Breaking News

ఉత్తమ టీచర్లకు ఘనసన్మానం

ఉత్తమ టీచర్లకు ఘనసన్మానం

సారథి న్యూస్, బిజినేపల్లి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన టీచర్లను నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో మంగళవారం డీఈవో గోవిందరాజులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. మండలంలోని వట్టెం బాలుర ప్రైమరీ స్కూలులో పనిచేస్తున్న ఉపాధ్యాయిని కల్పనను సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈవో కె.భాస్కర్​రెడ్డి, టీచర్లు ఝాన్సీ, సురేష్​ పాల్గొన్నారు.