Breaking News

RYTHUVEDIKA

చివరి గింజ దాకా కొంటాం

చివరి గింజ దాకా కొంటాం

సారథి న్యూస్, రామాయంపేట: రైతుల నుంచి చివరి గింజ దాకా కొనుగోలు చేస్తామని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్(డీఏవో) పరుశురాం నాయక్ అన్నారు. అన్నదాతలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయన మెదక్​జిల్లా నిజాంపేట మండలకేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక సబ్ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం మొత్తం ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు గురించి ఆరాతీయాలని […]

Read More
రైతువేదికలు, ప్రకృతివనాలు పూర్తికావాలె

రైతువేదికలు, ప్రకృతివనాలు పూర్తికావాలె

సారథి న్యూస్, మెదక్: జిల్లావ్యాప్తంగా రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాల పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా వాటిని అందుబాటులోకి తీసుకురావాలని మెదక్ జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు సూచించారు. మంగళవారం జిల్లాలోని ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ డీఈలు, ఏఈలు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయధికారులు, విస్తరణాధికారులతో కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతువేదికలు, పల్లె ప్రకృతి వనాల పనులు చాలా […]

Read More
రైతు వేదికలు త్వరలోనే అందుబాటులోకి..

రైతు వేదికలు త్వరలోనే అందుబాటులోకి..

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: నాగర్ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను జిల్లా అడిషనల్​కలెక్టర్ మనుచౌదరి మంగళవారం ఆకస్మికంగా సందర్శించి పనులను పరిశీలించారు. రైతువేదికలను త్వరలో రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులను వేగంగా, నాణ్యవంతంగా పూర్తిచేయాలని సూచించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు వేదికలను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆయన వెంట బిజినేపల్లి ఎంపీడీవో హరినాథ్ గౌడ్, మంగనూర్ ఉపసర్పంచ్ చిన్నగాళ్ల […]

Read More
రైతు వేదికకు రూ.12లక్షల విరాళం

రైతు వేదికకు రూ.12లక్షల విరాళం

సారథి న్యూస్, రామాయంపేట: నిజాంపేట క్లస్టర్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతువేదిక నిర్మాణం కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త, సంఘ సేవకులు అందె ప్రతాప్ రెడ్డి రూ.12లక్షల చెక్కును డీడీఏవో పరుశురాం నాయక్ కు అందజేశారు. మండల రైతుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, తహసీల్దార్ జయరాం, ఏవో సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

Read More
చకచకా రైతు వేదిక పనులు

చకచకా రైతు వేదిక పనులు

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో రైతు వేదిక నిర్మాణాలు చకచకా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు వేదికలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ తమన్నా గారి కృష్ణవేణి అన్నారు. రైతువేదికలను కల్వకుంటలో పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రైతులు తమ పంటలను గిట్టుబాటు ధర నిర్ణయించే అధికారం రైతులకు ఉండాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More
దసరా నాటికి రైతు వేదికలు కంప్లీట్​ కావాలె

దసరా నాటికి రైతు వేదికలు కంప్లీట్​ కావాలె

సారథి న్యూస్​, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలంలోని 9 క్లస్టర్ గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణ పనులు దసరా పండుగ నాటికి పూర్తిచేయాలని ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ సంబంధిత కాంట్రాక్టర్లకు ఆదేశించారు. మండల కేంద్రంలోని నిర్మాణంలో ఉన్న రైతువేదికను శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీచేసి మాట్లాడారు. రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలను త్వరితగతిన పూర్తిచేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అలాగే నిర్మాణం విషయంలో ప్రభుత్వం పేర్కొన్న కంపెనీ మెటీరియల్ ను […]

Read More
రైతు వేదికలు ముస్తాబు

రైతు వేదికలు ముస్తాబు

దసరా రోజున భవనాల ప్రారంభోత్సవం జోగుళాంబ గద్వాల జిల్లాలో నిర్మాణాలు పూర్తి సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): వ్యవసాయమే పరమావధిగా భావించే రాష్ట్ర రైతాంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మరింత చేయూతనందిస్తోంది. రైతుల ఆలోచనలు, అధికారుల సూచనలను పంచుకునేందుకు వీలుగా సీఎం కేసీఆర్​రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కనీసం రెండువేల మంది రైతులు ఒకేసారి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవగాహన సదస్సుకు హాజరయ్యేలా అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని 12 మండలాల్లో సుమారు 97భవనాల నిర్మాణాలు […]

Read More
కల్లాల నిర్మాణం కంప్లీట్ కావాలి

కల్లాల నిర్మాణం కంప్లీట్ కావాలి

సారథి న్యూస్, మెదక్: జిల్లాలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను తప్పకుండా ఏర్పాటు చేయాలని, ప్రత్యేకాధికారులు సమన్వయంతో పనిచేయాలని మెదక్ జిల్లా ఇన్​చార్జ్​కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం మెదక్ కలెక్టరేట్ లో జిల్లాలోని ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆయా శాఖల అధికారులతో డంపింగ్ యార్డులు, పల్లెప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలు, వైకుంఠధామాల నిర్మాణాలు, రైతుకల్లాల విషయాలపై చర్చించారు. గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద […]

Read More