సారథిన్యూస్, కొత్తగూడెం: మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులను, గిరిజనలకు తీరని అన్యాయం చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ విమర్శించారు. జిల్లాలోని చర్ల మండలం బత్తినపల్లి, తిప్పాపురం గ్రామాల మధ్య ప్రభుత్వం రోడ్డును నిర్మిస్తుంటే మావోయిస్టులు రోడ్డు నిర్మాణం కోసం ఉపయోగిస్తున్న యంత్రాలను ధ్వంసం చేశారన్నారు. ఏజేన్సీ ప్రాంతంలో మావోయిస్టులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. మావోయిస్టులు ఇకనైనా ఈ విధ్వంసాన్ని ఆపాలని ఆయన సూచించారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నడిరోడ్డులో ఒక జర్నలిస్ట్‌పై దుండగులు కాల్పులు జరిపారు. కొద్దిరోజుల క్రితం తన మేనకోడలిని వేధించారని సదరు జర్నలిస్టు ఫిర్యాదు చేశాడు. దీంతో కక్ష పెంచుకున్న ఆకతాయిలు కాల్పులు జరిపిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో విక్రమ్ జోషి ఓ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి విక్రమ్ తన కూతురుతో కలిసి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆకస్మికంగా కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధిన దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ […]
ఊరూరా సీసీ కెమెరాల ఏర్పాటు నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు సత్ఫలితాలు ఇస్తున్న పోలీసుల కృషి సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పోలీస్ ఉన్నతాధికారులు సీసీ కెమెరాల ప్రాధాన్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థలో భాగంగా డివిజన్ పరిధిలోని ఆరు మండలాలు, 128 పంచాయతీల్లో మొత్తం 806 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. సిద్దిపేట జిల్లాకు తలమానికమైన కొమురవెల్లి మల్లన్న టెంపుల్ లో […]
లక్నో: మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబే ఇటీవల పోలీసులు ఎన్కౌంటర్లో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే అతడి పోస్ట్‌మార్టం అనంతరం పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వికాస్‌దూబే బుల్లెట్ల గాయాలతో అయిన రక్తస్రావంతోతో చనిపోయాడాని పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. కాన్పూర్‌లో జూలై 10న జరిగిన ఎన్కౌంటర్లో దూబే మృతిచెందాడు. దూబేను కాన్పూర్‌కు తీసుకెళ్తుండగా కారు బోల్తాపడిందని.. ఈక్రమంలో అతడు పారిపోయేందుకు యత్నిస్తుండగా ఎన్కౌంటర్ చేశామని పోలీసులు చెప్పారు. అంతకుముందు తనను అరెస్ట్ చేయడానికి వెళ్లిన ఎనిమిది […]
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో 24 గంటల్లో వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు భద్రతాదళాల చేతుల్లో హతమయ్యారు. షోషియాన్ జిల్లాలో శనివారం ముగ్గురు ఉగ్రవాదులు ఎదురుకాల్పుల్లో మరణించారు. శుక్రవారం కుల్గాం జిల్లాలో ముగ్గరు ఉగ్రవాదలు హతమైన సంగతి తెలిసిందే. వీరిలో జైషేమహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్ కూడా ఉన్నాడు.
ఆమె ఓ సాధారణ లేడీ కానిస్టేబుల్. కానీ ఏకంగా మంత్రి కొడుకుకే చుక్కలు చూపించింది. నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి సుపుత్రుడికి నడి రోడ్డుమీదే వార్నింగ్ ఇచ్చింది. ‘నేను నీకు నీ బాబుకు సర్వేంట్ను కాను’ అంటూ హెచ్చరించింది. ఇటీవల గుజరాత్లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మహిళా కానిస్టేబుల్‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. ఇక ఆ కానిస్టేబుల్ తెగువను మెచ్చుకోని వారంటూ లేరు. అయితే యధావిధిగా పోలీస్‌శాఖ […]
సారథిన్యూస్, ఖమ్మం: మొక్కలు నాటడం మనందరి బాధ్యత అని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో కమిషనర్ క్యాంప్ కార్యలయంలో ఇక్చాల్ కుటుంబసభ్యలు ఆరో విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడమే కాక వాటిని బతికించుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పారు. కార్యక్రమంలో తఫ్సీర్ ఇక్బాల్ తనయుడు తైముర్ ఇక్బాల్ , కమిషనర్ సతీమణి జెబాఖానమ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నల్లగొండ: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పోలీస్ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ నర్మద సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రీడ్ స్వచ్చంద సంస్థ ప్రతినిధి డాక్టర్ అనూష ఆధ్వర్యంలో జిల్లాలోని 2000 మంది పోలీస్‌సిబ్బందికి రోగనిరోధకశక్తిని పెంచే హోమియో మందలను అందించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సీఐ రమేశ్, సత్యం, డీపీవో సూపరింటెండెంట్ దయాకర్, ఆర్ఐ నర్సింహాచారి, డీటీఆర్సీ సీఐ అంజయ్య, కార్తీక్, శంకర్, నవీన్, […]