Breaking News

TELANGANA

తగ్గని మాయదారి రోగం

తగ్గని మాయదారి రోగం

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా తగ్గడం లేదు. రాష్ట్రంలో మంగళవారం 1,879 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏడుగురు మృతిచెందారు. మొత్తం మృతుల సంఖ్య 313కు చేరింది. మొత్తంగా రాష్ట్రంలో 27,612 పాజిటివ్​ కేసులు నిర్ధారణ అయ్యాయి.1,28,438 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే జీహెచ్​ఎంసీ పరిధిలో 1,422, రంగారెడ్డి జిల్లాలో 176 కేసులు, మేడ్చల్​ జిల్లాలో 94, కరీంనగర్​లో 32, నల్లగొండ 31, నిజామాబాద్​లో 19 చొప్పున పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. […]

Read More

జీవో 3 కోసం సుప్రీంలో పిటిషన్​

సారథి న్యూస్​, మహబూబాబాద్: గిరిజనులకు అన్ని విధాల న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ పేర్కొన్నారు. జీవో3 అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూపిటిషన్​ దాఖలు చేసిందని చెప్పారు. జీవో3 అమలైతే 100 శాతం గిరిజనులకు రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. ఏజన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయపోస్టులను వందశాతం స్థానిక గిరిజనులతోనే భర్తీ చేయాలని 2000లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో3ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేయడం […]

Read More

సచివాలయం కూల్చివేత ప్రారంభం

సారథిన్యూస్​, హైదరాబాద్​: హైకోర్టు గ్రీన్​సిగ్నల్​ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర సచివాలయ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామునుంచే భారీ బందోబస్తు నడుమ కూల్చివేతను ప్రారంభించారు. అదే స్థానంలో కొత్తసచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూల్చివేతకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సచివాలయానికి ఉన్న అన్నివైపులా ద్వారాలను మూసివేశారు. సాధ్యమైనంత తొందరగా కూల్చివేత ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read More
ఒకేరోజు 1,831 కేసులు

ఒకేరోజు 1,831 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా(కోవిడ్​19) కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. సోమవారం రాష్ట్రంలో కొత్తగా 1,831 పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కేసులు 25,733కు చేరాయి. మహమ్మారి బారినపడి తాజాగా 11 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 1,22,218 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు 306 మంది మృత్యువాతపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,419 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో 160, మేడ్చల్​ జిల్లాలో 117 కేసులు, మెదక్​లో 20, మంచిర్యాల జిల్లాలో 20, ఖమ్మం […]

Read More

పేదల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం

సారథిన్యూస్​, బిజినేపల్లి/రామడుగు: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అధిక విద్యుత్​చార్జీలు వసూలుచేస్తూ పేదల నడ్డి విరుస్తున్నదని కాంగ్రెస్​పార్టీ నేతలు ఆరోపించారు. కరెంటు బిల్లులపెంపునకు వ్యతిరేకంగా సోమవారం రాష్ట్రంలోని పలుచోట్ల కాంగ్రెస్​ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నాగర్​కర్నూల్​​ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని సబ్​స్టేషన్​ వద్ద కాంగ్రెస్​ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని గుండి సబ్​స్టేషన్​ ఆవరణలోనూ కాంగ్రెస్​ నేతలు నిరసన చేపట్టారు. ధనికరాష్ట్రమంటు గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్​.. ఇప్పుడు విద్యుత్​ చార్జీలు […]

Read More
మద్యం ఆదాయమే మస్త్​

మద్యం ఆదాయమే మస్త్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా దెబ్బకు ప్రపంచమే తలకిందులైంది. ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగామని భావిస్తున్న దేశాలు కూడా వైరస్‌ కాటుకు కకావికలమయ్యాయి. అందులో తెలంగాణ ప్రభుత్వం కూడా ఒకటి. లాక్‌డౌన్‌ కాలంలో పరిశ్రమలు, దుకాణాలతో పాటు అన్నిరంగాలు మూసివేశారు. దీంతో వ్యాపారం జరగలేదు. రాష్ట్రానికి రావాల్సిన పన్నులు కూడా రావడం లేదు. ఉన్న డబ్బంతా ఊడ్చుకుపోయింది. దీంతో ప్రభుత్వం ఉద్యోగుల జీతాల్లో కూడా కోత విధించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఇప్పుడు లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత […]

Read More
తెలంగాణలో 1,590 కేసులు

తెలంగాణలో 1,590 కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా మహమ్మారి ఏమాత్రం తగ్గడం లేదు. ఆదివారం రాష్ట్రంలో 1,590 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,902కు చేరింది. ఇప్పటి వరకు 1,15,835 మందిని పరీక్షించారు. తాజాగా ఏడుగురు మృతిచెందారు. ఇప్పటి వరకు 295 మంది చనిపోయారు. జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 1277, మేడ్చల్​ జిల్లాలో 125, రంగారెడ్డి జిల్లాలో 82, సంగారెడ్డి జిల్లాలో 19, మహబూబ్​ నగర్​ జిల్లాలో 19, సూర్యాపేట జిల్లాలో 23, నల్లగొండ […]

Read More
మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే రవిశంకర్​

హరితతెలంగాణే లక్ష్యం

సారథి న్యూస్, గంగాధర: తెలంగాణ వ్యాప్తంగా పల్లెలన్నీ చెట్లతో కళకళలాడాలన్నదే సీఎం కేసీఆర్​ లక్ష్యమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్​లో ఆదివారం ఎక్సైజ్​శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే తాటి, ఈత, ఖర్జూర మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read More