సారథి న్యూస్, వాజేడు: భౌతికదూరం పాటించడం, నిరంతరం చేతులను శుభ్రపరుచుకోవడం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించి కరోనాను జయించాలని వాజేడు ఎంపీపీ శారద సూచించారు. శనివారం ములుగు జిల్లా వాజేడు మండలం ఆరుగుంటపల్లిలో ఆమె వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా గ్రామస్థులకు మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మంకిడి వెంకటేశ్వర్రావు , హెచ్ఎస్ కోటిరెడ్డి, హెచ్ఏ శ్రీనివాస్, ఆశాకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం కలకత్తా నుంచి హైదరాబాద్ కు ఛత్తీస్ గఢ్ మీదుగా వెళ్తున్న ట్రావెల్స్ బస్సు వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామం వద్ద పాడి గేదెలను ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు గేదెలు మృతిచెందాయి. డ్రైవర్, క్లీనర్పరారీలో ఉన్నారు.
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కొంగాల గ్రామంలో మంగళవారం వైద్యశిబిరం నిర్వహించారు. కాలానుగుణంగా వచ్చే వ్యాధులు, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి అవగాహన కల్పిస్తూ డాక్టర్ యమున సూచనలు చేశారు. ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్క్ లు కట్టుకోవడంతో పాటు చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.
సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలో సబ్‌రిజిస్ట్రార్‌కు పనిచేస్తున్న తస్లీమా.. నిబద్ధతతో విధులు నిర్వర్తించడమే కాక తన వద్దకు వచ్చిన నిరుపేదలకు తోచిన సాయం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్న నేపాల్‌కు చెందిన ధీరజ్ జోషి అనే గుర్ఖాకు గోధుమపిండి, నిత్యావసరసరుకులు పంపిణీ చేశారు. అనంతరం పందికుంట గ్రామానికి చెందిన అనిత అనే మహిళకు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వారి పిల్లల చదువులకు సంబంధించిన బాధ్యత […]
సారథిన్యూస్, ములుగు: మొక్కలతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. బుధవారం ఆమె ములుగు జిల్లాలోని తన జగ్గన్నపేటలో తల్లిదండ్రులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో వెంకన్న, రామచందర్, ముతయ్య భూషన్ తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, ములుగు: వెంకటాపురం మండలంలోని మరికాల గ్రామంలో ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మంగళవారం పర్యటించారు. హరితహారంలో భాగంగా మరికాల పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామంలోని ప్రతి ఇంటికి పూలు, పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని డంపింగ్ యార్డ్ పనులు, రైతు వేదిక పనులు పరిశీలించారు. ఆయన వెంట నుగూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బుచ్చయ్య, జడ్పీటీసీ రమణ, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో అనురాధ ఉన్నారు.
సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా వాజేడ్ మండలంలో ఓ కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాజేడ్, వెంకటాపురం మండలాల్లో 16 మందితో సన్నిహితంగా ఉన్నాడని తెలుసుకుని వారితో పాటు వారి కుటుంబసభ్యులను హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.
సారథి న్యూస్, ములుగు: ములుగు అంటేనే అడవులు ఉన్న ప్రాంతమని, అడవిని చూసినప్పుడు చెట్లు లేకపోవడం బాధేసిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం ఆమె ములుగు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఉపాధి హామీ, హరితహారం పథకాలపై సమీక్షించారు. అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమావేశంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కృష్ణఆదిత్య, జడ్పీ సీఈవో పారిజాతం, జడ్పీ చైర్మన్ జగదీష్, పీవో హనుమంతు పాల్గొన్నారు.