సారథిన్యూస్, రామడుగు: కరోనా మహమ్మారి మారుమూల పట్టణాలకు పాకింది. తాజాగా కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య అధికారులు వెల్లడించారు. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నది. బుధవారం నుంచి 4రోజుల పాటు పట్టణంలో సంపూర్ణ లాక్డౌన్ పాటించాలని గ్రామపంచాయతీ పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే కిరాణా దుకాణాలు తెరుస్తామని ఆ సమయంలోనే సరుకులు కొనుగోలు చేయాలని పంచాయతీ పేర్కొన్నది. నిబంధనలు అతిక్రమించినవారికి […]
సారథి న్యూస్, రామడుగు: ప్రస్తుతపరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ఎమర్జెన్సీని ప్రకటించాలని కరీంనగర్ జిల్లా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు. సోమవారం కరీంనగర్ జిల్లా రామడుగు అంబేద్కర్ చౌరస్తాలో సీపీఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో ఉమ్మెంతుల రవీందర్ రెడ్డి, మచ్చ రమేశ్, ఏగుర్ల మల్లేశ్, వేముల మల్లేశం, పారునంది మొండయ్య,ఉమ్మెంతుల రాజిరెడ్డి,రఫిక్ తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల గోపాల్రావుపేటలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో మార్కెట్ ఆవరణలో 500 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.. మొక్కలను నాటడం గొప్పకాదు వాటిని పరిరక్షించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్ల వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, రామడుగు: సీఎం కేసీఆర్ అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంర్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పని చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, జెడ్పీటీసీ మారుకొండ లక్ష్మీ, మాజీ ఎంపీపీ మారుకొండ కృష్ణారెడ్డి, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు […]
సారథిన్యూస్, రామడుగు: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని యువజన సంఘం సభ్యులు చెప్పారు. ఆదివారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొక్కెరకుంట శివారులో రైజింగ్ సన్ యువజనసంఘం సభ్యులు స్వచ్ఛ భారత్ నిర్వహించారు. గ్రామంలో పేరుకుపోయిన చెత్తా, చెదారం తొలిగించారు. కార్యక్రమంలో రైజింగ్ సన్ యూత్ క్లబ్ అధ్యక్షులు గజ్జెల అశోక్, ప్రధాన కార్యదర్శి జేరిపోతుల మహేశ్, గజ్జెల నవీన్, ప్రశాంత్, రాజు కుమార్ పాల్గొన్నారు.
సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగులో రామాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని బీజేపీ నాయకులు శనివారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని నర్సింగరావు చెరువు లో గుండు పై రాముని పాదుకలు ఉండటం వల్ల రామడుగు అనే పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి ఒక ఎకరం శిఖం భూమి కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో పురేళ్ల శ్రీకాంత్, అనుపురం పరుశరాం, శివ, భరత్, నరేశ్, సురేశ్ […]
సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెదిర గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రామడుగు మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెదిర గ్రామంలో మంగళవారం శానిటైజేషన్ నిర్వహించారు. గ్రామంలోని విధులను శుభ్రపరిచారు. ప్రజలంతా సామాజికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు.
సారథిన్యూస్, రామడుగు: కరోనాను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెన్న రాజమల్లయ్య ఆరోపించారు. సోమవారం ఆయన తననివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 30 వేల కేసులు నమోదైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా పరీక్షలు చేయడం లేదని విమర్శించారు. పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఏఎన్ఎంలు, జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.