సామాజిక సారథి, తలకొండపల్లి: ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసినట్లు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం తుమ్మలకుంట తండాలో మూడవత్ గోపినాయక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడన్నారు. బాధిత కుటుంబానికి ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 5వేల నగదును అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు నూనె రాఘవేందర్, లక్ష్మణ్, భరత్ […]
సామాజిక సారథి, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఘనంగా దీపావళి వేడుకలు చౌదర్ పల్లి పాటు అన్ని గ్రామాలలో సోమవారం దీపాలు వేడుకలను ప్రజలు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ తమ ఇండ్లలో షాపులలో లక్ష్మిపూజ చేసి, తమ ఇండ్లను దీపాలతో అలంకరించారు. సర్పంచ్ ధ్యాసమోని చంద్రయ్య కుటుంబ సభ్యులతో టపాకాయలు కాల్చారు. ఆ లక్ష్మిదేవి కృపాకటాక్షాలతో చౌదర్ పల్లి ప్రజలందరూ సుఖ […]
సారథి న్యూస్, తలకొండపల్లి: ప్రజాసమస్యల పరిష్కారానికి అనునిత్యం సేవలందించిన దివంగత సీనియర్ జర్నలిస్టు మీసాల యాదయ్య కుటుంబాన్ని ఆదుకుంటానని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయనను హైదరాబాద్‌లోని తన నివాసంలో యాదయ్య కుటుంబసభ్యులు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. సీనియర్ జర్నలిస్టు మీసాల యాదయ్య మృతి తనను కలచివేసిందన్నారు. ఆయన మృతి తీరని లోటని అన్నారు. ఎలాంటి సహాయం అవసరమైనా తనను కలవాలని సూచించారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో కుటుంబసభ్యులు, […]
విజయం ఎప్పుడూ వెంటనే వరించదు. తన కోసం తపించే వారి మనసును పరీక్షిస్తుంది. అడ్డంకులను సృష్టించి, కష్టాలను కలిగిస్తుంది. అవకాశాలను చేజారుస్తుంది. వాటన్నింటినీ తట్టుకుని, కష్టాల కన్నీటిని అదిమిపట్టి, ఎంత కష్టమొచ్చినా ఎదిరించి నిలిచిన వారికే అది వరమవుతుంది. 14 ఏళ్ల వయస్సులో బడిలో ఉండాల్సిన అమ్మాయి పెళ్లి పీటల మీద కూర్చుంది. 23 ఏళ్లకే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఏదైనా ఉద్యోగం చేయాలనే తండ్రి కలను నెరవేర్చింది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంచెలంచెలుగా […]
సారథిన్యూస్, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో మంగళవారం ఎమ్మార్పీఎస్ 26 వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్ జెండా ఎగురవేసి కేక్ కట్‌చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళితుల హక్కులను కాపాడేందుకు ఎమ్మార్పీఎస్ ఎన్నో పోరాటాలు చేసిందని చెప్పారు. కార్యక్రమంలో తలకొండపల్లి సర్పంచ్ లలిత జ్యోతియ్య మాదిగ, దళితసంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు దరువుల శంకర్, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కృష్ణ మాదిగ, మండల […]
సారథి న్యూస్, రంగారెడ్డి: గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన సంఘటన తలకొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం పరిధిలోని వెల్జాల్ గ్రామంలోని గోవిందరాజుల గుట్ట దేవాలయంలో మాడుగుల మండలానికి చెందిన ముగ్గురు యువకులు గుప్త నిధుల కోసం తవ్వకాలు ప్రయత్నించారు. పక్క సమాచారం మేరకు గ్రామస్తులు, వారిని ట్టుకొని దేహశుద్ధి చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. ఇందులో ఒకరు సస్పెండ్ అయిన కానిస్టేబుల్ ఉన్నాడు. ఆలయ […]