సారథిన్యూస్, రామడుగు: మీరు చూస్తున్న ఈ ఫోటో ఎక్కడో మారుమూల గ్రామంలోనిది కాదు.. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ఓ రోడ్డు. రామడుగు వరద కాల్వ నుంచి చిప్పకుర్తి పోయే రోడ్డు పూర్తిగా దెబ్బతిని కంకర తెలి గుంతలు పడి నీరు నిలిచింది. దీంతో వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. కాలి నడకన వెళ్లే వారుసైతం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు అద్వాన్నంగా మారడంతో రోగులు, గర్భిణి లు అవస్థలు పడుతున్నారు. గతంలో వరద కాల్వ నిర్మాణ […]
సారథి న్యూస్, రామడుగు: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయమని కరీంనగర్ యూత్ కాంగ్రెస్ పార్లిమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్ కొనియాడారు. గురువారం రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా రాజీవ్ సద్భావాన దినోత్సవాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని దళిత కాలనీలో నాగిశేఖర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలపడానికి రాజీవ్ గాంధీ కృషి ఎనలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నీలం దేవకిషన్, […]
సారథిన్యూస్, రామడుగు: రామడుగులో అద్భుతమైన శిల్పసంపద ఉన్నదని కరీంనగర్ అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన రామడుగు మండల కేంద్రాన్ని సందర్శించారు. రామడుగుకు చెందిన శిల్పులు దేవతా విగ్రహాలు చేయడంలో నిష్ణాతులని కొనియాడారు. అనంతరం 200 ఏండ్ల క్రితం నిర్మించిన చారిత్రక గడికోట ను సందర్శించారు. కలెక్టర్ వెంట సర్పంచ్ పంజాల ప్రమీల, ఎంపీడీవో మల్హోత్రా, తహసీల్దార్ కోమల్‌రెడ్డి, ఎంపీడీవో సతీశ్‌రావు తదితరులు ఉన్నారు.
సారథి న్యూస్, రామడుగు: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతుంటే.. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని గ్రంథాలయంలో మాత్రం జెండా ఎగురవేయలేదు. కాగా ఈ విషయంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే జెండాపండుగను మరిచిపోయారని వారు విమర్శిస్తున్నారు. విజ్ఞానం పంచి మేధావులను తయారు చేసే గ్రంథాలయంలో జండా ఎగరవేయక పోవటం ఏమిటని గ్రంథపాలకుడి తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సారథి న్యూస్, రామడుగు: కరోనాపై సామాజిక మాధ్యమాల్లో తప్పడు ప్రచారం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా రామడుగు ఎస్సై అనూష హెచ్చరించారు. కరోనా వచ్చిందని రోగుల వివరాలు బయటపెడితే చర్యలు తప్పవన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే గ్రూప్ అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐపీసీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్, ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కరోనా కట్టడిలో మండల ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
సారథి న్యూస్, రామడుగు: గ్రామాల్లో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక్కప్పుడు సంప్రదాయ సాగుకే పరిమితమైన రైతులు.. నేడు ఆధునికత వైపు అడుగులు వేస్తున్నారు. వంగడాల ఎంపిక నుంచి.. కొత్త సాగు పద్ధతుల వరకు కూలీల ఖర్చులు, సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. అందులో భాగంగా కరీంనగర్జిల్లా రామడుగు మండలంలోని చాలా గ్రామాల్లో అన్నదాతలు యంత్రాల సహాయంతో వరినాట్లు వేస్తున్నారు. ఎకరాకు రూ.మూడువేలు ఖర్చవుతోందని, తక్కువ సమయంలో ఎక్కువ పని అవుతోందని, పంట దిగుబడి కూడా బాగా వస్తుందని […]
సారథి న్యూస్, రామడుగు: ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో తొలి నుంచి మలి వరకు అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణకు జైకొట్టిన వారికి పబ్బతి పట్టి ఇమ్మతి ఇచ్చిన ఇమాందార్ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని ఎస్సై అనూష పిలుపునిచ్చారు. స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం జయశంకర్ చిత్రపటానికి పూలమాలల నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ర్టసాధనకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగులో మంగళవారం రామాంజనేయ ఆటో యూనియన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కుమార్, ఉపాధ్యక్షుడిగా చందా అనిల్, ప్రధానకార్యదర్శిగా ఉత్తెం దేవరాజ్, సహాయకార్యదర్శిగా అనంతరెడ్డి, కోశాధికారిగా మామిడి శ్రీను, రైటర్‌గా మల్లేశం, కార్యవర్గ సభ్యులుగా మల్లేశం, రాగం కనకయ్య, ములుగురి రాజు, మామిడి రాజు, ముఖ్య సలహాదారులుగా పంజాల శ్రీను, కర్ణ శ్రీను తదితరులు ఎన్నికయ్యారు.