Breaking News

TELANGANA

క్షమించు తల్లీ..!

కోరికల కోరలు చాచిన తాచుల చుట్టూనా గారాల పట్టి చప్పుడు ఆగిపోయేనా ! కత్తుల పదును వాంఛలున్న ఉన్మాదుల మధ్యకుత్తుక ఆగి కొట్టుమిట్టాడేనా ! బలంతో విర్రవీగే బకాసురాల నడుమబలహీనమై నీ వెన్నుపూస విరిగేనా ! కామంతో మసిలిన ఆ కాల యముళ్లునీ కలలను కడతేర్చారా తల్లి ! నరరూప “మాన భక్షకులు”నీ నాలుక తెగ్గోసారా చెల్లి !! ఏ రాముడు దుష్ట సంహారం చేయలేదు,క్షమించు..చీకటి సాక్షిగా నిప్పులో తోసేసాము !! బచావో అన్న నీ కన్నవాళ్ళ […]

Read More
మహాత్ముడికి ఘనంగా నివాళి

మహాత్ముడికి ఘనంగా నివాళి

సారథి న్యూస్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి వేడుకలు ఘనంగా శుక్రవారం జరిగాయి. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం సైతం వేడుకలను ఘనంగా నిర్వహించింది. లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద మహాత్ముడి విగ్రహానికి గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్​పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, […]

Read More

బిగ్​బాస్​లోకి దేవీ రీఎంట్రీ!

గత వారం అనూహ్యంగా బిగ్​బాస్​హౌస్​ నుంచి ఎలిమినేట్​ అయిన దేవీ వైల్డ్​కార్డ్​ ఎంట్రీ ద్వారా హౌస్​లోకి అడుగుపెట్టనున్నట్టు సమాచారం. మెహబూబ్​కు తక్కువ ఓట్లు ఉంటే దేవీని ఎలిమినేషన్​ చేశారని మొదటినుంచి ఓ ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది. మరోవైపు పవన్​కల్యాణ్​ అభిమానులు, టీవీ9ను వ్యతిరేకించారు దేవీకి నెగెటివ్​గా ప్రచారం చేయడంతో ఆమెకు తక్కువ ఓట్లు పడ్డాయని ప్రచారం జరిగింది. అయితే దేవీ హౌస్​నుంచి బయటకు వచ్చాక ఆమెకు సోషల్​మీడియా మద్దతు లభించింది. దేవీ లాంటి స్ట్రాంగ్​ కంటెంస్టెంట్​ను కుట్రపూరితంగా […]

Read More

రైతు వ్యతిరేక ప్రభుత్వాలను గద్దెదింపుదాం

సారథిన్యూస్, రామగుండం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తీరని అన్యాయం చేస్తున్నాయని రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఠాగూర్ మక్కన్ సింగ్ పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చని రైలు బిల్లులపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. గురువారం స్థానిక దుర్గ నగర్ లో మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ, కార్పొరేటర్లు, అధ్యక్షులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశం లో కార్పొరేటర్లు, నాయకులు మంగళ స్వామి, పెద్దెల్లి ప్రకాష్, ఏం డి,ముస్తఫా, గాదం విజయ, నందు, గట్ల రమేష్, యుగంధర్, నజాముద్దీన్, బెంద్రం, […]

Read More

పరిశుభ్రతతో రోగాలు దూరం

సారథి న్యూస్​, నిజాంపేట: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని మెదక్​ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం ఆయన నిజాంపేటలో సర్పంచులు, ఎంపీటీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తే వ్యాధులను నివారించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఆయాగ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read More

సంస్థాగతంగా బలపడదాం

సారథి న్యూస్​, రామగుండం: టీఆర్​ఎస్​ పార్టీని రామగుండం నియోజకవర్గంలో మరింత బలోపేతం చేద్దామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పిలుపునిచ్చారు. గురువారం ఆయన రామగుండం నియోజవర్గం టీఆర్​ఎస్​ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను గడపగడపకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, సమన్వయ కమిటీ సభ్యులు, పట్టణ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More

దున్నపోతుల బలి నేరం

సారథి న్యూస్, రామాయంపేట: గ్రామాల్లో జరిగే ఉత్సవాల్లో దున్నపోతులను అమ్మవారికి బలివ్వడం చట్టరిత్యా నేరమని నిజాంపేట వెటర్నరీ అధికారి సుధాకర్ దేశ్ ముఖ్ హెచ్చరించారు. గురువారం ఆయన మెదక్​ జిల్లా మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో కరోనా విస్తరిస్తున్నదని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చల్మెడ గ్రామంలో కరోనా మహమ్మారిని పోవాలంటే అమ్మవారికి దున్నపోతులు బలివ్వాలని గ్రామస్థులు నిర్ణయించారు. ఇందుకోసం ఒక్కో ఇంటికి రూ. 1000 వసులూ […]

Read More
రైతుల కోసం దేవుడితోనైనా కొట్లాడత

రైతుల కోసం దేవుడితోనైనా కొట్లాడత

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయం, రైతులను కాపాడుకునే విషయంలో.. దేవుడితోనైనా కొట్లాటకు సిద్ధమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీజలాల అంశంపై అక్టోబర్ 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. అనుసరించాల్సిన వ్యూహాన్ని గురువారం ప్రగతిభవన్ లో జలవనరులశాఖ ఉన్నతాధికారుల ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం ఖరారు చేశారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని, స్వరాష్ట్రంలో వ్యవసాయరంగంలో పండుగ […]

Read More