సారథి న్యూస్, బిజినేపల్లి: చిట్టీల వ్యాపారంతో పలువురిని మోసం చేసిన ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వెంకటేష్ శనివారం తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన మనసాని రమేష్వి విధ గ్రామాల వ్యాపారుల వద్ద చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి గతేడాది ఊరు నుంచి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు అతని […]
సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలో శుక్రవారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మీటింగ్ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కరోనా వ్యాధి నివారణకు ఇక్కడి వైద్యారోగ్య కేంద్రంలో మంచి వైద్యసేవలు అందుతున్నాయని సంతోషం వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో ప్రసవాలు చేయించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. చిన్నపిల్లల వైద్యుల సేవలను వినియోగించుకోవాలని కోరారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాయినాథ్, స్థానిక డాక్టర్ రాజేష్ గౌడ్ ఆస్పత్రిలోని సమస్యలను నేరుగా చూపించారు. […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్మిస్తున్న 461 శ్మశాన వాటికలు,143 రైతు వేదికల నిర్మాణాలు అక్టోబర్ 15 నాటికి పూర్తికావాలని కలెక్టర్ఎల్.శర్మన్ ఆదేశించారు. సంబంధిత ఇంజనీరింగ్అధికారులతో ఆయన సమీక్షించారు. వివిధ దశల్లో కొనసాగుతున్న పనులకు ఇప్పటివరకు బిల్లులు మంజూరు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో సర్పంచ్‌లు నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణ పనుల్లో పురోగతి లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కంప్లీట్ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఇంజనీరింగ్ చీఫ్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ రైతు […]
సారథి న్యూస్, అచ్చంపేట: ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నల్లమల సమీప ప్రాంత చెరువులు, కుంటలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు సభావత్ వెంకట్రాములు దంపతులు డిండి వాగులో బుధవారం సాయంత్రం చిక్కుకున్నారు. వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. వారిని రక్షించేందుకు ముఖ్యమంత్రి, సీఎస్‌లతో ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడి హెలిక్యాప్టర్ సాయం కోరారు. ప్రస్తుతం వారు డిండి వాగు మధ్యలోనే ఉండిపోయారు. […]
సారథి న్యూస్, బిజినేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్నసబ్సిడీ యంత్రపరికరాలను సద్వినియోగం చేసుకోవాలని ఏడీఏ రమేష్ బాబు సూచించారు. బుధవారం నాగర్ కర్నూల్జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి, వడ్డెమాన్గ్రామాల్లో 13 మంది రైతులకు గడ్డి కోసే మిషన్లను సబ్సిడీపై అందజేశారు. మిషన్ ధర రూ.25,800 ఉంటుందని, కేవలం 25శాతం డబ్బులు చెల్లిస్తే సరిపోతుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకుని అధిక లాభాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో నీతి, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, రైతు సమన్వయ మండలాధ్యక్షుడు […]
సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని లట్టుపల్లి పంచాయతీ ఉప సర్పంచ్సంతకాన్ని అదే గ్రామ సర్పంచ్ వెంకటయ్య కొడుకు ఫోర్జరీ చేసి రూ.1.44లక్షలు డ్రా చేశాడని ఆరోపిస్తూ.. గ్రామస్తులు, వార్డుసభ్యులు సోమవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ మనుచౌదరికి ఫిర్యాదు చేశారు. గ్రామంలో చేయని పనులకు రికార్డులు సృష్టించి సర్పంచ్ కుమారుడే చెక్కులపై సంతకాలు చేసుకుని ఎస్ టీవో ఆఫీసులో బిల్లులు డ్రా చేశాడని తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సారథి న్యూస్, బిజినేపల్లి: కొత్త రెవెన్యూ చట్టం అమలుచేసిన సందర్భంగా బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుర్మయ్య, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ బాల్ రాజ్ గౌడ్, రైతుసంఘం మండలాధ్యక్షుడు మహేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి, సర్పంచ్ లు శేఖర్ రెడ్డి, అవంతి, మహేష్ రావు, అశోక్, చందూలాల్, ఎంపీటీసీ బాలస్వామి, […]
సారథి న్యూస్, బిజినేపల్లి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన టీచర్లను నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో మంగళవారం డీఈవో గోవిందరాజులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. మండలంలోని వట్టెం బాలుర ప్రైమరీ స్కూలులో పనిచేస్తున్న ఉపాధ్యాయిని కల్పనను సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈవో కె.భాస్కర్‌రెడ్డి, టీచర్లు ఝాన్సీ, సురేష్ పాల్గొన్నారు.