరిగా నిరసనగా శుక్రవారం బీజేపీ దళితమోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్విగ్రహం ఎదుట హెచ్పీ పెట్రోల్బంక్వద్ద దళితమోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కుర్మిద్ద యాదగిరి, మండలాధ్యక్షుడు కొమ్ము వెంకటయ్య, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ధ్యాప వెంకట్ రెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు యెన్నం విజేందర్ రెడ్డి, జూలూరి బాలస్వామి, జిల్లెళ్ల జంగయ్య, సింగిల్ విండో డైరెక్టర్ […]
సామాజిక సారథి, వెల్దండ: మండలంలోని ఆయా గ్రామాల్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు తెలిపారు. శుక్రవారం సింగిల్విండో కార్యాలయంలో కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు. మండలంలో ఐదువేల ఎకరాల్లో వరి సాగు చేశారని, సుమారు ఒక లక్ష 30 వేల బస్తాలు వరి ధాన్యం రావొచ్చని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. మండలంలో వెల్దండతో పాటు కొట్ర, రాచూరు, కుప్పగండ్ల, బొల్లంపల్లి, […]
సామాజిక సారథి, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని బైరాపూర్ గ్రామ సర్పంచ్ దార్ల కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు విలువైన ఆట వస్తువులు, ఇతర పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
సామాజిక సారథి, వెల్దండ: పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ వ్యక్తిపై నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ ఎస్సై ఎం.నర్సింహులు చేయి చేసుకున్నారనే ప్రచారం సరికాదని అఖిలపక్ష నేతలు మూకుమ్మడిగా పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడి పట్ల కొంచెం గట్టిగా మాట్లాడారని తెలిపారు. ఎస్సై నర్సింహులు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సామాజిక వర్గాల ప్రజల పట్ల సౌమ్యంగా ఉంటారని తెలిపారు. సమస్య ఎలాంటిదైనా, ఎవరు స్టేషన్కు వెళ్లినా చాలా సావధానంగా వింటూ పరిష్కరిస్తారని చెప్పారు. ఆయనపై బురద చల్లే ప్రయత్నంలో కొందరు […]
బైక్ ను అతివేగంతో ఢీకొట్టిన కారు అడ్డొచ్చినవారిపైకి దూసుకెళ్లిన డ్రైవర్ ఒకరి దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం చెట్లమాటున కారును వదిలేసి పరారీ సారథి, వెల్దండ: కారు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. మరో ఇద్దరిని చావు అంచులదాకా తీసుకెళ్లింది.. హైవేపై జెట్స్పీడ్తో వస్తున్న కారు మొదట బైక్ను ఢీకొట్టడంతో దానిపై ఉన్న ఇద్దరు గాల్లోకి ఎగిరిపడ్డారు.. ఓ వ్యక్తి కారును ఆపేందుకు ప్రయత్నించగా అతని కూడా ఢీకొట్టడంతో ఎగిరి అవతలపడ్డాడు.. ఎక్కడ […]