సారథి న్యూస్, ఖమ్మం: రానున్న ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో భాగంగా పాలేరు నియోజకవర్గ స్థాయి సమావేశం ఆదివారం నాయుడుపేటలోని రామలీల ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ శ్రేణులతో మాట్లాడారు. పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్నిర్ణయించిన అభ్యర్థి ఎవరైనా తమ వంతుగా గెలిపించుకోవాలని పాలేరు ఎమ్మెల్యే కందుల ఉపేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో […]
సారథి న్యూస్, ఖమ్మం: నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హామీ ఇచ్చారు. మున్నేరు కాల్వ ఉధృతంగా ప్రవహించడంతో నిర్వాసితులైన ప్రజలకు ఖమ్మం నయాబజార్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్యాంపు ఏర్పాటుచేశారు. ఆదివారం మంత్రి పువ్వాడ అజయ్ నిర్వాసితులను కలిసుకొని వారితో మాట్లాడారు. నిర్వాసితులతో ధైర్యం చెప్పారు. అనంతరం మంత్రి మున్నేరు ఉధృతిని పరిశీలించారు. మున్నేరు ప్రవహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేలా నోట్ తయారు చేయాలని మున్సిపల్ కమిషన్ అనురాగ్ […]
సారథి న్యూస్, ఖమ్మం: కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారికి సిమ్యులేటర్ ఎంతో ఉపయోగకరమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని రవాణాశాఖ కార్యాలయంలో సోమవారం ఆయన డ్రైవింగ్ సిమ్యులేటర్‌ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కరోనా విపత్తువేళ రవాణాశాఖలో విప్లవాత్మక మార్పులు చేశామని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రైతులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం నగరం ఏడో డివిజన్ అల్లిపురంలో రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే విపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ […]
సారథిన్యూస్, మధిర: కరోనా సంక్షోభంలోనూ తెలంగాణ ప్రభుత్వం రైతుల వెన్నంటే ఉందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయరంగానికే మొదటి ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం గ్రామంలో రూ. 22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.30 లక్షలతో నిర్మించిన వైకుంఠ ధామాంను ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ..కేసీఆర్ గారు ఆలోచించిన విధంగా […]
సారథిన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రూ.2.20 కోట్లతో ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ కాపు సీతామహాలక్ష్మీ తదితరులు ఉన్నారు.