Breaking News

TELNGANA

రెబల్​ ఎంపీకి సీబీఐ షాక్​

వైసీపీ రెబల్​ ఎంపీ, నిత్యం ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్​పై విరుచుకుపడే రఘురామకృష్ణంరాజుకు తొలిసారి షాక్​ తగిలింది. ఆయన ఇండ్లు, కంపెనీలు, ఆఫీసుల్లో గురువారం సీబీఐ సోదాలు నిర్వహించి కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు… రఘురామకృష్ణంరాజుకు చెందిన ఇందు, భారత్ కంపెనీ తో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ ల ఇళ్లలో సోదాలు చేసింది. ఉదయం ఆరు గంటలనుండి సోదాలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం […]

Read More

కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు

సారథి న్యూస్, రామగుండం: సింగరేణి కార్మికుల శ్రమను యాజమాన్యాలు దోచుకుంటున్నాయని కార్మికసంఘాల నాయకులు ఆరోపించారు. శనివారం జీడీకే 1, 2, 2 ఏ, 11 గని తదితర విభాగాల్లో సీఐటీయూతో పాటు వివిధ కార్మికసంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం కార్మికులను ఉత్పత్తి సాధనాలుగా వాడుకుంటున్నదని ఆరోపించారు. కార్మికుల బాగోగులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిరసన కార్యక్రమంలో కార్మికసంఘం నేతలు మల్లికార్జున్, పార్లపల్లి […]

Read More

జూరాలకు భారీ వరద

సారథి న్యూస్​, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. శుక్రవారం1,46000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైందని అధికారులు తెలిపారు. అయితే 1,68743 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్​ పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.629 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇన్​ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. అలాగే నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని […]

Read More

చెన్నైలో బాలు అంత్యక్రియలు

ఎస్పీ బాలు భౌతికకాయాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన నివాసం నుంచి తామరైపాక్కంలోని వ్యవసాయక్షేత్రానికి తీసుకెళ్లారు. శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్​ తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనుంది. అయితే బాలూను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, సినీప్రియులు, తమిళనాడులో ఉంటున్న తెలుగుప్రజలు భారీగా తరలివచ్చారు. ఓ దశలో ఆయన ఇంటికి వెళ్లే దారుల్లో తీవ్రమైన ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. అయితే అభిమానుల […]

Read More

ఉబికివచ్చిన పాతాళగంగ!

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలకేంద్ర శివారులోని మల్కా చెరువు కొన్నేండ్ల తర్వాత పూర్తి స్థాయిలో నిండి అలుగెళ్లింది. దీంతో చెరువు కింద గల బోరుబావుల్లో భూగర్భజలాలు పెరిగి ఇలా కేసింగ్ ల నుంచి నీళ్లు పైకి అస్తున్నాయ్. ఈ దృశ్యాన్ని చూసేందుకు పలువురు గ్రామస్థులు అక్కడికి వచ్చారు.

Read More

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీవరద

సారథిన్యూస్​, మహబూబ్​నగర్​: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం 2,10,420 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 2,52,459 క్యూసెక్కులను దిగవకు వదలుతున్నారు. ప్రాజెక్ట్​ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.20 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు కాగా ప్రాజెక్టులో 210.9946 టీఎంసీలుగా నీరు ఉన్నది. మరోవైపు కుడిగట్టు […]

Read More

కరోనాతో హాస్యనటుడు మృతి

తెలుగులో పలుచిత్రాల్లో హాస్యం పండించిన నటుడు కోసూరి వేణుగోపాల్​ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కోసురు వేణుగోపాల్​.. మర్యాద రామన్న, విక్రమార్కుడు, భలేభలే మగాడివోయి వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఆయనకు కరోనా సోకడంతో గచ్చిబౌలిలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించి బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్‌ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగం చేస్తున్నప్పుడే సినిమాల్లో నటించేవారు. వేణుగోపాల్​ […]

Read More

లంబాడీల ఐక్యవేదిక కమిటీ ఎన్నిక

సారథి న్యూస్, రామాయంపేట: లంబాడీల ఐక్య వేదిక మెదక్ నియోజకవర్గ ఇంచార్జిగా నిజాంపేట మండలం జెడ్ చెరువు తండాకు చెందిన రమావత్ భాస్కర్ ఎన్నికయ్యారు. లంబాడాల హక్కుల కోసం పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. అదినాయకత్వం అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని ఆయన చెప్పారు.

Read More