Breaking News

RAMADUGU

ప్రకృతివనం పరిశీలన

ప్రకృతివనం పరిశీలన

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం గోపాల్​రావుపేట గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని సోమవారం గ్రామ పాలకవర్గం పరిశీలించింది. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, వారి కుటుంబ సభ్యుల తో కలసి సోమవారం పకృతి వనాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కర్ర సత్య ప్రసన్న, ఉపసర్పంచ్ ఎడవెల్లి మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీలు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, ఎడవెల్లి కరుణశ్రీ, రామడుగు మండల కో ఆప్షన్ రజబ్ అలీ వార్డు […]

Read More
దళితుల పై దాడులు ఆపాలి

దళితుల పై దాడులు ఆపాలి

సారథి న్యూస్, రామడుగు: దేశంలో రోజు రోజుకు దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ వెన్న రాజమల్లయ్య అన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక తహసీల్దార్ ద్వారా జిల్లా కలెక్టర్​ కు పంపిన వినతిపత్రంలో డిమాండ్ చేశారు. దళితులకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన రుణాలను మంజూరు చేయాలని కోరారు.

Read More

సులభ్​ కాంప్లెక్స్​ కోసం వినతి

సారథిన్యూస్, రామడుగు: రామడుగు మండల కేంద్రంలో సులభ్​ కాంప్లెక్స్​ నిర్మించాలని గ్రామ యువకులు.. కార్యదర్శి జ్యోతికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సులభ్​ కాంప్లెక్స్​ లేకపోవడంతో వివిధ గ్రామాల నుంచి రామడుగు మండల కేంద్రానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో అనుపురం పరుశరాం, పురేళ్ల శ్రీకాంత్, మామిడి అంజి, ఉత్తేమ్, మహేశ్​ తదితరులు ఉన్నారు.

Read More
సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలంలోని గోపాల్​రావుపేట గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కె.చంద్రశేఖర్​రావును ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ​కోరారు. దీంతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే తదితరుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు రజబ్ అలీ, గ్రామశాఖ అధ్యక్షుడు దాసరి బాబు, పూడూరి మల్లేశం, ఎడవెల్లి పాపిరెడ్డి, అంజయ్య, రాజిరెడ్డి, మల్లేశం, కమలాకర్, శ్యాంసుందర్ రెడ్డి, రమేష్, […]

Read More

అంగన్​వాడీ కేంద్రంలో సౌలతుల్లేవ్​

సారథి న్యూస్,రామడుగు: చిన్న పిల్లలకు , గర్భిణులు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందించే అంగన్వాడీ కేంద్రాలు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. తాగునీటి వసతి లేక.. కరెంట్​ కనెక్షన్​ కూడా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రామడుగు మండల కేంద్రంలో మొత్తం 3 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అన్ని సెంటర్లలో వసతులు లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని మౌలికవసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Read More

బాలింతలు, గర్భిణులు జరభద్రం

సారథి న్యూస్, రామడుగు: కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో బాలింతలు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని కరీంనగర్​ జిల్లా గంగాధర ఐసీడీఎస్​ ప్రాజెక్ట్​ అధికారి కస్తూరి సూచించారు. శనివారం ఆమె వెదిర గ్రామ పరిధిలోని కొనరావుపేట అంగన్వాడీ కేంద్రంలో పోషణ అభియాన్​ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలింతలకు, గర్భిణులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ వంచ పద్మ, వైద్య సిబ్బంది శ్రీలత, సరోజన తదితరులు పాల్గొన్నారు.

Read More

బహిరంగ చర్చకు సిద్ధమా?

సారథిన్యూస్, రామడుగు: చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ టీఆర్​ఎస్​ నేతలకు కాంగ్రెస్​ బీసీసెల్​ అధ్యక్షుడు పులి ఆంజనేయులు బహిరంగ సవాల్​ విసిరారు. బుధవారం ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగులో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పనితీరు అధ్వాన్నంగా ఉన్నదని ఆరోపించారు. కాంగ్రెస్​ కమిషన్ల పార్టీ అని టీఆర్​ఎస్​ నేతలు విమర్శించడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. కాంగ్రెస్​ కమిషన్ల పార్టీ అయితే ఆ పార్టీ నేతలను చేర్చుకుంటున్న టీఆర్​ఎస్​ది కూడా కమిషన్ల పార్టియే కదా […]

Read More
బహిరంగ చర్చకు సిద్ధమేనా?

బహిరంగ చర్చకు సిద్ధమేనా?

సారథి న్యూస్, రామడుగు: నియోజకవర్గ అభివృద్ధి, సాగు, తాగునీటి విషయంలో బహిరంగ చర్చకు రావాలని టీఆర్ఎస్ నేతలకు కరీంనగర్​ జిల్లా కాంగ్రెస్ బీసీసెల్​అధ్యక్షుడు పులి ఆంజనేయులు సవాల్ విసిరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిలో చొప్పదండి వెనకబడి ఉందన్నారు. తూముల నిర్మాణం విషయంలో మేడిపల్లి సత్యంపై అసత్య ఆరోపణలు తగవన్నారు. మాల్యాల నుంచి కోదురుపాక వరకు వరద కాల్వకు ఎన్ని తూములు ఉన్నాయి, వాటికి ఎంత కేటాయించారో చెప్పాలని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఐదు కి.మీ. […]

Read More