సారథిన్యూస్, రామడుగు: మోతే రిజర్వాయర్ నిర్మాణంపై అవగాహన లేకే కాంగ్రెస్ నేతలు ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని సింగల్‌విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్రావు విమర్శించారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగులో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ను విమర్శించే స్థాయి మేడిపల్లి సత్యానికి లేదని పేర్కొన్నారు. మోతే రిజర్వాయర్ తూముల గురించి సరైన అవగాహన లేకుండా సత్యం నోటికొచ్చిన ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే సహించేది లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు గంట్లా […]
‘సారథి’ కథనానికి విశేష స్పందన సాయం చేసేందుకు ముందుకొచ్చిన దాతలు సారథి న్యూస్, రామడుగు: మూడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి జీవచ్ఛంలా మారి.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న కరీంనగర్ జిల్లా రామడుగు గ్రామానికి చెందిన చెందిన అంజలి భర్త రాజేశేఖర్‌కు సాయం చేసేందుకు పలువురు ముందుకొచ్చారు. ‘ఆపదలో ఉన్నం ఆదుకోండి’ శీర్షికన గత సోమవారం ‘సారథిమీడియా’లో వచ్చిన వార్తా కథనానికి పలువురు ముందుకొచ్చారు. సింగపూర్ లో ఉన్న రామడుగు వాసులు తోట శ్రీనివాస్, […]
సారథి న్యూస్, రామడుగు: కరోనా మహమ్మారి ఓ సర్పంచ్‌ను బలితీసుకుంది. తమతో కలిసి తిరిగిన వ్యక్తి.. తమ బాగోగులు పట్టించుకున్న నేత ఇక లేడన్న వార్త ఆ ఊర్లో విషాదం నింపింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పందికుంటపల్లి సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కటకం రవీందర్ గురువారం కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా సోకింది. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రవీందర్ ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామంలో ఎన్నో […]
సారథి న్యూస్, చొప్పదండి: మథర్ థెరిస్సా సేవలు మరువలేనివని ప్రముఖ సామాజిక వేత్త, కవి, రచయిత పసూల రవి కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం దేశాయిపేట్ గ్రామంలో బుధవారం మథర్ థెరిస్సా జయంతి పురస్కరించుకుని గ్రామ యువకులు ‘మీకోసం.. మేము’ అనే స్వచ్ఛంద సేవాసమితిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఈ ఫౌండేషన్ స్థాపించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గుంట రవి, ఉప సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, వార్డుసభ్యులు మోర వెంకటరమణ, కొలిపాక […]
సారథిన్యూస్, రామడుగు: రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించి వరి, పత్తి పంటలను ఆశిస్తున్న తెగుళ్లను అరికట్టవచ్చని కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు సూచించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శనగర్లో పత్తి, వరి పంటలను వారు పరిశీలించారు. పత్తిలో రసం పీల్చే పురుగులను గుర్తించారు. దీని నివారణకు గాను ఆసీపీట్2 గ్రా లీటర్ నీటి కి కలిపి పిచికారి చేయాలని సూచించారు. ఎండు తెగులు సోకితే కాపర్ ఆక్సీ క్లోరైడ్ లీటర్ మూడు గ్రాముల చొప్పున పిచికారి […]
సారథిన్యూస్, రామడుగు: రోడ్డు ప్రమాదం అతడి జీవితాన్ని అతలాకుతలం చేసింది. తనను నమ్ముకున్న భార్యా, బిడ్డలను రోడ్డున పడేసింది. పనిచేసుకుంటే గానీ పూటగడవని ఆ కుటుంబానికి ఇప్పడు పెద్దకష్టమే వచ్చి పడింది. దాతలు ముందుకొచ్చి తమను ఆదుకోవాలని ప్రస్తుతం ఆ కుటుంబం దీనంగా వేడకుంటున్నది. కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన రాజశేఖర్ మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటినుంచి అతడు మంచానికే పరిమితమయ్యాడు. అతడికి మెదడులో రక్తం గడ్డకట్టిందని.. ఆపరేషన్ చేసేందుకు రూ. […]
సారథిన్యూస్, రామడుగు: చేపల వేట ప్రస్తుతం కొందరు యువకులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ఇటీవల కురిసిన వర్షాలతో కరీంనగర్ జిల్లా రామడగు మండలంలోని వివిధ గ్రామాల్లోని వాగులు, చెరువులు అలుగు పారుతున్నాయి. లక్ష్మీపూర్ పంపు హౌస్ గ్రావిటీ కెనాల్ గేట్లు ఎత్తటంతో, చేపల వేట జోరుగా కొనసాగుతుంది. ప్రతి రోజు 50 నుండి 100 మంది యువకులు ఇక్కడ చేపలు పడుతున్నారు. తెల్ల చేపలు. అర్జులు, బొచ్చెలు, రవ్వులు, గురిజెలు, జెల్లలు, బొమ్మెలు తదితర చేపలు వారికి […]
సారథి న్యూస్, రామడుగు: వినాయక చవితి అంటే.. డీజేలు, పూజలు, డప్పుచప్పుల్లు, భజనలతో మారుమోగిది. కానీ కరోనా కోరలు చాస్తున్న ప్రస్తుత తరుణంలో పండగ సందడి పూర్తిగా తగ్గిపోయింది. చాలా చోట్ల వీధుల్లో విగ్రహాలను ప్రతిష్ఠించనేలేదు. కొన్ని గ్రామాల్లో ప్రతిష్ఠించినా.. మొక్కుబడిగా పూజలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ప్రతి సారి 15 నుంచి 20 విగ్రహాలను ప్రతిష్టించేవారు. కానీ ఈ సారి మాత్రం నిశ్శబ్ధం అలుముకున్నది. ప్రజలు తమ ఇండ్లల్లోనే విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నారు.