Breaking News

SINGHARENI

కలిసికట్టుగా పనిచేద్దాం

సారథి న్యూస్, రామగుండం: సింగరేణి ఉద్యోగులంతా కలిసి కట్టుగా పనిచేయాలని ఆ సంస్థ డైరెక్టర్​ (ఆపరేషన్స్​) ఎస్​ చంద్రశేఖర్​ సూచించారు. మంగళవారం ఆయన పెద్దపల్లి జిల్లా మేడిపల్లి ఓపెన్​కాస్ట్​ను సందర్శించి అక్కడ జరుగుతున్న ఓవర్​ బర్డెన్​ పనులను పరిశీలించారు. వానకాలంలో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులకు, కార్మికులకు పలు సూచనలు చేశారు. ఓవర్​ బర్డెన్​ తరలింపు పనులను వేగవంతంగా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అర్జీ-1 ఏరియా మేనేజర్ గోవిందారావు, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి , […]

Read More

సింగరేణిని కాపాడుకుందాం

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణి సంస్థను ప్రైవేట్​పరం కాకుండా కాపాడుకుందామని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దపల్లి జిల్లాలోని ఆర్​జీవన్​ ఏరియాలో సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు ప్లకార్డ్స్​ ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కార్మికహక్కులను కాపాడుకొనేందుకు ప్రతి కార్మికుడు ఉద్యమించాలని కోరారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని బొగ్గుపరిశ్రమలను ప్రైవేట్​పరం చేసేందుకు కేంద్రప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో కార్మికసంఘం నాయకులు మెండె శ్రీనివాస్, నంది నారాయణ, బీ రవి, మెండయ్య, ఓదెలు, […]

Read More
సింగరేణి జీఎంపై చర్యలు

రామగుండం జీఎంపై చర్యలు తీసుకోవాలి

సారథి న్యూస్​, రామగుండం: ఏఐటీయూసీ నాయకుడు గట్టయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సింగరేణి రామగుండం జీఎంపై చర్యలు తీసుకోవాలని కార్మికసంఘాల నాయకులు మిట్టపల్లి వెంకటస్వామి తదితరులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కొందరు అధికారుల తీరుతో కార్మికులతో యాజమాన్యానికి సత్సంబంధాలు లేకుండా పోతాయని.. అంతిమంగా సింగరేణి యాజమాన్యానికి ఎంతో నష్టం చేకూరుతుందని చెప్పారు. కార్మికులతో స్నేహపూర్వకమైన వాతావరణంలో చర్చలు జరపాలని వారు పేర్కొన్నారు.

Read More

సింగరేణిలో క్వార్టర్ల నిర్మాణం

సారథిన్యూస్​, హైదరాబాద్​: సీఎం కేసీఆర్​ హామీమేరకు సింగరేణికి చెందిన కార్మికులకు రూ.210 కోట్లు వెచ్చించి నూతన క్వార్టర్లు నిర్మించి ఇస్తామని సంస్థ సీఎండీ శ్రీధర్​ తెలిపారు. సోమవారం హైదరాబాద్​లోని సింగరేణి భవన్​ బోర్డు డైరెక్టర్లు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. సింగరేణి విద్యాసంస్థలకు రూ. 45 కోట్లు కేటాయించేందుకు, సింగరేణిలో ప్రత్యేకపర్యావరణశాఖ ఏర్పాటు చేసేందుకు బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. సమావేశంలో బోర్డు సభ్యులు వెస్ట్రన్‌ కోల్‌ ఫీల్డ్స్‌ సీఎండీ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా, కేంద్ర బొగ్గు […]

Read More

23 నుంచి వనమహోత్సవ్​

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణి పరిధిలోని అన్ని కార్యాలయాల్లో, స్థలాల్లో ఈ నెల 23 నుంచి వనమహోత్సవ్​ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సంస్థ సీఎండీ శ్రీధర్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెత్తం 35 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. బుధవారం కేంద్ర బొగ్గుశాఖ ప్రత్యేకకార్యదర్శి అనిల్​ కుమార్​ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్​ పాల్గొని మాట్లాడారు. బొగ్గు పరిశ్రమలన్నీ ఈ ఏడాది ‘వనమహోత్సవ్​’ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కేంద్ర […]

Read More

కాంట్రాక్ట్​ కార్మికులను ఆదుకోండి

సారథిన్యూస్​, కొత్తగూడెం: సింగరేణిలో ఎక్స్ ప్లోరేషన్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికులు, ప్రైవేట్​ సెక్యూరిటీ గార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్​ చేశారు. సోమవారం కొత్తగూడెంలో కాంట్రాక్ట్​ కార్మికులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలోనే ప్రత్యామ్నాయ పనులలో వీరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పీ ప్రమోద్, ఎన్ సూర్య, భద్రం, నిజాముద్దీన్, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సంపత్, సమ్మయ్య, […]

Read More